`మిస్‌ వరల్డ్ 2025` గ్రాండ్‌ ఫినాలే ఎలా జరుగుతుందో తెలుసా? కళ్లు చెదిరే విషయాలు

Published : May 30, 2025, 09:05 PM IST

మిస్‌ వరల్డ్ 2025 పోటీలు ఫైనల్‌కి చేరుకున్నాయి. ఒక్క రోజులో విన్నర్‌ ఎవరో తేలనుంది. మరి ఈ గ్రాండ్‌ ఫినాలే ఎలా జరుగుతుంది? ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు.

PREV
15
మిస్‌ వరల్డ్ 2025 వేడుకలు తెలంగాణకు గర్వకారణం

మిస్‌ వరల్డ్ 2025 పోటీలకు మన తెలంగాణ వేదిక కావడం ఒక గర్వకారణం. దీని ద్వారా మన తెలంగాణ, మన హైదరాబాద్‌ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అవుతుందని చెప్పొచ్చు. ప్రపంచ అందగత్తెలు మన తెలంగాణలోని అందాలను, సంస్కృతిని, ఆధ్యాత్మిక కేంద్రాలను, కట్టుబొట్లు, దుస్తులు, ఫుడ్‌, ఇలా తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. దాదాపు 20 రోజులుగా సాగుతున్న ఈ ప్రపంచ అందగత్తెలకు సంబంధించిన పోటీలు ఇప్పుడు ముగింపు దశకు చేరాయి.

25
నందిని గుప్తాపై కోటీ ఆశలు..

మరో 24 గంటల్లోనే విన్నర్‌ ఎవరో తేలనుంది. ఈ ఘట్టం కోసం మన ఇండియన్స్ తోపాటు ప్రపంచ దేశాలు సైతం కోట్ల కళ్లతో వెయిట్‌ చేస్తున్నాయి. మన భారత్‌ నుంచి రాజస్థాన్‌ అందగత్తె నందిని గుప్తా ఈ పోటీల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

 టాప్ 16లోనూ ఆమె చోటు సంపాదించడంతో ఇండియన్స్ చాలా ఆశలతో ఉన్నారు. మిస్‌ వరల్డ్ 2025 కిరీం మన ఇండియన్‌కి దక్కే అవకాశాలున్నాయని నమ్ముతున్నారు. ఏం జరగబోతుందో మరో 24 గంటల్లో క్లారిటీ వస్తుంది. శనివారం(మే 31) సాయంత్రం 6.30 నుంచి హైదరాబాద్‌లోని హైటెక్స్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది.

35
మిస్‌ వరల్డ్ 2025 విజేతని నిర్ణయించే పద్ధతి

108 దేశాలకు చెందిన అందగత్తెలతో ఈ మిస్‌ వరల్డ్ వేడుక మే 12న ప్రారంభం కాగా, ఇప్పటి వరకు టాప్‌ 40లో 16 మంది అందగత్తెలు ఫైనల్‌ అయ్యారు. రేపు(శనివారం) టాప్‌ 40ని ఫైనల్ చేస్తారు. ఆ తర్వాత వారి నుంచి టాప్‌ 20ని సెలక్ట్ చేస్తారు. 

వీరిలో టాప్‌ 8ని ఫిల్టర్‌ చేస్తారు. వారిలో ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. వీరిలో ఒకరిని విన్నర్‌గా నిర్ణయిస్తారు. ఇదంతా రాత్రి పది, పదకొండు గంటల వరకు సాగుతుంది. ఆ తర్వాత విన్నర్‌ ఎవరో క్లారిటీ వస్తుంది.

45
`మిస్‌ వరల్డ్ 2025` జడ్జ్ ల్లో సోనూ సూద్‌, సుధా రెడ్డి

ఈ ప్రపంచ అందగత్తెలను ఫైనల్‌ చేసే జడ్జ్ ల్లో మన ఇండియన్స్ కూడా ఉండటం విశేషం. నటుడు సోనూ సూద్‌తోపాటు బ్యూటీ విత్‌ పర్పస్‌ గ్లోబల్‌ అంబాసిడర్‌ సుధా రెడ్డి కూడా జడ్జ్ గా ఎంపికయ్యారు. అలాగే మిస్‌ ఇంగ్లాండ్‌ 2014 విన్నర్‌ డాక్టర్ కారీనా టర్రెల్‌, మిస్‌ వరల్డ్ చైర్‌ఉమెన్‌, సీఈవో జూలియా మోర్లే ఫైనల్‌ సెలక్షన్‌ జ్యూరీలో ఉన్నారు. 

వీరే విజేతని నిర్ణయిస్తారు. ఇక ఈ ఈవెంట్‌లో సోనూ సూద్‌ని మిస్‌ వరల్డ్ హ్యూమనిటేరియన్‌ అవార్డుతో సత్కరించనున్నారు. ఈ ఈవెంట్‌కి మిస్‌ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్‌ వల్లే, ఇండియన్‌ ప్రజెంటర్‌ సచిన్‌ కుంబర్‌ హోస్ట్ లుగా వ్యవహరించనున్నారు.

55
జాక్వెలిన్‌, మనుషీ చిల్లర్‌ డాన్స్ పర్‌ఫర్మెన్స్

ఇందులో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, ఇషాన్‌ ఖత్తర్‌ డాన్స్ పర్‌ఫర్మెన్స్ తో అదరగొట్టబోతున్నారు. మిస్‌ వరల్డ్ 2017 విన్నర్‌ మనుషీ చిల్లర్ కూడా ఈ ఫైనల్‌ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. ఈ ఈవెంట్‌ లైవ్‌ సోనీలివ్‌లో టెలికాస్ట్ కానుంది. 

అలాగే మిస్‌ వరల్డ్ అధికారిక సైట్‌లోనూ ప్రసారం కానుంది. విన్నర్‌ ని నిర్ణయించిన తర్వాత గత ఏడాది విన్నర్‌గా నిలిచిన క్రిస్టినా పైస్కోవా ఈ సారి విన్నర్‌గా నిలిచిన అందగత్తెకి తన కిరీటాన్ని తొడగడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇందులో విన్నర్‌ తన ఆనందాన్ని పంచుకుంటారు.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories