ఏపీకి వెళ్లి ఏం చేస్తాం, పవన్‌ కళ్యాణ్‌ కి స్టార్‌ ప్రొడ్యూసర్‌ కౌంటర్‌.. తప్పు తెలుసుకుని ఏం చేశాడంటే ?

First Published | Dec 23, 2024, 4:31 PM IST

టాలీవుడ్‌ని ఏపీకి రావాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. దీనికి స్టార్‌ ప్రొడ్యూసర్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ఏపీకి వెళ్లి ఏం చేస్తామంటూ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఇదే రచ్చ అవుతుంది. 
 

తెలుగు చిత్ర పరిశ్రమ మీద ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఓ వైపు అల్లు అర్జున్‌ వివాదం విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, బెనిఫిట్‌ షోల రద్దు, టికెట్‌ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉండబోదని అసెంబ్లీలో తెలిపిన తీరు చూస్తుంటే ఇండస్ట్రీకి అది పెద్ద దెబ్బగానే మారబోతుంది. రాబోయే పెద్ద సినిమాలకు గట్టి దెబ్బ పడబోతుందనే చర్చ ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్‌ని టార్గెట్ చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. 

pawan kalyan

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన మరో చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌కి తరలిపోతుందా? అనే చర్చ ప్రారంభమైంది. ఏపీకి చెందిన పొలిటికల్‌ లీటర్స్ ఇండస్ట్రీ ఏపీకి రావాలని కోరుకుంటున్నారు. ఆహ్వానిస్తున్నారు. గతంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కోరుకున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పెద్దలు కూడా కోరుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ఇండస్ట్రీని ఏపీకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. 


ఈ క్రమంలో తాజాగా దీనిపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ నాగవంశీ స్పందించారు. ఏపీకి వెళ్లి ఏం చేస్తామంటూ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన `డాకు మహారాజ్‌` ప్రెస్‌ మీట్‌లో పాల్గొన్నారు. బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. సినిమాకి సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ సోమవారం తమ ఆఫీస్‌లో ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. 
 

అందులో పవన్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఇండస్ట్రీ ఏపీకి వెళ్లిపోతుందా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందులో నాగవంశీ మాట్లాడుతూ నేను ఇక్కడే ఇళ్లు కట్టుకున్న, ఏపీకి పోయి ఏం చేస్తాం` అంటూ సెటైరికల్‌గా కామెంట్ చేశారు. తాము ఏపీకి వెళ్లడం లేదనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు పవన్‌ కళ్యాణ్‌కి కౌంటర్‌గా వెళ్తున్న నేపథ్యంలో తప్పు తెలుసుకున్నారు నాగవంశీ. నష్టనివారణ చర్యలు చేపట్టారు. తెలంగాణతోపాటు ఏపీలోనూ ఈవెంట్లు నిర్వహిస్తామన్నారు. ఏపీలోనూ అందమైన లొకేషన్లలో షూటింగ్‌ చేస్తామని, ఇకపై అక్కడ షూట్‌ చేయడానికి ప్రయారిటీ ఇస్తామన్నారు. ఏపీ డెవలప్‌ కావడానికి కావాల్సిన అన్నీ రకాల సహకారం తమ వంతుగా అందిస్తామని తెలిపారు నాగవంశీ. 
 

ఇటీవల అల్లు అర్జున్‌, సంధ్య థియేటర్‌ కేసు విషయంలో ఆయన స్పందిస్తూ ఇది అనుకోకుండా జరిగిన ఘటన అన్నారు. ఇకపై ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటామని తెలిపారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, అయితే ఈ ఘటనలను ముందే ఊహించలేమని వెల్లడించారు నాగవంశీ. ఈ విషయంలో అందరు బాధ్యతాయుతంగా ఉండాలని తెలిపారు. 
 

`డాకు మహారాజ్‌` సినిమా గురించి చెబుతూ, సినిమా వేరే లెవల్‌లో వచ్చిందన్నారు.ఫస్టాఫ్‌ చూడటంతోనే ఆ విషయం మీకు అర్థమవుతుందని, సినిమా గత బాలకృష్ణ సినిమాలను మించి ఉంటుందన్నారు. బాబీ రూపొందించిన `వాల్తేర్‌ వీరయ్య` సినిమా కంటే బాగా తీశాడని వెల్లడించారు నాగవంశీ. విజువల్స్ పరంగా అద్భుతంగా ఉంటుందన్నారు. యాక్షన్‌ సీన్లు కూడా నెక్ట్స్ లెవల్‌ అనేలా ఉంటాయన్నారు.  `అఖండ`, `సమరసింహారెడ్డి` వంటి సినిమాల కంటే బెటర్‌గా ఉంటుందని చెప్పారు నాగవంశీ. 

read more: ' డాకూ మహారాజ్ ' ప్రీ రిలీజ్ ఈవెంట్: ఎప్పుడు? ఎక్కడ? గెస్ట్ లు ఎవరు

also read: మళ్లీ బుక్కైన అల్లు అర్జున్‌ ?.. వీడియోలు చూపిస్తూ ట్రోల్స్, తప్పులో కాలేస్తున్నారా?

Latest Videos

click me!