మిస్‌ వరల్డ్ 2025 క్వార్టర్‌ ఫైనల్‌కి 48 మంది అందగత్తెలు.. భారతీయుల ఆశలు పదిలం

Published : May 20, 2025, 10:43 AM IST

72వ మిస్‌ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు క్వార్టర్‌ ఫైనల్‌కి ఈ పోటీలు చేరుకున్నాయి. సోమవారం 48 మందిని ఎంపిక చేశారు, మంగళ, బుధవారం కూడా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

PREV
15
తెలంగాణ కల్చర్‌ని ఎక్స్ ప్లోర్‌ చేస్తున్న మిస్‌ వరల్డ్ సుందరీమణులు

హైదరాబాద్‌ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిస్‌ వరల్డ్ 2025 పోటీలు సందడిగా మారాయి. మిస్‌ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందగత్తెలు తెలంగాణ కల్చర్‌ని ఎక్స్ ప్లోర్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. తెలంగాణలోని అందమైన ప్రదేశాలను, టూరిస్ట్ ఏరియాలను సందర్శించి ప్రపంచానికి మన తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెబుతున్నారు. ఇప్పటికే చార్మినార్‌, సచివాలయం, యాదగిరి గుట్ట నరసింహస్వామి టెంపుల్‌,  నాగార్జున సాగర్‌ బుద్ధవనం, పిల్లల మర్రి వంటి లొకేషన్లని అందగత్తెలు సందర్శించిన విషయం తెలిసిందే.

25
మన దేశం నుంచి పోటీలో నందిని గుప్తా

దాదాపు ఇరవై రోజులుగా జరిగే ఈ 72వ మిస్‌ వరల్డ్ పోటీల్లో ఇప్పుడు కీలక మలుపుకు చేరుకున్నాయి. ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 109 దేశాల నుంచి సుందరీ మణులు పాల్గొన్నారు. మన దేశం నుంచి రాజస్తాన్‌కి చెందిన నందిని గుప్తా పార్టిసిపేట్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

35
48 మంది క్వార్టర్‌ ఫైనల్‌కి ఎంపిక

అయితే ఇప్పుడు క్వార్టర్‌ ఫైనల్‌ కి ఎంపిక కార్యక్రమం జరుగుతుందట. సోమవారం ఒక దశ ఫిల్టర్‌ జరిగిందని తెలుస్తుంది. ఇందులో సుమారు 48 మందిని క్వార్టర్‌ ఫైనల్‌కి ఎంపిక చేశారట. అయితే ఈ ప్రాసెస్‌ ఇంకా పూర్తి కాలేదని, మంగళవారం, బుధవారం కూడా కొనసాగుతుందని తెలుస్తుంది. బుధవారంతో క్వార్టర్‌ ఫైనల్‌కి వెళ్లాల్సిన కంటెస్టెంట్లని ఫైనల్‌ చేస్తారు.

45
మంగళ, బుధవారంలోనూ క్వార్టర్‌ ఫైనల్‌ ఎంపిక ప్రక్రియ

ఇందులో అమెరికా కరేబియన్‌, ఆఫ్రికా, యూరప్‌, ఆసియా ఓషియానా కాంటినెంటల్‌ క్లస్టర్ల నుంచి వివిధ అంశాల వారిగా ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం నిర్వహించిన టాలెంట్‌ కాంపిటీషన్‌ సెకండ్‌ రౌండ్‌ నుంచి క్వార్టర్‌ ఫైనల్‌కి 48 మందిని ఎంపిక చేశారు. ఇంకా ఈ విభాగంలో నేపాల్‌, హైతీ, ఇండోనేషియా సుందరీమణులు ప్రతిభని నిరూపించుకోవాల్సి ఉన్నట్టు మిస్‌ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు.

55
క్వార్టర్‌ ఫైనల్ లో నందిని గుప్తా

టీ హబ్‌లో మంగళవారం, బుధవారం ఈ కాంటినెంటల్‌ ఫినాలేలు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. ఇందులో ఎంపికైన వారు క్వార్టర్‌ ఫైనల్‌కి చేరతారు. అయితే ఇప్పటి వరకు చేసిన ఫిల్టర్‌లో మన ఇండియా నుంచి పోటీల్లో ఉన్న నందిని గుప్తా ఎంపికైనట్టు తెలుస్తుంది. దీంతో ఇండియాకి ఆశలు మిగిలే ఉన్నాయి. ఇందులో మరో మూడు దశల్లో ఫిల్టర్‌ జరుగుతుంది. ఫైనల్‌గా మే 31న గ్రాండ్‌ ఫినాలే ఉంటుంది. మరి ఈ సారి ఇండియాకి టైటిల్‌ దక్కుతుందా? నందిని మన 130 కోట్ల మంది ప్రజల ఆశలను నేరవేరుస్తుందా? అనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories