విశాల్ ని పెళ్లిచేసుకోబోతున్న సాయి ధన్సిక తెలుగులో నటించిన సినిమాలివే.. హిట్టా? ఫట్టా?

Published : May 24, 2025, 09:37 AM ISTUpdated : May 24, 2025, 03:40 PM IST

విశాల్‌, సాయి ధన్సిక త్వరలో ఒక్కటి కాబోతున్నారు. ఇటీవల తమ పెళ్లి డేట్‌ని కూడా ప్రకటించారు. ఈ క్రమంలో హీరోయిన్‌ సాయి ధన్సిక తెలుగులో నటించిన సినిమాలేంటో తెలుసుకుందాం. 

PREV
15
హీరోయిన్‌ సాయిధన్సికతో విశాల్‌ వివాహం

కోలీవుడ్‌ స్టార్‌ విశాల్‌ తెలుగు ఆడియెన్స్ కి కూడా సుపరిచితమే. ఆయన నటించిన ప్రతి సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ ఏక కాలంలో విడుదలవుతుంది. ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందుతుంటాయి. తమిళంకి సమానంగా తెలుగులోనూ విశాల్ కి మార్కెట్‌ ఉంది. అందుకే విశాల్‌ తెలుగులో హీరోగానూ చెలామణి అవుతుంటారు. ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న విశాల్ త్వరలో హీరోయిన్‌ సాయి ధన్సికని వివాహం చేసుకోబోతున్నారు. 

25
ఆగస్ట్ 29న మ్యారేజ్‌ చేసుకోబోతున్న విశాల్‌, సాయి ధన్సిక

అనేక మంది హీరోయిన్లతో డేటింగ్‌ రూమర్ల అనంతరం కోలీవుడ్‌ హీరోయిన్‌ సాయి ధన్సికని విశాల్‌ మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల `యోగి ద` సినిమా ఈవెంట్‌లో తమ ప్రేమని, పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 29న తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు సాయి ధన్సిక ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆగస్ట్ 29 విశాల్‌ పుట్టిన రోజు కావడం విశేషం.

35
రజనీకాంత్‌ `కబాలి`తో పాపులర్‌ అయిన సాయి ధన్సిక

ఇదిలా ఉంటే సాయి ధన్సిక రజనీకాంత్‌ `కబాలి` మూవీతో పాపులర్‌ అయ్యింది. ఇందులో రజనీ కూతురిగా కనిపించింది. అదిరిపోయే యాక్షన్‌ సీన్లు చేసి మెప్పించింది. అయితే అంతకు ముందే తమిళంలో చాలా సినిమాలు చేసింది సాయి ధన్సిక. 

కానీ అవి పెద్దగా గుర్తింపు తీసుకు రాలేకపోయాయి. ఈ క్రమంలో `కబాలి` ఆమెకి లైఫ్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత హీరోయిన్‌గా టర్న్ తీసుకుని పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

45
సాయి ధన్సిక తెలుగు సినిమాలు

తెలుగులోనూ సినిమాలు చేసింది సాయి ధన్సిక. ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మూడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించడం విశేషం. 2022లో `షికారు` మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది సాయి ధన్సిక. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 

ఆ తర్వాత రెండేళ్లకి `అంతిమ తీర్పు` సినిమాలో నటించింది. థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో విమల రామన్‌, గణేష్‌ వెంకట్రామ్‌, సాయి ధన్సిక ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా కథ సాయి ధన్సిక పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కథా బలం ఉన్న ఈ మూవీలో సాయి ధన్సిక అద్భుతమైన నటనతో అదరగొట్టింది. కానీ సినిమా పెద్దగా ఆదరణ పొందలేదు.

55
టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోయిన సాయి ధన్సిక

ఆ తర్వాత అదే ఏడాది `దక్షిణ` అన మరో క్రైమ్‌ యాక్షన్‌ మూవీలో నటించింది. ఇందులోనూ ఆమెదే మెయిల్‌ రోల్‌. యాక్షన్‌ తో కూడిన పాత్రలో మరోసారి అదరగొట్టింది సాయి ధన్సిక. కానీ ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. 

దీంతో సాయి ధన్సికకి ఆఫర్లు తగ్గాయి. తెలుగులో ఇప్పుడు మరే సినిమాలోనూ నటించడం లేదు. తమిళంలోనూ మూవీస్‌ తగ్గాయి. ఈ క్రమంలో త్వరలో ఆమె విశాల్‌ని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ కాబోతుండటం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories