ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే నా లాంటి భార్య దక్కుతుంది.. తనకి కాబోయే భర్తపై తమన్నా కామెంట్స్

Published : Sep 13, 2025, 08:47 PM IST

Tamannaah: త‌మన్నా భాటియా తన జీవిత లక్ష్యం పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కావడం అని వెల్లడించారు. తనకి కాబోయే భర్త గురించి తమన్నా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

PREV
15
తమన్నా నటించిన 'డు యు వన్నా పార్టనర్'

తమన్నా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ డు యు వన్నా పార్టనర్ వెబ్ సిరీస్ రీసెంట్ గా ఓటీటీలో విడుదలయింది. ఈ వెబ్ సిరీస్ ప్రచార కార్యక్రమాల్లో తమన్నా ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ లో తమన్నాతో పాటు డయానా పెంటి కూడా నటించారు. ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తమన్నా తన లైఫ్ పార్ట్నర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

25
నా జీవిత లక్ష్యం అదే 

సాధారణంగా గ్లామర్ లైఫ్‌లో చాలా అరుదుగానే కనిపించే వ్యక్తిగత భావాలను ఈసారి త‌మన్నా పంచుకున్నారు. “నేను మంచి లైఫ్ పార్ట్నర్‌గా మారాలని ప్రయత్నిస్తున్నాను. ఇదే ప్రస్తుతం నా జీవిత లక్ష్యం” అని ఆమె స్పష్టంగా చెప్పారు. సాధారణంగా తమన్నా తన పర్సనల్ లైఫ్ గురించి బయట మాట్లాడరు. కానీ ఈ ఇంటర్వ్యూలో మాత్రం తన తన వ్యక్తిగత జీవితంలో మంచి భార్యగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని.. తనకి కాబోయే భర్త కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. 

35
నా భర్త అలా అనుకోవాలి 

ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి భార్య దొరకదు అని నాకు వచ్చే భర్త నన్ను చూసి అనుకోవాలి. అంత మంచి భార్యగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఆ అదృష్టవంతుడు ఎవరైనా సరే, వారికోసం నేను కష్టపడుతున్నాను. పర్ఫెక్ట్ ప్యాకేజ్ త్వరలోనే రానుంది” అని అన్నారు.

45
విజయ్ వర్మతో బ్రేకప్ త‌మన్నా

చేసిన ఈ వ్యాఖ్యలు ఆమె అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రారంభంలో నటుడు విజయ్ వర్మతో ఉన్న రిలేషన్ ముగిసిన తర్వాత, ఆమె వ్యక్తిగత జీవితంపై మీడియా, అభిమానుల దృష్టి మరింతగా కేంద్రీకృతమైంది.

55
తమన్నా కామెంట్స్ వైరల్ 

డు యు వన్నా పార్ట్నర్ అనే అమెజాన్ ప్రైమ్ వీడియో షోలో త‌మన్నా, డయానా పెంటీతో కలిసి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ షో ప్రమోషన్ సందర్భంగా త‌మన్నా తన వ్యక్తిగత జీవితం, భావాల గురించి ఇలా బహిరంగంగా మాట్లాడడం విశేషంగా మారింది.దీనితో తమన్నా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా, వెబ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, తన జీవిత లక్ష్యం పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్‌గా మారడం అని త‌మన్నా స్పష్టం చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమన్నా వయసు ప్రస్తుతం 35 ఏళ్ళు. కానీ ఆమె ఇంకా వివాహం చేసుకోలేదు. 

Read more Photos on
click me!

Recommended Stories