షారుఖ్ ఖాన్ పోస్ట్‌ను విమర్శిస్తూ ఇన్ఫోసిస్ మాజీ అధికారి మోహన్‌దాస్ పై ఇలా పోస్ట్ చేశారు: “మతం పేరుతో అమాయక హిందువులను చంపినందుకు పాకిస్తాన్‌కు చెందిన ముస్లింలను జిహాదీ ఉగ్రవాదులు అని పిలవకపోవడం చాలా సిగ్గుచేటు షారుఖ్ ఖాన్. నిజాయితీ, అర్థం లేని బూటకపు మాటలతో దాచడానికి ప్రయత్నిస్తున్నారు.
జిహాదీ ఉగ్రవాదులను ఖండించడానికి ఒక్కసారైనా భారతీయుడిగా లేవండి షారుఖ్. అబద్ధాలు చెప్పడం మానేయండి. మీకు నిజంగా శ్రద్ధ ఉంటే, మీ దేశ పురుషులు, మహిళల విశ్వాసం కోసం లేవండి. ఇలాంటి విషయాల్లో కపటంగా, బూటకంగా ఉండటం మానేయండి” అని విమర్శించారు. ఈ విఫయంలో నెటిజన్లు కూడా కొంతమంది మాజీ అధికారికి సపోర్ట్ చేస్తుండగా.. మరికొంత మంది షారుఖ్ కు సపోర్ట్ చేస్తున్నారు.
Also Read: అమితాబచ్చన్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా, బిగ్ బీ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేదు?
Also Read: 10 హిట్లు వరుసగా కొట్టిన 38 ఏళ్ల స్టార్ కిడ్ ఎవరో తెలుసా? బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరో