వ్యక్తిత్వ హననం చేస్తున్నారు అంటూ నాగార్జునకే ఎదురుతిరిగిన హరీష్, ఫ్లోరా విషయంలో సంజన హైడ్రామా

Published : Sep 13, 2025, 11:34 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో శనివారం వీకెండ్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఫ్లోరా షైనీ, సంజన, హరిత హరీష్, ఇమ్మాన్యుయేల్ విషయంలో జరిగిన వివిధ వివాదాల గురించి నాగార్జున ప్రస్తావించారు. 

PREV
15
ఫ్లోరా షైనీ, సంజన వివాదం 

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో శనివారం వీకెండ్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. వీకెండ్ కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. తొలివారంలో ఇంటి సభ్యుల చేసిన తప్పులని ఎత్తి చూపుతూ, వారిని నాగ్ నిలదీశారు. దీనితో కొంత హీటెడ్ ఆర్గుమెంట్ నడిచింది. సంజన, హరీష్ లాంటి వారైతే హైడ్రామా క్రియేట్ చేశారు.  ముందుగా ఫ్లోరా షైనీ, సంజన విషయంలో జరిగిన వివాదంపై నాగార్జున ప్రశ్నించారు. ఫ్లోరా షైనీని ఫ్రీ బర్డ్ అని సంజన సంబోధించడంపై నాగార్జున ప్రశ్నించారు. ఆమెని ఫ్రీ బర్డ్ అని అనడంలో తప్పుగా ఎలాంటి మీనింగ్ లేదని సంజన వివరణ ఇచ్చింది. ఫ్రీ బర్డ్ అన్నందుకు సంజన.. ఫ్లోరా షైనీకి సారీ చెప్పింది. ఫ్లోరా షైనీ మాట్లాడుతూ సంజన తనని హౌస్ లో ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తోంది అని పేర్కొంది. ఫ్లోరాకి ఫుడ్ ఇవ్వకుండా సంజన అడ్డుకుంది అనే ఆరోపణలు కూడా ఎదుర్కొంది. అంతటితో వీరిద్దరి మధ్య వివాదం ముగియలేదు. 

25
కన్నీళ్లు పెట్టుకున్న సంజన 

ఫ్లోరా తనపై వల్గర్ కామెంట్స్ చేసింది అని సంజన ఆరోపించింది. సంజన ఫ్యామిలీని లాగుతూ వల్గర్ కామెంట్స్ చేసింది అనే ఆరోపణలు వినిపించాయి. అలా మాట్లాడినందుకు ఫ్లోరా సారీ చెప్పింది. కానీ ఆమె సారీని సంజన యాక్సెప్ట్ చేయలేదు. ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. తాను ఇక్కడికి అవమానాలు పడ్డానికి రాలేదని సంజన పేర్కొంది. శ్రీజ, తనూజ, రీతూ చౌదరి చేసిన తప్పులని కూడా నాగార్జున ప్రస్తావించి చర్చించారు.  అసలైన రచ్చ మొదలైంది హరీష్, ఇమ్మాన్యుయేల్ వివాదం గురించి చర్చ ప్రారంభించినప్పుడే. ఇమ్మాన్యుయేల్ హరీష్ ని గుండు అంకుల్ అని పిలవడం ఏంటి అని నాగార్జున ప్రశ్నించారు. గుండు అంకుల్ అని పిలవడం బాడీ షేమింగ్ చేయడమే అని నాగార్జున అన్నారు. ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. తాను సరదాకి మాత్రమే అలా అన్నానని, హరీష్ గారిని అవమానించే ఉద్దేశం తనకి లేదని ఇమ్మాన్యుయేల్ క్షమాపణ కోరారు. అయితే ఇమ్మాన్యూల్.. హరీష్ ని కేవలం సరదాకి మాత్రమే అలా అన్నట్లు మెజారిటీ సభ్యులు భావించారు. ఇతర సభ్యుల నుంచి వచ్చిన సపోర్ట్ చూసి ఇమ్మాన్యుయేల్ భావోద్వేగానికి గురయ్యారు.

35
హరీష్ పై నాగార్జున ఫైర్ 

ఆ తర్వాత హరీష్ ఇమ్మాన్యుయేల్ ని రెడ్ ఫ్లవర్ అని పిలవడం గురించి చర్చ జరిగింది. రెడ్ ఫ్లవర్ అనే మాట బ్యాడ్ వర్డ్ అని ఇంటి సభ్యులు కూడా అంగీకరించారు. హరీష్ చేసిన మరో బ్యాడ్ కామెంట్ గురించి నాగార్జున ఫైర్ అయ్యారు. భరణి, ఇమ్మాన్యుయేల్ ని హరీష్ ఆడవారితో పోల్చుతూ కామెంట్స్ చేసిన వీడియో ప్రదర్శించారు. హరీష్ అంటే నాకు ఇప్పటి వరకు ఆడవాళ్లకు గౌరవం ఇచ్చే వ్యక్తి అని అనిపించారు. కానీ ఇప్పటి నుంచి ఆ ఒపీనియన్ పోయింది. తన పేరు ముందు తన భార్య పేరు పెట్టుకోవడంతో అతడిపై నాకు గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు అది పోయింది అని నాగార్జున అన్నారు. 

45
వారిని ఆడవారితో పోల్చుతూ.. 

నేను తనూజ అనే అమ్మాయి.. ఇమ్మాన్యుయేల్, భరణి అనే మగవారితో పోరాడుతున్నానని అనుకున్నాను. కానీ అది నిజం కాదు.. తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి అనే ముగ్గురు ఆడవారితో పోరాడుతున్నాను అని అర్థం అయింది అని హరీష్ అన్నారు. అంటే భరణి, ఇమ్మాన్యుయేల్ లని కూడా తాను ఆడవారిగానే భావిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. ఈ విషయంలోనే నాగార్జున, హరీష్ మధ్య పెద్ద చర్చ జరిగింది. ఇతర సభ్యులు కూడా ఆడవాళ్లు అంటే చులకన భావం వ్యక్తం చేసేలా హరీష్ కామెంట్స్ ఉన్నాయని భావించారు. 

55
నా వ్యక్తిత్వ హననం జరుగుతోంది అంటూ ఎదురు తిరిగిన హరీష్ 

సంజన మాట్లాడుతూ హరీష్ గారికి ఆడవాళ్లు అంటే రెస్పెక్ట్ లేదు అని ఈ కామెంట్స్ తో అర్థం అవుతోంది. ఆయన మనసులో ఆడవాళ్లు అంటే చాలా చులకన భావం ఉంది అని తెలిపింది. దీనితో హరీష్ మాట్లాడుతూ.. ఇక్కడ నా వ్యక్తిత్వ హననం చేసేందుకు ఇందంతా జరుగుతున్నట్లు ఉంది అని నాగార్జునకే ఎదురు తిరిగారు. అవసరం అయితే తాను షో నుంచి కూడా బయటకి వెళ్ళిపోతా అని అన్నారు. నాగార్జున హరీష్ పై ఫైర్ అయ్యారు. చేసిన తప్పు ఒప్పుకోవాలని, నీకు ఆడవాళ్లపై మంచి అభిప్రాయం ఉన్నట్లు నిరూపించుకునేవరకు హరితా హరీష్ అని పిలవనని నాగార్జున అన్నారు. ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్నవారిలో ఎవరు సేవ్ అయ్యారో నాగార్జున రివీల్ చేశారు. రాము, రీతూ చౌదరి, తనూజ, ఇమ్మాన్యుయేల్, శ్రేష్ఠి వర్మ, ఫ్లోరా షైనీ, సుమన్, పవన్ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో తనూజ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. 

Read more Photos on
click me!

Recommended Stories