ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, జరిగిన ఘటన యాక్సిడెంట్ అని, అది చాలా దురదృష్టకరం అని, ఈ ఘటనని రాద్దాంతం చేయోద్దని తెలిపారు. ప్రతిపక్షాలు తమ స్వలాభం కోసం ఈ ఘటనని వాడుకుంటున్నారని ఆయన అన్నారు. ఘటనని మానవీయ కోణంలో చూడాలన్నారు. అల్లు అర్జున్‌ని మేం కించపరచడం లేదని, అల్లు అరవింద్ చాలా రోజులుగా తెలుసు అని వెల్లడించారు.
ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేయాలని వాళ్లు ఎంతో ప్రయత్నిస్తున్నారని, అందుకే స్పెషల్ షోస్, టికెట్ రేట్లు పెంచామని తెలిపారు. అసెంబ్లీలో నాయకుడు అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకి సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పారు, జరిగిన సంఘటన గురించి వివరించే ప్రయత్నం చేశారని, కానీ దాన్ని కొందరు కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని, సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్టులు పెడుతూ పెద్ద ఇష్యూ చేస్తున్నారని అన్నారు మంత్రి.