వేల కోట్ల ఆస్తి, సినిమాలు వదిలేసి పశువులు కాస్తున్న యంగ్ హీరో ఎవరో తెలుసా?

Published : Jun 06, 2025, 08:13 AM ISTUpdated : Jun 06, 2025, 08:23 AM IST

స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీకి వచ్చి హీరోలుగా సెటిల్ అవుతున్నారు. కొంత మంది తండ్రిని మించిన తనయులు అనిపించుకుంటున్నారు.ఓ యంగ్ హీరో మాత్రం వేల కోట్ల ఆస్తులు పక్కన పెట్టి కూలి పనులు చేసుకుంటున్నాడు. పశువులు కాస్తున్నాడు. ఇంతకీ ఎవరా హీరో?

PREV
14

ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, సూర్య, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు వారసత్వంగానే ఇండస్ట్రీలోకి వచ్చారు. కాని ఆతరువాత తమ టాలెంట్ ను నిరూపిచుకుని హీరోలుగా ఎదిగారు. ప్రస్తతం తండ్రిని మించిన తనయులు అనిపించుకుని, తమకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. 

అలాగే ఓ స్టార్ హీరో వారసుడు కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. సక్సెస్ అయ్యాడు, కాని ఎందుకో సడెన్ గా ఇండస్ట్రీని వదిలి పశువులు కాస్తున్నాడు, కూలి పనులకు వెళ్తున్నాడు. వేల కోట్ల ఆస్తిని వదిలి వ్యవసాయం చేసుకుంటున్న ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా?

24

ఆ హీరో ఎవరో కాదు మలయాళ ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలతో అద్భుతం చేసిన మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్. సినీరంగంలో ఒక్క సినిమాతోనే సంచలనం సృష్టించిన ఈ కుర్రాడు..ఓ అందమైన ప్రేమకథతో యూత్ ను ఆకట్టుకున్నాడు. ఇక వరుసగా సినిమాలు చేసి తండ్రి పేరు నిలబెడతాడు అనుకున్నారు ఫ్యాన్స్. కాని అందరికి షాక్ ఇచ్చాడు ప్రణవ్ మోహన్ లాల్. సినిమాలు వదిలేసి రోజూ కూలీ పనికి వెళ్తున్నాడు.

34

హీరోగా కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలు వదిలేసి గొర్రెలు కాస్తున్నాడు. అయితే అతను ఈ పనులు చేస్తున్నది ఇండియాలో కాదు ఫారెన్ లో. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడిగా ,కోట్ల ఆస్తిని, సినిమాలు వదిలేసి వ్యవసాయ పనులు చేస్తున్నాడు ప్రణవ్. 

బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. నటనతో మెప్పించాడు. ఓ వయసుకు వచ్చిన తరువాత ఇండస్ట్రీలో అన్ని విభాగాలపై పట్టు సాధించాడు. హీరోగా, దర్శకుడిగా, రచయితగా తనదైన ముద్ర వేశాడు ప్రణవ్ మోహన్ లాల్. తండ్రి బాటలోనే ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించాడు.

44

ఇక సడెన్ గా ఏమైయ్యిందో ఏమో కాని సినిమాలకు దూరమైపోయాడు. సామాన్యుడిగా జీవితం గడుపుతున్నాడు. చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం ఉన్న ప్రణవ్.. వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ.. స్పెయిన్ చేరుకున్నాడు. అక్కడే ఓ ఫామ్ హౌస్ లో ఉంటూ గొర్రెలు కాస్తున్నాడు, గుర్రాలను కూడా చూసుకుంటూ గడిపేస్తున్నాడు. 

ఈ విషయాన్ని ప్రణవ్ తల్లి, మోహన్ లాల్ సతీమణి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే అతను అక్కడ ఉంటున్న ఫామ్ హౌస్ వారిది కాదు. స్పెయిన్ లో ఓ ఫ్యామిలీ దగ్గర ఈ పనికి కుదిరాడట ప్రణవ్. భోజనం, షెల్టర్ ఇస్తారని జీతం మాత్రం ఉండదని గతంలో ఆయన తల్లి తెలిపారు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories