Mohan Babu: రోడ్డున పడతాడని తెలిసినా.. మోహన్ బాబు చేసిన సాహసం, 7 ప్లాప్ ల తర్వాత బయటపడ్డ డైలాగ్ కింగ్..

Published : Oct 05, 2026, 11:08 AM IST

Mohan Babu: ఏవిషయంలో అయినా దూకుడుగా వెళ్తుంటాడు మంచు మోహన్ బాబు. నటుడిగా, నిర్మాతగా అలాంటి నిర్ణయాలు చాలా తీసుకున్నాడు. ఓ సారి పూర్తిగా మునిగిపోతాడని తెలిసినా ఆయన చేసిన సాహసం గురించి తెలుసా? చివరకు ఏమయ్యిందంటే?

PREV
15
హీరోగా, నిర్మాతగా మోహన్ బాబు దూకుడు.

తెలుగు చిత్రసీమలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటుడిగానే కాకుండా విజయవంతమైన నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. ఆయన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించారు. అయితే, ఒక నిర్మాతగా ఆయనను చిత్రపరిశ్రమలో దృఢంగా నిలబెట్టి, హీరోగా మాత్రమే కాదు. ఆర్థికంగా, వృత్తిపరంగా సరికొత్త మలుపు తిప్పిన సినిమా 'అల్లుడు గారు'.

25
మోహన్ బాబుని నిలబెట్టిన సినిమా..

1990కి ముందు మోహన్ బాబు నిర్మాతగా కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌ను నిలబెట్టడానికి ఒక సరైన బ్లాక్‌బస్టర్ హిట్ అత్యవసరమైంది. అటువంటి క్లిష్ట సమయంలో తమిళంలో మలయాళ రీమేక్‌గా వచ్చిన 'చిత్రం' సినిమా ఆధారంగా 'అల్లుడు గారు' చిత్రాన్ని నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నారు.

35
రాఘవేంద్రరావు మాస్టర్ ప్లాన్

ఈ సినిమాను డైరెక్ట్ చేయమని మోహన్ బాబు రాఘవేంద్ర రావు దగ్గరకు వెళ్లాడు. అప్పటికే చిరంజీవితో జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా చేస్తోన్న దర్శకేంద్రుడు.. మోహన్ బాబుతో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. అప్పుడు ఏమాత్రం మార్కెట్ లేని మోహన్ బాబుతో సినిమా ఏంటని.. స్టార్ డైరెక్టర్ ను చాలా మంది మందలించారట. కానీ ఆయన వెనకడుగు వేయలేదు.

మోహన్ బాబులోని నటుడిని, మాస్ పల్స్‌ను పక్కాగా తెలిసిన ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మోహన్ బాబు నటన, హాస్యం, సెంటిమెంట్, డ్రామా కలగలిసిన శైలికి తగినట్లుగా కథనంలో అనేక మార్పులు చేశారు. హీరోయిన్లుగా శోభన, రమ్యకృష్ణ నటించగా, శోభనతో మోహన్ బాబు కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది.

45
బాక్సాఫీస్ సంచలనం - నిర్మాతగా నిలబడ్డ మోహన్ బాబు..

1990లో విడుదలైన 'అల్లుడు గారు' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతకు ముందు వరుసగా 7 ప్లాప్ సినిమాల తరువాత అల్లుడిగారుతో హిట్ వచ్చింది మోహన్ బాబుకి. ఈసినిమా అన్ని కేంద్రాలలో శతదినోత్సవాలు (100 days) జరుపుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా తెచ్చిపెట్టిన భారీ లాభాలు మోహన్ బాబును ఆర్థికంగా నిలబెట్టడంతో పాటు ఒక స్టార్ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్‌లో స్థానం సంపాదించుకున్నాడు. 'అల్లుడు గారు' ఇచ్చిన గ్రాండ్ సక్సెస్ ఉత్సాహంతోనే మోహన్ బాబు వరుసగా 'అసెంబ్లీ రౌడీ', 'రౌడీగారి పెళ్లాం', 'బ్రహ్మ', ఆ తర్వాతి కాలంలో ఆల్ టైమ్ క్లాసిక్ 'పెదరాయుడు' వంటి భారీ బడ్జెట్ విజయోత్సవ చిత్రాలను నిర్మించగలిగారు.

55
సాహసమే నిలబెట్టింది..

ఈ సినిమా సక్సెస్ అవ్వకపోయి ఉంటే.. మోహన్ బాబు దాదాపుగా రోడ్డుమీదకు రావల్సిన పరిస్థితి. ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవలసి వచ్చేదట. కానీ ఇండస్ట్రీలో తాడో పేడో తేల్చుకోవాలన్న పట్టుదల, సంకల్పంతో మోహన్ బాబు ఈ సాహసం చేశాడు. కొన్ని చోట్ల డిస్టిబ్యూటర్స్ ఈసినిమా తీసుకోడానికి వెనకడుగు వేస్తుంటే.. ఆ ప్లేసుల్లో తానే స్యయంగా సినిమాను రిలీజ్ చేశాడు.

సమస్యల్లో ఉన్నప్పుడు ఒక సరైన ప్రాజెక్ట్ జీవితాన్నే ఎలా మార్చగలదో చెప్పడానికి 'అల్లుడు గారు' సినిమా ఒక ప్రత్యక్ష ఉదాహరణ. నటుడిగా ప్రతికూల పాత్రల (Villain) నుంచి హీరోగా మారి, ఆపై టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలలో ఒకటిగా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ను తీర్చిదిద్దడంలో ఈ చిత్రం మోహన్ బాబు కెరీర్‌లోనే గోల్డెన్ ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది.

Read more Photos on
click me!

Recommended Stories