యాంకర్‌ సుమ హీరోయిన్‌గా చేసిన ఏకైక తెలుగు సినిమా ఏంటో తెలుసా? లెజెండరీ దర్శకుడు, క్రేజీ హీరో కాంబినేషన్‌

Published : Jun 05, 2025, 08:00 PM IST

సుమ కనకాల స్టార్‌ యాంకర్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె హీరోయిన్‌గానూ సినిమాలు చేసింది. కానీ తెలుగులో ఒకే ఒక్క మూవీలో హీరోయిన్‌గా నటించడం విశేషం.

PREV
16
స్టార్‌ యాంకర్‌గా రాణిస్తున్న సుమ కనకాల

యాంకర్‌ సుమ కనకాల(Suma Kanakala) తనదైన యాంకరింగ్‌తో అలరిస్తుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకర్‌గా రాణిస్తుంది. తెలుగులో అత్యంత సక్సెస్‌ఫుల్‌ యాంకర్‌గా మెప్పిస్తుంది. తన తర్వాత ఎంత మంది యాంకర్లు వచ్చినా, తనని కొట్టేవాళ్లు లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికీ అంతే బిజీగా ఉంటోంది సుమ. ఓ వైపు టీవీ షోస్‌, ఇంకోవైపు సినిమా ఈవెంట్లు, మరోవైపు ఇంటర్వ్యూలు చేస్తూ తీరిక లేకుండా ఉంటోంది యాంకర్‌ సుమ(Anchor Suma).

26
సుమ యాంకర్‌ లో మరో కోణం

సుమ కేవలం యాంకరింగ్‌కే పరిమితం కాదు, ఆమెలో మరో కోణం ఉంది. ఆమెలో మంచి నటి కూడా ఉంది. చాలా సినిమాల్లో నటించింది కూడా. ఆ మధ్య `జయమ్మ పంచాయితీ` చిత్రంలో మెయిన్‌ రోల్‌ చేసింది. కానీ ఆ సినిమా ఆడలేదు. అయితే సుమ నటిగానే కాదు, హీరోయిన్‌గానూ నటించడం విశేషం. ఇంకా చెప్పాలంటే ఆమె హీరోయిన్‌గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

36
హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయమైన సుమ

మలయాళ అమ్మాయి అయిన సుమ `కళ్యాణ ప్రాప్తిరస్తు` అనే చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. అది కూడా తెలుగు తెరకు కావడం విశేషం. 1996లో ఈ మూవీ విడుదలైంది. దీనికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించడం మరో విశేషం. సాయి శ్రీమల్‌ ఫిల్మ్స్ పతాకంపై ఎస్‌ మల్లేషం నిర్మాణంలో ఈ మూవీ రూపొందింది. కోటీ సంగీతం అందించారు.

46
సుమ సరసన హీరోగా నటించిన దర్శకుడు వక్కంతం వంశీ

ఇందులో నటించిన హీరో ఎవరో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన ఎవరో కాదు దర్శకుడు వక్కంతం వంశీ. నటుడిగా పరిచయమై, రైటర్‌గా మారిన వక్కంతం వంశీ ఆ మధ్య అల్లు అర్జున్‌తో `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` చిత్రానికి దర్శకత్వం వహించారు. కానీ ఇది డిజాస్టర్‌ అయ్యింది. అయితే వంశీ కెరీర్‌ ప్రారంభంలో నటుడిగా సినిమాలు చేశారు. అలా `కల్యాణ ప్రాప్తిరస్తు` సినిమాలో హీరోగా నటించారు. ఈ చిత్రంతోనే యాంకర్‌ సుమ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. కానీ ఈ సినిమా పెద్ద డిజాస్టర్‌ అయ్యింది.

56
యాంకర్‌ సుమ హీరోగా నటించిన సినిమాలు

అయినా తగ్గలేదు సుమ. తెలుగులో హీరోయిన్‌గా ఆఫర్లు రాకపోయినా మలయాళంలో హీరోయిన్‌గా చేసింది. అక్కడ `న్యూస్‌పేపర్‌ బాయ్‌`, `ఇష్టదనమ్‌`, `ఓరు విల్యుమ్‌ కతోర్థు` అనే చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి అక్కడి ఆడియెన్స్ ని అలరించింది. ఆ మూవీస్‌ కూడా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత తెలుగులో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుంది. 

66
సుమ నటించిన తెలుగు సినిమాలు

`పవిత్ర ప్రేమ`, `చాలా బాగుంది`, `పండంటి సంసారం`, `కలిసి నడుద్దాం`, `రాఘవ`, `వర్షం`, `స్వరాభిషేకం`, `ప్రేమికులు`, `ఢీ`, `బాద్షా` వంటి తెలుగు సినిమాలో చిన్న చిన్న రోల్స్ లో మెరిసింది సుమ. ఆమె నటించిన సినిమాలు ఆడకపోవడం, తన పాత్రలకు ప్రయారిటీ లేకపోవడంతో నటనకు ఫుల్‌ స్టాప్‌ పెట్టి తన బలం అయిన యాంకరింగ్‌ని నమ్ముకుంది. స్టార్‌ యాంకర్‌గా ఎదిగింది. ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది సుమ. నటుడు రాజీవ్‌ కనకాల ఆమె భర్త అనే విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories