`మిస్‌ వరల్డ్ 2025` విన్నర్‌కి దక్కే ప్రైజ్‌ మనీ ఎంతో తెలుసా? ఒక్క దెబ్బతో లైఫ్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌

Published : May 24, 2025, 02:58 PM IST

`మిస్‌ వరల్డ్ 2025` పోటీలు హైదరాబాద్‌ వేదికగా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. మే 31న గ్రాండ్‌ ఫినాలే ఉండబోతుంది. అయితే మిస్‌ వరల్డ్ విన్నర్‌కి ఎంత ప్రైజ్‌మనీ వస్తుందనే వివరాలు బయటకు వచ్చాయి. 

PREV
16
హైదరాబాద్‌ వేదికగా గ్రాండ్‌గా `మిస్‌ వరల్డ్ 2025` పోటీలు

మిస్‌ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్‌ వేదికగా ఆద్యంతం సందడిగా సాగుతున్నాయి. మే 12న ప్రారంభమైన ఈ పోటీలు మరో వారం(మే 31) రోజుల్లో ముగియబోతుంది. దీంతో ప్రస్తుతం మిస్‌ వరల్డ్ పోటీలకు సంబంధించిన ఫిల్టర్ జరుగుతుంది. త్వరలో టాప్‌ 8 కంటెస్టెంట్లని ఫైనల్‌ చేయబోతున్నారు. ఇప్పటికే మిస్‌ వరల్డ్ టాలెంట్‌ ఫినాలే నిర్వహించారు. అలాగే హెడ్‌ టూ హెడ్‌ పోటీలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.

26
ఇండియా నుంచి `మిస్‌ వరల్డ్ 2025` పోటీల్లో పాల్గొంటున్న నందిని గుప్తా

ఈ నేపథ్యంలో మిస్‌ వరల్డ్ పోటీలు కీలక ఘట్టానికి చేరుకుంటున్నాయి.  కంటెస్టెంట్లలో ఉత్కంఠ నెలకొంది. ఈ సారి మన ఇండియా నుంచి రాజస్థాన్‌ కి చెందిన మిస్‌ ఇండియా విన్నర్‌ నందిని గుప్తా పార్టిసిపేట్‌ చేస్తుంది. టైటిల్‌ విన్నర్‌ లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తుంది. మరి ఈ సారి మిస్‌ వరల్డ్ కిరీటం మన ఇండియాకి దక్కుతుందా అనేది ఉత్కంఠగా మారింది.  

36
`మిస్‌ వరల్డ్ 2025` విన్నర్‌ ప్రైజ్‌ మనీ

ఇదిలా ఉంటే మిస్‌ వరల్డ్ పోటీల్లో టైటిల్‌ విన్నర్‌కి ప్రైజ్‌ మనీ ఎంత ఉంటుంది? విజేత ఎంత సంపాదిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే విన్నర్‌కి వచ్చే ప్రైజ్‌ మనీ ఎంతో తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే. విజేతకి ఏకంగా ఒక మిలియన్‌ డాలర్లు ప్రైజ్‌ మనీగా ఇస్తారట. అంటే మన ఇండియన్‌ కరెన్సీ ప్రకారం ఎనిమిది కోట్లు ప్రైజ్‌ మనీ రూపంలో దక్కుతుంది.

 ఒక్కసారి విన్నర్‌ అయ్యారంటే ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపు వస్తుంది. వరల్డ్ వైడ్‌ సెలబ్రిటీ అవుతుంది. ప్రపంచ స్థాయి యాడ్స్ వస్తాయి. కార్పొరేట్ కంపెనీలు ఆమె వెంటపడతాయి. ఇలా యాడ్స్ రూపంలో భారీగా సంపాదిస్తారు. డబ్బుల వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారి మిస్‌ వరల్డ్ టైటిల్‌ విన్నర్‌గా నిలిస్తే ఇక లైఫ్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

46
ఏడాదిపాటు మిస్‌ వరల్డ్ ఆర్గనైజేషన్‌కి రాయబారిగా

దీంతోపాటు ఏడాదిపాటు ఫుల్‌ బిజీగా ఉండాల్సి వస్తుంది. అనేక ఛారిటీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. అందుకోసం ప్రపంచం మొత్తం తిరగాల్సి వస్తుంది. ఈ ఈవెంట్లకు అయ్యే ఖర్చు స్పాన్సర్లు భరిస్తారు. అందుకోసం తిరిగే మిస్‌ వరల్డ్ విన్నర్‌ ఖర్చులు కూడా వారే భరిస్తారు. వారికి లగ్జరీ సదుపాయాలు కల్పిస్తారు. దీంతోపాటు `బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌` పేరుతో కార్యక్రమం నిర్వహిస్తారు. మిస్‌ వరల్డ్ ఆర్గనైజేషన్‌ తరఫున ఈ కార్యక్రమం ఉంటుంది.

56
పేద, అనాథ, ఫిజికల్‌ ఛాలెంజ్డ్ పిల్లలకు అండగా

దీనికి ఏడాది పాటు రాయబారిగా విజేత వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ ఛారిటీ కార్యక్రమాల్లో వచ్చిన అమౌంట్‌ని అనాథ పిల్లలకు, మానసికంగా, ఫిజికల్‌గా పలు సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సహాయం అందిస్తారు. వారికి ఆరోగ్యం, విద్య, జీవన పరిస్థితులు మెరుగు పరిచేందుకు, బెటర్‌ లైఫ్‌ ఇచ్చేందుకు, వారికి ట్రీట్‌మెంట్‌కి కావాల్సిన మనీని ఈ ఆర్గనైజేషన్‌ ఇలా ఛారిటీల ద్వారా సమకూరుస్తుంది. వారికి ఖర్చు పెడుతుంది.

66
1951లో ప్రారంభమైన మిస్‌ వరల్డ్ పోటీలు

మిస్‌ వరల్డ్ పోటీలు మొదటగా 1951లో ప్రారంభమయ్యాయి. యూకే బేస్డ్ గా దీన్ని ప్రారంభించారు. మిస్‌ వరల్డ్ పోటీల్లో భాగంగా దీనితోపాటు మిస్‌ యూనివర్స్, మిస్‌ ఇంటర్నేషనల్‌, మిస్‌ ఎర్త్ పేరుతో కూడా పోటీలను నిర్వహిస్తారు. గతేడాది ముంబయిలో మిస్‌ వరల్డ్ పోటీలు జరిగాయి. చెక్‌ రిపబ్లిక్‌ కి చెందిన అందగత్తె క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచింది. ఈ ఏడాది ఆ కిరీటం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories