చిరంజీవికి ప్రాణ స్నేహితుడిగా సూపర్ స్టార్ కృష్ణ.. ఈ కాంబినేషన్ ఎలా మిస్ అయింది ?

Published : May 31, 2025, 01:13 PM IST

ఓ చిత్రంలో చిరంజీవి ప్రాణ స్నేహితుడిగా సూపర్ స్టార్ కృష్ణని నటింపజేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ కాంబినేషన్ ఎందుకు కుదరలేదు అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
కృష్ణ, చిరంజీవి చిత్రాలు

సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో చాలా మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ కలిసి మూడు చిత్రాల్లో నటించారు. చివరగా వీళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రం తోడుదొంగలు 1981లో రిలీజ్ అయింది. ఈ మూవీలో ఇద్దరు హీరోలుగా నటించారు. అంతకుముందు కొత్త అల్లుడు చిత్రంలో కృష్ణ హీరోగా నటించగా చిరంజీవి విలన్ పాత్ర పోషించారు.

25
నెరవేరని ఫ్యాన్స్ కోరిక

తోడుదొంగలు చిత్రం తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించింది లేదు. ఖైదీ చిత్రంతో చిరంజీవి స్టార్ గా ఎదిగారు. సూపర్ స్టార్ కృష్ణ అప్పటికే తిరుగులేని హీరో. దీంతో ఎవరి చిత్రాలతో వారు బిజీ అయిపోయారు. తోడుదొంగలు రిలీజ్ అయిన 18 ఏళ్ల తర్వాత చిరంజీవి, కృష్ణ కలిసి నటించే అవకాశం వచ్చింది. ఫ్యాన్స్ కూడా కృష్ణ, చిరంజీవి కలిసి నటించాలని కోరుకునేవారు. కానీ వారి కోరిక నెరవేరలేదు.

35
స్నేహం కోసం మూవీ

1999లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చిరంజీవి స్నేహం కోసం అనే చిత్రంలో నటించారు. ఈ మూవీలో చిరంజీవి డ్యూయెల్ రోల్ పోషించారు. ఈ మూవీలో చిరు వయసు పైబడిన తండ్రిగా, కొడుకుగా నటించారు. చిరంజీవి వృద్ధుడి పాత్రకి స్నేహితుడిగా తమిళ నటుడు విజయ్ కుమార్ నటించారు. వీళ్ళిద్దరూ ఈ చిత్రంలో ప్రాణ స్నేహితులుగా కనిపిస్తారు.

45
చిరంజీవికి స్నేహితుడి పాత్రలో..

అయితే ఈ పాత్ర కోసం ముందుగా నిర్మాత ఏఎం రత్నం సూపర్ స్టార్ కృష్ణ ని సంప్రదించాలనుకున్నారట. దర్శకుడు కేఎస్ రవికుమార్, చిరంజీవి కూడా అంగీకారం తెలిపారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ వృద్ధుడి పాత్రల్లో నటించరని నిర్మాత ఏఎం రత్నంకి వేరే వాళ్ల ద్వారా తెలిసింది. దీంతో ఆయన ఆ ఆలోచన విరమించుకున్నారు. కృష్ణ నటించరని తెలియడంతో విజయ్ కుమార్ ని తీసుకున్నారు. 

55
ప్రాణ స్నేహితులుగా కృష్ణ, చిరంజీవి

ఒకవేళ ఈ చిత్రానికి సూపర్ స్టార్ కృష్ణ అంగీకారం తెలిపి ఉంటే.. కృష్ణ, చిరంజీవి ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా కనిపించేవారు. ఈ మూవీలో చిరంజీవి, విజయ్ కుమార్ మధ్య సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. 

Read more Photos on
click me!

Recommended Stories