మిస్‌ వరల్డ్ 2025 టాలెంట్‌ షో ఫినాలే.. విన్నర్‌ ఎవరో తేలిపోయింది, ఇండియాకి షాక్‌

Published : May 23, 2025, 05:07 PM IST

మిస్‌ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించిన క్రేజీ అప్‌ డేట్‌ వచ్చింది. 24 మంది అందగత్తెలతో ఏర్పాటు చేసిన టాలెంట్‌ షో ఫినాలేలో విన్నర్‌ ఎవరో తేలిపోయింది. కానీ ఇండియాకి షాక్‌ తగిలింది. 

PREV
15
గ్రాండ్‌గా జరిగిన మిస్‌ వరల్డ్ టాలెంట్‌ షో ఫినాలే

మిస్‌ వరల్డ్ 2025 పోటీలు చివరి దశకు చేరుకుంటున్నాయి. మరో వారంలో ఈ పోటీలు ముగియబోతున్నాయి. ఈ క్రమంలో మిస్‌ వరల్డ్ పోటీల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే క్వార్టర్‌ ఫైనల్‌ ఎంపిక జరిగింది. ఆ తర్వాత టాలెంట్‌ షో ఫినాలకేకి 24 మంది అందగత్తెలను ఎంపిక చేశారు. ఇందులో మన ఇండియా నుంచి నందిని గుప్తా కూడా పాల్గొన్నారు.

25
మిస్‌ వరల్డ్ ఫినాలే టాప్‌ 10 ఎంపిక

ఇక ఈ రోజు బుధవారం గ్రాండ్‌ ఫినాలేకి టాప్‌ 10 సుందరీమణులను ఎంపిక చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఇది ఫైనల్ కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా దీనికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. టాలెంట్‌ షో ఫినాలే పోటీలు జరగ్గా విన్నర్‌ ఎవరో తేలిపోయింది. శిల్పారామం వేదికగా జరిగిన ఈ పోటీల్లో 24 దేశాల అందగత్తెలు పాల్గొన్నారు.

35
మిస్‌ వరల్డ్ టాలెంట్‌ ఫినాలే విన్నర్‌ ఇండోనేషియ అందగత్తె

ఈ పోటీల్లో ఇండోనేషియా సుందరి విన్నర్‌గా నిలిచింది. ఇండోనేషియాకి చెందిన మోనికా కేజియా సెంబిరింగ్‌ పియానో వాయిస్తూ, పాట పాడుతూ మైమరపింప చేసింది. మొదటి స్థానం దక్కించుకుంది. రెండో స్థానంలో మిస్‌ కామెరూన్‌ ఇస్సే ప్రిన్సెస్‌ నిలిచింది. ఆమె పాటపాడుతూ అలరించింది. ఇటలీ అమ్మడు చైరా ఎస్పోసిటీ తన బ్యాలే నృత్యంతో ఆకట్టుకుని మూడో స్థానం సొంతం చేసుకుంది. ఈ పోటీల్లో మన ఇండియా అమ్మాయి నందిని గుప్తా సత్తా చాటలేకపోయింది.

45
తెలంగాణ ఫోక్‌ సాంగ్‌తో ఉర్రూతలూగించిన మిస్‌ వరల్డ్ అందగత్తెలు

ఇక ఈ పోటీల్లో భాగంగా అందగత్తెలు మన తెలంగాణ జానపద పాటలకు డాన్సులు చేయడం విశేషం. మిస్‌ నైజీరియా తెలంగాణ ఫోక్‌ సాంగ్‌ `రాను బొంబైకి రాను` అనే పాటకి డాన్స్ చేసి ఉర్రూతలూగించింది. ఎస్టోనియా కంటెస్టెంట్ చేసిన ఫ్లోర్‌ డాన్స్ అదిరిపోయింది. బ్రెజిల్‌ అందగత్తె `ఐ లవ్‌ స్టోరీస్‌` అనే పాటని పాడి ఆడియెన్స్ ని మైమరపింప చేసింది. అర్జెంటీనా అమ్మాయి అర్బన్ డాన్స్ మూమెంట్స్ తో మెస్మరైజ్‌ చేసింది. శ్రీలంక అందగత్తె వారి సాంప్రదాయ సింహళి నృత్యంతో ఆకట్టుకోవడం విశేషం.

55
మే 31న మిస్‌ వరల్డ్ గ్రాండ్‌ ఫినాలే

దాదాపు ఇరవై రోజులపాటు సాగే ఈ 72వ మిస్‌ వరల్డ్ పోటీలు ఈ నెల 12న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. దాదాపు 110 దేశాల నుంచి సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. వారంతా ఓ వైపు పోటీల్లో పాల్గొంటూ, మరోవైపు తెలంగాణ కల్చర్‌ని ఎక్స్ ప్లోర్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ నెల 31న మిస్‌ వరల్డ్ పోటీలకు సంబంధించిన గ్రాండ్‌ ఫినాలే జరగబోతుంది. మరి ఇందులో మన రాజస్థానీ అమ్మాయి నందిని గుప్తా టాప్‌ 10లో స్థానం సంపాదిస్తుందా? విన్నర్‌గా నిలుస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories