స్టైల్, ఫిట్నెస్ విషయంలో అప్పటి యువతకి పవన్ అంటే పిచ్చ క్రేజ్ ఉండేది. కానీ ఆయన రాజకీయాలతో బిజీగా ఉన్న టైంలో బాడీ గురించి ట్రోల్స్ చేయడంలో అర్థం లేదు అని ఫ్యాన్స్ అంటున్నారు. అది కూడా సాంప్రదాయ బద్దంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్న దృశ్యాలతో ఇలాంటి ట్రోల్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఆయన చేస్తున్న రాజకీయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చూడకుండా.. పొట్టని మాత్రం గమనించి ట్రోల్ చేయడం సిగ్గు చేటు అంటూ పవన్ అభిమానులు ట్రోలర్స్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.