`కూలీ` ఫ్లాప్‌ ఎఫెక్ట్.. ఆగిపోయిన లోకేష్‌ కనగరాజ్‌ నెక్ట్స్ మూవీ, ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే?

Published : Sep 13, 2025, 06:22 PM IST

రజనీకాంత్‌తో లోకేష్‌ కనగరాజ్‌ చేసిన `కూలీ` మూవీ ఫ్లాఫ్‌ అయ్యింది. దీంతో ఇప్పుడు అది లోకేష్‌ నెక్ట్స్ మూవీపై ప్రభావం పడింది. ఆయన నెక్ట్స్ సినిమా ఆగిపోయిందట. 

PREV
15
`కూలీ`తో మొదటి పరాజయాన్ని చవిచూసిన లోకేష్‌

లోకేష్ కనగరాజ్‌ చివరగా `కూలీ` చిత్రాన్ని రూపొందించారు. రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్‌, సత్యరాజ్‌, సౌబిన్‌ సాహిర్‌ నటించారు. అమీర్‌ ఖాన్‌ గెస్ట్ రోల్‌ చేశారు. ఆగస్ట్ 14న విడుదలైన ఈ మూవీ మిశ్రమ స్పందన రాబట్టుకుంది. బాక్సాఫీసు వద్ద మొదటి వారం బాగానే సందడి చేసింది. కోలీవుడ్‌లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. దాదాపు రూ.500కోట్ల కలెక్షన్లని రాబట్టింది. కానీ ఓవరాల్‌ రిజల్ట్ మాత్రం ఫ్లాఫ్‌ అని చెప్పాలి. దీంతో లోకేష్‌ తన కెరీర్‌లో తొలి ఫ్లాప్‌ ని ఫేస్‌ చేశారు. 

25
అమీర్‌ ఖాన్‌తో లోకేష్‌ మూవీ ఆగిపోయిందా?

ఇదిలా ఉంటే నెక్ట్స్ లోకేష్‌ కనగరాజ్‌.. అమీర్‌ ఖాన్‌ హీరోగా ఓ మూవీ చేయాలనుకున్నారు. సూపర్‌ హీరో కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించారు. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని ప్లాన్‌ చేశారు. అమీర్‌ ఖాన్‌ కూడా పలు సందర్భాల్లో లోకేష్‌తో సినిమాకి సంబంధించిన హింట్‌ ఇచ్చారు. ఇది తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ కాబోతుందని లోకేష్‌ భావించారు. కానీ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక షాకింగ్‌ న్యూస్‌ వినిపిస్తుంది. ఈ సినిమా ఆగిపోయిందంటున్నారు.

35
అమీర్‌తో మూవీ ఆగిపోవడానికి కారణం ఇదేనా?

లోకేష్‌ కనగరాజ్‌, అమీర్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో రూపొందాల్సిన మూవీని ఆపేశారట. దర్శకుడికి, హీరోకి మధ్య క్రియేటివ్‌ డిఫరెంట్స్ వచ్చాయని, కథ పరమైన కొన్ని మార్పులను లోకేష్‌ అంగీకరించలేదని, దీంతో అమీర్‌ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. దీంతో లోకేష్‌ కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆశలు వదులుకున్నారని సమాచారం. అయితే ఈ కాంబోలో మూవీ ఇక లేనట్టే అని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

45
రజనీకాంత్‌, కమల్‌ హీరోలుగా లోకేష్‌ మూవీ

లోకేష్‌ కనగరాజ్‌ మరోసారి రజనీకాంత్‌తో సినిమా చేయబోతున్నారు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో లోకేష్‌ ఓ సినిమాకి ప్లాన్‌ చేశారట. దీనికి అటు రజనీ, ఇటు కమల్‌ ఓకే చెప్పారని సమాచారం. అదే సమయంలో ఆ మధ్య సైమా ఈవెంట్‌లో పాల్గొన్న కమల్‌ హాసన్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో తాము కలిసి నటించామని, కానీ ఒకే బిస్కట్‌(పారితోషికం)ని ఇద్దరికి పంచేవారని, దీంతో ఎవరికి వారు సపెరేట్‌గా చేయాల్సి వచ్చిందని, మళ్లీ ఇప్పుడు ఒకే బిస్కట్‌ని పంచుకోవడానికి రెడీ అని తెలిపారు కమల్‌. రజనీతో మూవీ చేస్తున్నట్టు చెప్పకనే చెప్పేశారు.

55
లోకేష్‌ నెక్ట్స్ మూవీ ప్రారంభమయ్యేది అప్పుడే

ప్రస్తుతం కమల్‌ హాసన్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్ అన్బరివ్‌లతో ఓ మూవీ చేస్తున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది. మరోవైపు రజనీకాంత్‌ ప్రస్తుతం `జైలర్‌ 2`లో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఇద్దరు హీరోలు కమిట్‌ అయిన సినిమాలు పూర్తయ్యాక లోకేష్‌తో  మూవీ ఉండబోతుందని చెప్పొచ్చు. దీన్ని రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్ నిర్మించబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories