Prabhas: కాకులు దూరని కారడివిలో నాటు కోడి కావాలని ప్రభాస్ డిమాండ్, అర్ధరాత్రి ఫారెస్ట్ లో కోళ్లను వేటాడిన నటుడు ఎవరు?

Published : Sep 23, 2026, 03:31 PM IST

Prabhas: అర్ధరాత్రి నట్టడివిలో షూటింగ్.. సడెన్ గా ప్రభాస్ కు నాటు కోడి తినాలనిపించింది. కాకులు దూరని కారడివిలో నాటు కోడికోసం తంటాలు పడ్డాడు ఓ నటుడు. ప్రభాస్ కోసం వేటాడి సాధించిన యాక్టర్ ఎవరో తెలుసా?

PREV
15
ప్రభాస్ భోజన ప్రియుడు..

టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన స్టార్ హీరోగా ఎంత ఫిట్ నెస్ ఫాలో అవుతాడో.. అంతే ఇష్టంగా భోజనం కూడా చేస్తాడు. ప్రభాస్ మంచి భోజన ప్రియుడు. ఆయన తినడమే కాదు. .చుట్టూ ఉన్నవారికి కూడా కడుపునిండా తినిపిస్తాడు కూడా. షూటింగ్ లో కానీ, బయట కానీ.. ఫారెన్ లో కానీ.. ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా.. అక్కడ ఆయన కుకింగ్ టీమ్ ఉండాల్సిందే. ప్రభాస్ ఏది అడిగితే అది చేసి పెట్టాల్సిందే. ఆకరికి అడవిలో ఉన్నా కూడా ప్రభాస్ తాను నినాలనుకున్నది తినేయాల్సిందే.

25
కడుపునిండా తింటాడు.. తినిపిస్తాడు..

ప్రభాస్ ఫుడ్ హ్యాబిట్ గురించి ఆయన స్నేహితుడు, నటుడు ప్రభాస్ శ్రీను చాలా ఇంటర్వ్యూల్లో చాలా విషయాలు చెప్పాడు. ప్రభాస్ భోజనం గురించి ఆయన అతిథులకు ఇచ్చే ఆతిథ్యం గురించి టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్ లొకేషన్‌లో ఎవరైనా సరే కడుపునిండా తినిపించడం ఆయనకు అలవాటు. అయితే, ప్రభాస్‌కి స్వయంగా ఏదైనా తినాలనిపిస్తే దాన్ని సాధించడం కోసం ఆయన ఆత్మీయులు ఎంతటి కష్టానికైనా వెనుకాడరు. అలాంటి ఒక సరదా సంఘటనను ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు

35
అడవిలో షూటింగ్.. అర్ధరాత్రి నాటు కోడి కావాలన్నాడు..

ఒక సినిమా షూటింగ్ సమయంలో మరుసటి రోజు షూటింగ్ క్యాన్సిల్ అయిందని మూవీటీమ్ రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ప్రకటించింది. ఆ సమయంలో ప్రభాస్ సరదాగా ప్రభాస్ శ్రీనుతో "డార్లింగ్! నాకిప్పుడు నాటుకోడి కూర తినాలని ఉంది" అని చెప్పారు. ఆ మాట వినగానే ప్రభాస్ శ్రీను ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఎందుకంటే ఆ సమయానికి వారున్నది ఏ నగరంలోనో, హైదరాబాద్‌లోనే కాదు... ఒక దట్టమైన అడవి ప్రాంతంలో.. అది కూడా అర్ధరాత్రి సమయంలో, అడవి మధ్యలో నాటుకోడి దొరకడం అనేది దాదాపు అసాధ్యం. పైగా ప్రభాస్ గారు సాధారణంగా భయంకరమైన డైటింగ్ పాటించే వ్యక్తిః. అంతటి కఠినమైన డైట్ నుంచి విరామం తీసుకుని, అంత అర్ధరాత్రి నాటుకోడి తింటానని అడిగినప్పుడు "లేదు" అని చెప్పడం ఆయన మనస్సాక్షికి నచ్చలేదు.

45
అడవిలో అర్ధరాత్రి వేట

ప్రభాస్ కోరికను నెరవేర్చడానికి ప్రభాస్ శ్రీను వెంటనే తన క్వాలిస్ లో బయలుదేరారు. అడవిలో కోళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని ఆలోచిస్తుండగా, ఆయనకు ఒక మెరుపు లాంటి ఐడియా వచ్చింది. ఆ సినిమా షూటింగ్ కోసం సెట్‌లో భాగంగా కొన్ని కోళ్లను ఉంచిన విషయం ఆయన గుర్తుకు వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి.. క్వాలిస్ లైట్లను ఆ గూడెం సెట్‌పైకి వేసి.. టార్చ్ లైట్ సహాయంతో, ఆ చీకట్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వాటంతట అవే కింద పడేలా చూసి రెండు నాటుకోళ్లను పట్టుకున్నారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా ఆ నాటుకోడిని కోసి, రుచికరమైన నాటుకోడి కూరతో పాటు ప్రత్యేకంగా రసాన్ని (చారు) తయారు చేశారు.

55
మహరాజులా కనిపించాడు..

అర్ధరాత్రి అడవిలో ఆ వేడివేడి నాటుకోడి కూర , రసంతో భోజనం చేసిన ప్రభాస్ "ఒక మహారాజులా" ఎంతో సంతోషపడ్డారని ప్రభాస్ శ్రీను ఆనందంతో జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభాస్ మీద ఉన్న అభిమానం, స్నేహబంధం కోసమే తాను స్వయంగా వంట చేసి పెట్టానని ఆయన తెలిపారు. ఈ చిన్న సంఘటన ప్రభాస్‌కు తన స్నేహితులతో ఉన్న ఆత్మీయతను, అలాగే ఆయన కోసం స్నేహితులు ఎంతటి పనినైనా చేయగలమని నిరూపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories