ఎల్లో చీర కట్టి వెనక్కి తిరిగి చూసిన అనుష్క.. ఏకంగా 40 యాక్సిడెంట్లు, మొత్తం రచ్చ రచ్చ

Published : Jun 05, 2025, 10:39 PM IST

అల్లు అర్జున్‌, అనుష్క, మంచు మనోజ్‌ కలిసి నటించిన `వేదం` మూవీ 15ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ విషయం బయటకు వచ్చింది.

PREV
15
`ఘాటి` చిత్రంతో రాబోతున్న అనుష్క శెట్టి

అనుష్క శెట్టి ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో అలరిస్తోంది. అదే సమయంలో ఆమె చాలా సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తోంది. ప్రస్తుతం ఆమె `ఘాటి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

 `వేదం` చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇందులో అనుష్క విశ్వరూపం చూపించింది. అదిరిపోయే యాక్షన్‌తో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ఈ చిత్రం జులై 11న విడుదల కానుంది.

25
`వేదం` సినిమా వచ్చి 15 ఏళ్లు

ఇదిలా ఉంటే క్రిష్‌ దర్శకత్వంలో అనుష్క శెట్టి నటించిన `వేదం` మూవీ విడుదలై 15ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇందులో అనుష్క శెట్టితోపాటు అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌ కూడా నటించిన విషయం తెలిసిందే. బుధవారం ఈ మూవీ 15ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్‌ ఆ మెమొరీస్‌ని పంచుకున్నారు. 

అప్పటి షూటింగ్‌ స్టిల్స్ ని పంచుకొని తన సంతోషాన్ని వెల్లడించారు. తనకిది ఒక ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్ మూవీ అని, ఇందులో తనని ఎంచుకున్న దర్శకుడు క్రిష్‌కి ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్‌. ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లకి అభినందనలు తెలిపారు.

35
వేశ్య పాత్రలో నటించిన అనుష్క శెట్టి

ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. క్రిష్‌ పంచుకున్న విషయం వైరల్‌గా మారింది. ఈ మూవీలోని అనుష్క పోస్టర్‌ వల్ల నలభై యాక్సిడెంట్లు జరిగాయట. `వేదం` సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో నటించింది. 

ఇందులోని ఆమె పాత్రని ప్రతిబింబించేలా దర్శకుడు క్రిష్‌ ఒక పోస్టర్‌ని డిజైన్‌ చేయించారు. ఇందులో అనుష్క ఎల్లో శారీ కట్టుకుని వెనక్కి తిరిగి చూసింది. ఇది చాలా గ్లామరస్‌గా ఉంది. ఈ పోస్టర్‌ ని సిటీలో చాలా చోట్ల హోర్డింగ్‌లు పెట్టించారు.

45
ఎల్లో శారీలో అనుష్క.. ఏకంగా 40 యాక్సిడెంట్లు

పంజాగుట్టలో అనుష్క పోస్టర్‌తో హోర్డింగ్‌ పెట్టారట. ఇదే 40 యాక్సిడెంట్లకి కారణమయ్యిందట. ఈ విషయాన్ని క్రిష్‌ బయటపెట్టారు. అనుష్కని ఆ హోర్డింగ్‌లో చూసి చాలా మంది ఫిదా అయిపోయారట. దీంతో ఆమెని చూస్తూ వెహికల్స్ ని నడపడంతో యాక్సిడెంట్లు అయ్యాయట.

 ఇలా సుమారు 40 యాక్సిడెంట్లు జరిగాయని, ఇది గమనించిన పోలీసులు ఆ హోర్డింగ్‌ని తొలగించారట. అంతగా అనుష్క జనాలను చూపుతిప్పుకోకుండా చేసింది. ఓ రకంగా మాయ చేసింది. అనుష్క ఇలాంటి రోల్లో నటించడం అదే ఫస్ట్. అది కూడా జనం ఆశ్చర్యపోవడానికి కారణమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట రచ్చ చేస్తుంది.

55
అల్లు అర్జున్‌, అనుష్క సాహసం

అల్లు అర్జున్‌, అనుష్క శెట్టి, మంచు మనోజ్‌ కలిసి నటించిన `వేదం` మూవీ 2010 జూన్‌ 4న విడుదలైంది. క్రిష్‌ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అప్పట్లో ఒక డిఫరెంట్‌ ఎక్స్‌ పర్‌మెంట్‌. కమర్షియల్‌ హీరోగా నటిస్తున్న బన్నీ, అలాగే స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న అనుష్క ఇలాంటి మూవీ చేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. 

పైగా అనుష్క వేశ్య  పాత్రలో నటించింది. బోల్డ్ సీన్లు కూడా చేసింది. దీంతో ఈ మూవీ పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే బాక్సాఫీసు వద్ద మూవీకి మిశ్రమ స్పందన లభించింది. కానీ విమర్శకుల ప్రశంసలందుకుంది. పలు అవార్డులు అందుకుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories