నిర్మాతగా మారి స్టార్‌ హీరో భార్యకి లైఫ్‌ ఇచ్చిన సిల్క్ స్మిత, ప్రొడ్యూస్‌ చేసిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా?

Published : May 20, 2025, 08:31 AM IST

సిల్క్ స్మిత జీరో నుంచి వచ్చి కెరీర్‌ పీక్‌ స్టేజ్‌ని చూసింది. అంతలోనే డౌన్‌ అయ్యింది. అయితే ఆమె నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మించింది. అలా డిస్కో శాంతికి ఆమె లైఫ్‌ ఇచ్చింది. 

PREV
15
వ్యాంప్‌ రోల్స్ కి క్రేజ్‌ తీసుకొచ్చిన సిల్క్ స్మిత

సిల్క్ స్మిత తిండిలేని పరిస్థితి నుంచి అనేక కష్టాలు ఎదుర్కొని, అవమానాలు ఫేస్‌ చేసి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. డాన్సర్‌గా మారి వ్యాంప్‌ రోల్స్ తో మెప్పించింది. వ్యాంప్‌ పాత్రలతోనే ఆమె స్టార్‌గా ఎదిగింది. స్టార్‌ హీరోలకు దీటుగా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె నిర్మాతగా మారి ఓ హీరో భార్యకి లైఫ్‌ ఇచ్చింది. ఆ కథేంటో చూద్దాం.

25
సిల్క్ స్మిత కోసం పోటీ పడ్డ మేకర్స్

సిల్క్ స్మిత ఐటెమ్స్ సాంగ్స్, వ్యాంప్స్ రోల్స్ తో బాగా సక్సెస్‌ అయ్యింది. ఆ జోనర్‌లో పోటీ ఇచ్చే నటీమణులు పెద్దగా లేకపోవడంతో, కమర్షియల్‌ సినిమాలకు కావాల్సిన మసాలా సిల్క్ అందిస్తుండటంతో మేకర్స్ ఆమె వెంట పడ్డారు. స్టార్ హీరో సినిమా అయినా సరే, ఆమె తమ మూవీస్‌లో ఉండాల్సిందే అని పట్టుపట్టి నటింప చేశారు. స్పెషల్‌ సాంగ్స్ చేయించారు. సినిమా సక్సెస్‌లో ఆమె పాత్ర చాలా ఉండేదంటే అతిశయోక్తి కాదు. సిల్క్ స్మిత ఉందంటే మాస్‌ ఆడియెన్స్ ఎగబడేవారు.

35
డిస్కో శాంతికి లైఫ్‌ ఇచ్చిన సిల్క్ స్మిత

దీంతో వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపింది సిల్క్ స్మిత. ప్రతి వారం ఆమె సినిమాలు థియేటర్లో ఉండేవంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి టైమ్‌లో సిల్క్ స్మిత నిర్మాతగా మారింది. తన అభిరుచిని చాటుకుంది. మొదటి ప్రయత్నంగా ఆమె సమర్పకురాలిగా వ్యవహరించింది. `వీర విహారం` అనే సినిమాని నిర్మించింది. ఈ చిత్రంలో డిస్కో శాంతికి అవకాశం ఇచ్చింది. ఆమె అప్పటికే చిన్నా చితకా పాత్రలు, డాన్సులు చేస్తూ రాణిస్తుంది. సరైన బ్రేక్‌ రాలేదు. ఈ క్రమంలో `వీర విహారం`లో బలమైన పాత్ర అవకాశం కల్పించింది సిల్క్ స్మిత.

45
సిల్క్ స్మితని ఆదర్శంగా తీసుకున్న డిస్కో శాంతి

ఆ మూవీతో డిస్కో శాంతి నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిందట. అయితే డిస్కో శాంతి అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వస్తుంది. సిల్క్ స్మిత తిరుగులేని స్టార్‌గా వెలుగుతుంది. ఆమెని ఆదర్శంగా తీసుకుని ఆమె బాటలో నడించింది డిస్కో శాంతి. అందుకే ఆమెని సిల్క్ స్మిత తన శిష్యురాలిగా భావిస్తుంది. డాన్స్ లకు సంబంధించి, వ్యాంపు రోల్స్ కి సంబంధించిన మెలకువలను నేర్పించిందట. శాంతికి కూడా సిల్క్ స్మితలా రాణించాలని, ఆమె అంతటి పేరు తెచ్చుకోవాలని తపించింది. ఆ తర్వాత అదే స్థాయిలో మెప్పించింది. కానీ సిల్క్ కి వచ్చిన క్రేజ్‌ డిస్కో శాంతికి రాలేదు.

55
శ్రీహరి మరణంతో ఒంటరైన డిస్కో శాంతి

డిస్కో శాంతి నటుడు శ్రీహరితో ప్రేమలో పడింది. వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. శ్రీహరి ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన ఒకప్పుడు హీరోగా రాణించారు. అనేక విజయాలు అందుకున్నారు. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీహరి మరణంతో డిస్కో శాంతి ఒంటరైపోయింది. ఇప్పుడు ఫ్యామిలీకే పరిమితమయ్యింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories