మోహన్ బాబు బయోపిక్, మంచు విష్ణు నిర్మాత, మరి హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

Published : Feb 21, 2025, 11:53 AM IST

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు జీవితం వెండితెరపై ఆవిష్క్రుతం కాబోతోందా..?  మంచువారి బయోపిక్ ను భారీ స్థాయిలో నిర్మించబోతున్నారా..? మరి మోహన్ బాబు పాత్రలో కనిపించే హీరో ఎవరు? ఈ విషయంలో విష్ణు ఏం చెప్పారు. 

PREV
15
మోహన్ బాబు బయోపిక్, మంచు విష్ణు నిర్మాత, మరి హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

కలెక్షన్ కింగ్ , నట ప్రపూర్ణ, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మంచు మోహన్ బాబు బయోపిక్ కు రంగం సిద్దం అవుతోంది. దాదాపు 45 ఏళ్ళకు పైగా  ఇండస్ట్రీలో కొనసాగుతూ.. టాలీవుడ్ లో స్టార్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన మార్క్ ను చూపించిన మోహన్ బాబు.. తన వారసులను కూడా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చి  సినిమా ఫ్యామిలీ అనిపించుకున్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఎంతో కష్టపడి, ఎన్నో ఆటుపోట్లు ఫేస్ చేసి.. ఇండస్ట్రీలో నిలబడ్డారు మోహన్ బాబు. 

Also Read: 80 సినిమాలు చేసిన హీరోయిన్, స్టార్ క్రికెటర్ తో అఫైర్, 50 ఏళ్లు దాటినా బ్యాచిలర్ గా జీవిస్తోన్న బ్యూటీ ఎవరు?

25

ఇలా తన సినిమా జీవితంలో ఎదురైన కష్టనష్టాలు, కన్నీటి గాధను సినిమా రూపంలో ఆడియన్స్ కు, అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నారట త్వరలో. అంతే కాదు ఈసినిమాకు నిర్మాతగా మంచు వారి వారసుడు, మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు వ్యవహరించబోతున్నారు.

సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించినట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప సినిమా చేస్తున్నారు. మంచు వారు చాలా ప్రెస్టేజియస్ గా 200 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. 

Also Read: సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న త్రివిక్రమ్, నెక్ట్స్ ఏంటి.? మాటల మాంత్రికుడి ప్లాన్ మామూలుగా లేదుగా

35

మంచు విష్ణు కన్నప్పగా,బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడిగా, ప్రభాస్ నందిగా, మోహన్ లాల్ , శరత్ కుమార్ లాంటి స్టార్స్ అంతా కలిసి నటిస్తున్న ఈసినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈసినిమా నుంచి రిలీజ్ అయిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ సంబంధించిన  ఇంటర్వ్యూలోనే మోహన్ బాబు బయోపిక్ టాపిక్ వచ్చినట్టు తెలుస్తోంది. 

Also Read: 700 కోట్ల ఆస్తికి యజమాని, పాన్ వరల్డ్ ను ఏలుతున్న ఇండియాన్ హీరోయిన్ ను గుర్తుపట్టారా?

45

సోషల్ మీడియా సమాచారం ప్రకారం మంచు విష్ణు ను ఓ ప్రశ్న ఎదురయ్యింది. ప్రస్తుతం బయోపిక్ ల కాలం నడుస్తుంది  కదా. మరి మెహన్ బాబు గారి బయోపిక్ చేస్తున్నారా.. మీరు మీ నాన్న పాత్ర చేస్తారా అని అడిగారు. దాంతో మంచు విష్ణు మాట్లాడుతూ.. త్వరలోనే నాన్నగారి బయోపిక్ చేయాలనే ఆలోచన ఉంది. కాని ఆయన పాత్ర చేసేంత ధైర్యం నేను చేయను. ఆయన పడిన కష్టాలు, ఎదురైన సవాళ్లు.. అద్భుతంగా మోహన్ బాబుగారి పాత్రను చేయగల హీరోఒకరు ఉన్నారు. 

Also Read:రామ్ చరణ్ ను చిరంజీవి ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారో తెలుసా? మెగా ఫ్యాన్స్ కు పండగే.

55

ఆయన ఎవరో కాదు తమిళ స్టార్ హీరో సూర్యతో నాన్నగారి పాత్ర చేయిస్తాను. సినిమాను నేనే నిర్మిస్తాను అన్నారట మంచు విష్ణు. ఇక త్వరలో మంచువారి బయోపిక్ ను తెరపై చూడబోతున్నాం. ఇక సూర్య మోహన్ బాబు పాత్ర చేస్తారా..? చేస్తే ఎలా ఉంటారు. ఎవరు డైరెక్టర్ చేస్తారు. కథను ఎవరు రాస్తారు అనేది అందరిలో ఆసక్తి కర విషయంగా ఉంది. మరి చూడాలి ఈసినిమా నిజంగా పట్టాలెక్కుతుందా లేదా అని. ఇక కన్నప్ప మాత్రం రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు టీమ్. 

click me!

Recommended Stories