Miss World 2025 Winner ఓపల్‌ సుచాతకి దక్కే ప్రైజ్‌ మనీ ఎన్ని కోట్లో తెలుసా? బెనిఫిట్స్.. ఏకంగా రాయల్‌ లైఫ్‌

Published : May 31, 2025, 10:56 PM ISTUpdated : May 31, 2025, 11:36 PM IST

మిస్‌ వరల్డ్ 2025 పోటీలు ముగిశాయి. థాయిలాండ్‌ అందగత్తె ఓపల్‌ సుచాత చువాంగ్‌శ్రీ మిస్‌ వరల్డ్ 2025 కిరీటం సొంతం చేసుకుంది. 108 మంది అందగత్తెలు పాల్గొన్న ఈ పోటీలో థాయిలాండ్‌ అమ్మాయి విన్నర్‌గా నిలవడం విశేషం.

PREV
15
మిస్‌ వరల్డ్ 2025 విన్నర్‌గా థాయిలాండ్‌ అందగత్తె ఓపల్‌ సుచాత చువాంగ్‌శ్రీ

మిస్‌ వరల్డ్ 2025 అందాల పోటీలు హైదరాబాద్‌ వేదికగా గత ఇరవై రోజులుగా రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ అందాల పోటీలు ముగిశాయి. శనివారం సాయంత్రం ఆద్యంతం గ్రాండ్‌గా, ఉత్కంఠభరింతంగా జరిగిన ఈ వేడుకలో విన్నర్‌ ఎవరో తేలిపోయింది. థాయిలాండ్‌ సుందరి ఓపల్‌ సుచాత చువాంగ్‌శ్రీ విజేతగా నిలిచింది. మిస్‌ వరల్డ్ 2025 అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది.

25
మిస్‌ వరల్డ్ విన్నర్ గా నిలిచిన తొలి థాయిలాండ్‌ అమ్మాయి సుచాత చువాంగ్‌శ్రీ

థాయిలాండ్ నుంచి మిస్‌ వరల్డ్ టైటిల్‌ నెగ్గిన తొలి అమ్మాయిగా ఓపల్‌ చరిత్ర సృష్టించింది. దాదాపు డెబ్బై నాలుగు ఏళ్ల మిస్‌ వరల్డ్ చరిత్రలో ఎప్పుడూ థాయిలాండ్‌ అమ్మాయి ఫైనల్‌కి రాలేదు. 

ఈ క్రమంలో తాజాగా ఓపల్‌ సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు. ఆమె అంతకు ముందే మిస్‌ యూనివర్స్ థాయిలాండ్‌ 2024 విన్నర్‌గా నిలిచింది.  అలాగే మిస్‌ యూనివర్స్ 2024 పోటీల్లో పాల్గొని థర్డ్ రన్నరప్‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే మిస్‌ వరల్డ్ 2025 విజేతగా నిలిచిన ఓపల్‌ సుచాతకి ఎంత ప్రైజ్‌ మనీ దక్కుతుంది. ఎలాంటి బెనిఫిట్స్ ఆమె పొందనుంది అనేది తెలుసుకుందాం.

35
మిస్‌ వరల్డ్ విన్నర్‌కి దక్కే ప్రైజ్‌ మనీ

మిస్‌ వరల్డ్ 2025 కిరీటం విజేతకి దక్కే ప్రైజ్‌ మనీ ఎంతో తెలిస్తే మాత్రం మైండ్‌ బ్లాక్‌ అవ్వాల్సిందే. విజేతలకు ఏకంగా ఒక మిలియన్‌ డాలర్లు ప్రైజ్‌ మనీ కింద అందిస్తారు. అంటే మన ఇండియన్‌ కరెన్సీ ప్రకారం ఎనిమిదన్నర(8.4) కోట్లు ప్రైజ్‌ మనీ రూపంలో దక్కనుంది.

దీంతో ఒక్కసారి విన్నర్‌ అయ్యారంటే లైఫ్‌ సెట్‌ అయిపోయినట్టే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు వారి లైఫ్‌ ఓవర్‌ నైట్‌లో మారిపోతుంది. ఓవర్‌ నైట్‌లో ప్రపంచంలోనే స్టార్‌గా అవతరిస్తారు. ఇప్పుడు ఓపల్‌ కూడా వరల్డ్ స్టార్‌గా మారిపోవడం విశేషం.

45
మిస్‌ వరల్డ్ విన్నర్‌ ఏడాదిపాటు రాయల్‌ లైఫ్‌

మిస్‌ వరల్డ్ విన్నర్ గా నిలిచిన తర్వాత ఇక వారికి కమర్షియల్‌ యాడ్స్ కి కొదవలేదు. ప్రపంచ స్థాయి బ్రాండ్స్ ఆమె వెంటపడతాయి. కోట్లు కుమ్మరించి తమ బ్రాండ్లని ప్రమోట్‌ చేయాలని రిక్వెస్ట్ చేస్తుంటారు. కేవలం ప్రైజ్‌ మనీనే కాదు, ఇలా యాడ్స్ రూపంలోనూ వారు డబుల్‌ సంపాదిస్తారని చెప్పొచ్చు.

దీంతోపాటు ఏడాదిపాటు ఫుల్‌ బిజీగా ఉండాల్సి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఛారిటీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. అందుకోసం ప్రపంచం మొత్తం తిరగాల్సి వస్తుంది. ఈ ఈవెంట్లకు అయ్యే ఖర్చు స్పాన్సర్లు భరిస్తారు. 

ఈవెంట్లలో పాల్గొనే మిస్‌ వరల్డ్ విన్నర్‌ కి అయ్యే ఖర్చులు కూడా వారే భరిస్తారు. లగ్జరీ సదుపాయాలు కల్పిస్తారు. ఓ రకంగా ఏడాదిపాటు మిస్‌ వరల్డ్ విజేతలు రాయల్‌ లైఫ్‌ అనుభవిస్తారని చెప్పొచ్చు.

55
ఓపల్‌ సుచాత చువాంగ్‌శ్రీ దారెటు ?

దీంతోపాటు `బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌` పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మిస్‌ వరల్డ్ ఆర్గనైజేషన్‌ తరఫున ఈ కార్యక్రమాలు ఉంటాయి. మిస్‌ వరల్డ్ ఆర్గనైజేషన్‌కి ఏడాది పాటు రాయబారిగా మిస్‌ వరల్డ్ విజేత వ్యవహరించాల్సి ఉంటుంది. 

ఇది నిర్వహించే ఛారిటీ కార్యక్రమాల్లో వచ్చిన అమౌంట్‌ని అనాథ పిల్లలకు, మానసికంగా, ఫిజికల్‌గా పలు సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సహాయం అందిస్తారు.  

ఇప్పుడు మిస్‌ వరల్డ్ 2025 విన్నర్‌గా నిలిచిన థాయిలాండ్‌ అందగత్తె ఓపల్‌ సుచాత ప్రపంచ స్థాయి సెలబ్రిటీ అయిపోయింది. ఏడాదిపాటు ఆమె బిజీగా గడపబోతుంది.  

దీంతోపాటు వరుసగా సినిమా అవకాశాలు కూడా వస్తుంటాయి. ఆమె ఒప్పుకుంటే, సినిమాలు సక్సెస్‌ అయితే ఇక ఆమెకి తిరుగులేదని చెప్పొచ్చు. మరి ఓపల్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కెరీర్‌ని ఎలా మలుచుకుంటుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories