రవి మోహన్, ఆర్తి విడాకుల కేసు.. సోషల్ మీడియా ఆరోపణలపై హైకోర్టు స్ట్రాంగ్ రియాక్షన్

Published : May 23, 2025, 04:27 PM IST

నటుడు రవి మోహన్, ఆర్తి దంపతుల విడాకుల కేసులో చెన్నై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

PREV
14
రవి మోహన్, ఆర్తి విడాకుల కేసు

నటుడు రవి మోహన్, ఆయన భార్య ఆర్తి 17 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ చెన్నై కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉంది. తనకూ, తన పిల్లలకూ నెలకు 40 లక్షలు ఇవ్వాలని ఆర్తి రవి కోరారు. ఈ కేసులో రవి మోహన్ తరపు వివరణ ఇవ్వాలని జూన్ 12న న్యాయస్థానం వాయిదా వేసింది.

24
ఒకరిపై ఒకరు ఆరోపణలు

న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతున్న తరుణంలో రవి మోహన్, ఆర్తి రవి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనపై ఆర్తి, ఆమె తల్లి సుజాత విజయకుమార్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాలని రవి మోహన్ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు.

34
హైకోర్టులో విచారణ

ఈ పిటిషన్ పై జస్టిస్ స్వామినాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువైపులా హాజరైన సీనియర్ న్యాయవాదులు ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని హామీ ఇచ్చారు. ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటామని తెలిపారు. ఇరువురి గురించి సోషల్ మీడియాలో వార్తలు రాకుండా ఆంక్షలు విధించాలని కోరారు.

44
కెనీషా ఫ్రాన్సిస్ తో రవి మోహన్ రిలేషన్

దీన్ని అంగీకరించిన న్యాయమూర్తి, ఇరువైపులా ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించారు. ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. ఇరువురి గురించి సోషల్ మీడియాలో చర్చించడం, వార్తలు ప్రసారం చేయడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా రవి మోహన్ ప్రస్తుతం సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ తో రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories