Nani The Paradise: హీరో నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాపై నటి మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మూవీలోని విలన్ పాత్ర సీక్రెట్ ను బయటపెట్టింది. ఇంతకీ సీక్రెట్ ఏంటీ?
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ది ప్యారడైజ్”. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ‘దసరా’ సక్సెస్ తర్వాత మళ్లీ నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ రావడంతో టాలీవుడ్ అంతా ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నాని ది ప్యారడైజ్ సినిమా బిగ్ సీక్రెట్ రివీల్ చేసింది. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటీ?
25
నానితో మోహన్ బాబు
హీరో నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన తొలి గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
అయితే ఈ ప్రాజెక్ట్‌లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నారని చాలా రోజులుగా టాక్ వినిపిస్తుంది. ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఆ బహిరంగ రహస్యాన్ని తాజాగా మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి బయటపెట్టేసింది.
35
ప్రెస్ మీట్‌లో నోరు జారిన లక్మీ
తన రాబోయే ‘దక్ష’సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నాన్నగారు గారు నాని ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు’ అంటూ నోరుజారింది. వెంటనే తనని తాను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ, పబ్లిక్ రియాక్ట్ చూసి.. ‘ఈ విషయం ఇంకా అధికారికంగా చెప్పకపోయినా, నేను ఇప్పుడు ధృవీకరిస్తున్నాను. నాని కూడా దీనిపై ఎలాంటి అభ్యంతరం చెప్పరని నమ్ముతున్నాను” అని ఓపెన్ అయ్యింది.
ఆ తర్వాత మంచు లక్ష్మి మరో ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. ‘ఈ పాత్ర కోసం నాన్నగారు నిరంతరం జిమ్ చేస్తున్నారు. తన మసిల్స్ పెంచుకోవడానికి చాలా కష్టపడి వర్కౌట్స్ చేస్తున్నారు. ఈ వయసులో కూడా ప్రశాంతంగా గడపవచ్చు కానీ ఆయన తన పాత్ర కోసం చాలా డెడికేషన్ చూపిస్తున్నారు. మొత్తానికి న్యూ లుక్ లో కనిపిస్తారు. నాన్న లెటెస్ట్ ఫోటోలు చూసినప్పుడు నేనూ షాక్ అయ్యా’ అని లక్ష్మి గర్వంగా వెల్లడించింది.
తన తండ్రి మోహన్ బాబు సెట్ లో ప్రవర్తన గురించి కూడా మాట్లాడుతూ.. ‘సాధారణంగా సీనియర్ ఆర్టిస్టులు తమ హిస్టరీ, అనుభవం చూపిస్తారు. కానీ నాన్నగారు అయితే సెట్‌లో చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తారు. కొత్త డైరెక్టర్ అయినా, పెద్ద డైరెక్టర్ అయినా ఆయన ఎప్పుడూ అదే డెడికేషన్‌తో ఉంటారు” అని చెప్పుకొచ్చింది.
55
ది ప్యారడైజ్ పై పెరుగుతున్న అంచనాలు
మంచు లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మోహన్ బాబు – నాని మధ్య స్క్రీన్‌పై జరిగే ఢీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో మోహన్ బాబు కొత్తగా కనిపించబోతున్న విలన్ షేడ్ వేరే లెవెల్‌లో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. లక్ష్మి నోరు జారడంతో ప్యారడైజ్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి. ఈ విషయంలో అధికారిక ప్రకటన కోసం నాని ఫ్యాన్స్ ఎదురుచున్నారు.