Ilaiyaraaja: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇళయరాజాకు అరుదైన గౌరవం.. పోస్టల్ స్టాంప్ రిలీజ్

Published : Sep 23, 2026, 01:52 PM IST

సినీ ప్రయాణంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. ఆయన సంగీత సేవలకు గుర్తింపుగా విక్టోరియా పార్లమెంట్ ఆయనను ప్రత్యేకంగా సత్కరించింది.

PREV
13
ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇళయరాజాకు సత్కారం

మెల్‌బోర్న్‌లో మంగళవారం(సెప్టెంబర్‌ 22)న జరిగిన అధికారిక కార్యక్రమంలో 'ఆస్ట్రేలియా పోస్ట్' సంస్థ ఇళయరాజా చిత్రంతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపులను (Commemorative Stamps) విడుదల చేసింది. విక్టోరియా రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎన్వర్ ఎర్డోగన్ ఎంపీ ఈ స్టాంపులను ఆవిష్కరించి, ఇళయరాజాను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. సంగీత దర్శకుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 'Ilaiyaraaja 50' టూర్‌లో భాగంగా ఈ స్టాంప్ విడుదల కార్యక్రమం జరిగింది.

23
సంగీతమే తన దారిని ఎంచుకుంది - ఇళయరాజా

ఈ అరుదైన గౌరవం దక్కడంపై ఇళయరాజా తన సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా ఆస్ట్రేలియా పార్లమెంట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. `నా 50 ఏళ్ల సంగీత ప్రయాణాన్ని గుర్తిస్తూ ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన విక్టోరియా ప్రభుత్వ ఆర్థిక మంత్రి ఎన్వర్ ఎర్డోగన్ ఎంపీకి, ఇతర పార్లమెంట్ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు` అని ఆయన అన్నారు.

`తమిళనాడులోని ఓ మారుమూల పల్లెటూరిలో పుట్టిన నేను, సంగీతం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టూడియోలు, ఆడిటోరియాలకు ప్రయాణించాను. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో నాకు దక్కిన ఈ గౌరవం నా మనసును హత్తుకుంది. నా ప్రయాణం ఇంత దూరం వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ, సంగీతమే తన దారిని తాను ఎంచుకుంది. నా సంగీతానికి ప్రాణం పోసిన అభిమానులకు, నాతో కలిసి ప్రయాణించిన తోటి కళాకారులకు, నా పాటలను ఆదరిస్తున్న అన్ని తరాల ప్రేక్షకులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు` అని ఇళయరాజా ఎమోషనల్ అయ్యారు.

33
వరల్డ్ మ్యూజిక్ టూర్, ఆస్కార్ రేసులో ఇళయరాజా

తన 50 ఏళ్ల సంగీత ప్రయాణానికి గుర్తుగా జూలై చివరి నుంచి ఇళయరాజా వివిధ దేశాల్లో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 26న సిడ్నీలో, అక్టోబర్ 5న బ్రిస్బేన్‌లో భారీ సంగీత కచేరీలు జరగనున్నాయి. మరోవైపు, 2027లో జరగనున్న 99వ ఆస్కార్ అవార్డుల బరిలో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' కేటగిరీలో భారత్ తరఫున అధికారికంగా ఎంపికైన 'కోంతల్' (Koonthal) సినిమాకు ఇళయరాజానే సంగీతం అందించడం విశేషం. ఐదు దశాబ్దాలుగా తన సంగీతంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఆయన, ఇప్పటివరకు 1,500కు పైగా సినిమాలకు సంగీతం అందించి వేలాది పాటలకు ప్రాణం పోశారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories