OTT: ఓటీటీలో ఈ వారం మతిపోగొట్టే సినిమాలు రెడీ, సుహాస్ మూవీకి ఐఎండీబీలో 9 రేటింగ్.. అస్సలు మిస్ కావొద్దు

Published : Oct 05, 2026, 10:13 AM IST

OTT: అక్టోబర్‌ 5 నుంచి 11 వరకు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, జియోహాట్‌స్టార్‌లో 8 కొత్త సినిమాలు, సిరీస్‌లు, రియాలిటీ షోలు ఓటీటీలోకి రానున్నాయి.

PREV
14
OTT Movies

అక్టోబర్‌ 5 నుంచి 11 వరకు ఓటీటీ ప్రేక్షకుల కోసం పలు కొత్త సినిమాలు, సిరీస్‌లు, రియాలిటీ షోలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, జియోహాట్‌స్టార్‌ వంటి ఓటీటీలలో మొత్తం 8 కొత్త టైటిల్స్‌ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పరిణీతి చోప్రా నటించిన ‘రిపోర్టింగ్‌ లైవ్‌’, బెన్‌ అఫ్లెక్‌ ‘యానిమల్స్‌’, ‘క్యారీ’ వంటి సినిమాలతో పాటు పలు కొత్త సిరీస్‌లు ఇందులో ఉన్నాయి. సుహాస్ బ్లాక్ బస్టర్ మూవీ మండాడి కూడా ఓటీటీలోకి వస్తోంది.

24
నెట్‌ఫ్లిక్స్‌లో..

యానిమల్స్‌

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్‌

రిలీజ్ డేట్: అక్టోబర్‌ 9, 2026

బెన్‌ అఫ్లెక్‌ నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్స్‌’. ఇందులో ఆయన లాస్‌ ఏంజెల్స్‌ మేయర్‌ అభ్యర్థి మార్క్‌ కింబాల్‌గా కనిపిస్తారు. భార్య అబిగైల్‌తో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడిపే మార్క్‌ కుటుంబంలోకి అనుకోని సమస్య వస్తుంది.

వారి చిన్న కుమారుడు డబ్బు కోసం కిడ్నాప్‌ కావడంతో కుటుంబం మొత్తం సంక్షోభంలో పడుతుంది. కుమారుడిని కాపాడుకోవడానికి మార్క్‌ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేది కథలో కీలకంగా ఉంటుంది.

రిపోర్టింగ్‌ లైవ్‌

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్‌

రిలీజ్ డేట్: అక్టోబర్‌ 9, 2026

పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేటివ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రిపోర్టింగ్‌ లైవ్‌’. ఇందులో ఆమె ఆశయాలు ఉన్న యువ జర్నలిస్ట్‌గా కనిపిస్తారు. దేవన్‌ భోజానీ అనుభవజ్ఞుడైన కెమెరామ్యాన్‌గా నటించారు.

వీరిద్దరూ కలిసి శక్తివంతమైన సిండికేట్‌ నిర్వహిస్తున్న అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే ప్రమాదాల చుట్టూ కథ సాగుతుంది.

ఇన్‌సైడ్‌ ది సర్కిల్‌

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్‌

రిలీజ్ డేట్: అక్టోబర్‌ 7, 2026

మెక్సికన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘ఇన్‌సైడ్‌ ది సర్కిల్‌’లో నలుగురు జీవితకాల స్నేహితుల కథను చూపించారు. ఓ వీడియో లీక్‌ కావడం, ప్రముఖ నటి హత్యకు గురికావడంతో వారి జీవితాల్లో అనూహ్య పరిణామాలు మొదలవుతాయి.

బ్లాక్‌మెయిల్‌, రహస్యాలు, కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడటంతో వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో వారు ఎదుర్కొనే సంఘటనలే సిరీస్‌లో ప్రధానంగా ఉంటాయి.

బిలో

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్‌

రిలీజ్ డేట్: అక్టోబర్‌ 8, 2026

జోష్‌ హార్ట్‌నెట్‌ ప్రధాన పాత్రలో నటించిన ఆరు ఎపిసోడ్‌ల కెనడియన్‌ హారర్‌ డ్రామా ‘బిలో’. ఇందులో ఆయన కాల్విన్‌ పెన్నీ అనే స్థానిక మత్స్యకారుడి పాత్రలో కనిపిస్తారు.

తండ్రి మర్మమైన మరణం కాల్విన్‌ను వెంటాడుతుంటుంది. తన కుటుంబం, సమాజం, తాను నమ్ముకున్న జీవన విధానాన్ని కాపాడుకోవడానికి అతను పోరాటం చేయాల్సి వస్తుంది.

మందాడి

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్‌

రిలీజ్ డేట్: అక్టోబర్‌ 9, 2026

తమిళనాడు నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘మందాడి’. ఇందులో సోరి ముత్తుకాళిగా, సుహాస్‌ సాట్టాప్పులిగా నటించారు. ముత్తుకాళి గతంలో పడవ రేసుల్లో పాల్గొన్న మాజీ రేసర్‌.

చెన్నై నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడికి తన పాత ప్రత్యర్థి సాట్టాప్పులితో పోటీ మళ్లీ మొదలవుతుంది. దక్షిణ భారత సంప్రదాయ పడవ రేసింగ్‌ నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగే పోటీ చుట్టూ కథ సాగుతుంది. సంచలన విజయం సాధించిన ఈ మూవీ ఐఎండీబీలో 9 రేటింగ్ సాధించింది. 125 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

100 డేస్‌ ఆఫ్‌ డిసెప్షన్‌

ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్‌

రిలీజ్ డేట్: అక్టోబర్‌ 10, 2026

1932లో జపాన్‌ వలస పాలనలో ఉన్న జియోంగ్‌సియాంగ్‌ నేపథ్యంలో సాగే దక్షిణ కొరియా చారిత్రక గూఢచారి ప్రేమకథ ‘100 డేస్‌ ఆఫ్‌ డిసెప్షన్‌’. ఇందులో లీ గ్యా-క్యోంగ్‌ అనే జేబుదొంగ కీలక పాత్రలో ఉంటుంది.

ఆమె అనువాదకురాలిగా వేషం మార్చుకుని జపాన్‌ ప్రభుత్వ కార్యాలయంలోకి ప్రవేశించి 100 రోజుల గూఢచారి మిషన్‌ను చేపడుతుంది. అక్కడ ఉన్నత స్థాయి అనువాదకుడు కిమ్‌ టే-వూంగ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడుతుంది.

34
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో..

క్యారీ

ఎక్కడ చూడాలి: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

రిలీజ్ డేట్: అక్టోబర్‌ 7, 2026

‘క్యారీ’లో సమ్మర్‌ హెచ్‌. హోవెల్‌ క్యారీ వైట్‌గా నటించారు. సమాజానికి దూరంగా, తల్లి మార్గరెట్‌ వైట్‌ కఠినమైన నియంత్రణలో పెరిగిన యువతిగా క్యారీ కనిపిస్తుంది.

క్యారీ తల్లి ఆమెను బయటి ప్రపంచానికి దూరంగా ఉంచుతుంది. ఫ్యానాటికల్‌గా నియంత్రించే తల్లి కారణంగా క్యారీ జీవితం ఎలా సాగుతుంది, ఆమె ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటనేది ఈ కథలో చూపించారు.

44
జియోహాట్‌స్టార్‌లో..

పతి పత్నీ ఔర్‌ పంగా సీజన్‌ 2

ఎక్కడ చూడాలి: జియోహాట్‌స్టార్‌

రిలీజ్ డేట్: అక్టోబర్‌ 10, 2026

ప్రముఖ జంటలతో రూపొందిన సెలబ్రిటీ రియాలిటీ గేమ్‌ షో ‘పతి పత్నీ ఔర్‌ పంగా’ రెండో సీజన్‌తో తిరిగి వస్తోంది. ఇందులో జంటలు తమ కెమిస్ట్రీ, అనుబంధం, ఒకరినొకరు అర్థం చేసుకునే విధానాన్ని పరీక్షించే పలు సరదా సవాళ్లలో పాల్గొంటారు.

ఆటలు, టాస్క్‌లతో పాటు తమ వివాహ జీవితానికి సంబంధించిన విషయాలపై జంటలు బహిరంగంగా మాట్లాడతారు. ఈ సీజన్‌లో జంటల మధ్య జరిగే సరదా సంభాషణలు, పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories