మిరాయ్ హీరోయిన్ రితిక నాయక్ కి ఇష్టమైన తెలుగు హీరో ఎవరో తెలుసా, అల్లు అరవింద్ కూడా ఆమెకి ఫిదా

Published : Sep 13, 2025, 06:31 PM IST

మిరాయ్ హీరోయిన్ రితిక నాయక్ కి టాలీవుడ్ లో ఓ హీరోపై క్రష్ ఉందట. ఆ హీరోతో ఒక్కసారైనా నటించాలి అని కోరుకుంటోంది. ఇంతకీ రితిక ఏం చెప్పిందో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
సూపర్ హిట్ దిశగా మిరాయ్ 

ఎట్టకేలకు టాలీవుడ్ లో ఈ ఏడాది కొన్ని విజయాలు నమోదవుతున్నాయి. ఇటీవల విడుదలైన లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి లాంటి చిత్రాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మిరాయ్ చిత్రం శుక్రవారం రోజులు ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. తేజ సజ్జా మరోసారి సూపర్ హీరోగా విజయం అందుకున్నారు. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రితిక నాయక్ హీరోయిన్ గా నటించింది. 

25
టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా రితిక 

ఈ మూవీతో రితిక నాయక్ టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిపోయింది. యువత మొత్తం రితిక నాయక్ జపం చేస్తున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రితిక నాయక్ మాట్లాడుతూ టాలీవుడ్ లో తనకి ఇష్టమైన హీరో గురించి మాట్లాడింది. తనకి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని రితిక పేర్కొంది. చిన్నపటి నుంచి అల్లు అర్జున్ సినిమాలు చూస్తున్నాని.. ఒక్కసారైనా అల్లు అర్జున్ తో హీరోయిన్ గా రొమాన్స్ చేయాలని ఉన్నట్లు రితిక పేర్కొంది. 

35
అల్లు అర్జున్ పై క్రష్ 

అల్లు అర్జున్ అంటే తనకి చిన్నప్పటి నుంచి క్రష్ ఉన్నట్లు పేర్కొంది. రితిక నాయక్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తన బ్యూటిఫుల్ లుక్స్ తో యువతని ఆకట్టుకుంటోంది. రితిక నాయక్ టాలీవుడ్ లోకి విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. 

45
అల్లు అరవింద్ కూడా ఫిదా

ఈ చిత్రంలో రితిక పెర్ఫార్మెన్స్ కి అల్లు అరవింద్ కూడా ఫిదా అయ్యారు. అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రం చూస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఎంత ముద్దుగా ఉంది అని అనిపించింది.

55
వరుణ్ తేజ్ మూవీలో రితిక  

అల్లు అరవింద్ ఒక రేంజ్ లో రితిక పై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం తర్వాత చాలా మంది నిర్మాతల నుంచి రితికకి ఫోన్ కాల్స్ రావడం ఖాయం అని అల్లు అరవింద్ అప్పట్లో జోస్యం చెప్పారు. ప్రస్తుతం రితిక వరుణ్ తేజ్ సరసన కూడా ఒక చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తమిళంలో కూడా అవకాశాలు అందుకుంటోంది. 

Read more Photos on
click me!

Recommended Stories