kayadu lohar: కయాదు లోహర్ పేరులో ఇంత అర్థం ఉందా? జెన్ జీ బ్యూటీలో మైథాలజీ యాంగిల్

Published : Sep 23, 2026, 01:45 PM IST

kayadu lohar:'ప్యారడైజ్' మూవీ కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక హీరోయిన్ కయాదు లోహర్.. కెరియర్ మొత్తం ఈ సినిమాపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదెంటో తెలుసా?

PREV
14
పేరు వెనుక స్టోరీ చెప్పిన కయాదు

సినీ నటి కయాదు లోహర్ ప్రస్తుతం 'ప్యారడైజ్' మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో యాంకర్ సుమ చేసిన ఇంటర్వ్యూలో తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను ఆమె వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో సుమ అడిగిన ప్రశ్నకు కయాదు ఆన్సర్ ఇచ్చారు. ముఖ్యంగా తన పేరులోని 'కయాదు' తన పేరులోని 'కయాదు'కు పురాణాలతో ఉన్న సంబంధాన్ని వివరించారు.

24
హిరణ్యకశిపుడి భార్య పేరు ఇదే..

పురాణాల్లో హిరణ్యకశిపుడి భార్య పేరు కయాదు అని చెప్పారు. ఆ పేరు స్ఫూర్తితోనే తనకు కయాదు అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు. తన పేరు వెనుక ఇలాంటి కథ ఉందని చాలా మందికి తెలియదని ఆమె తెలిపారు. ఇక తన ఇంటి పేరు గురించి కూడా కయాదు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మొదట తమ కుటుంబ ఇంటి పేరు కదైలి అని చెప్పుకొచ్చారు. అయితే తమ కుటుంబం అస్సాం నుంచి పూణేకు మారిన తర్వాత తన తండ్రి ఆ ఇంటిపేరును లోహర్‍గా మార్చారని తెలిపారు.

34
'లోహర్' అంటే ఐరన్ లేడీ

'లోహర్' అనే పదానికి ఐరన్ లేడీ అనే అర్థం వస్తుందని కయాదు చెప్పారు. దీంతో తన పేరు కయాదు లోహర్‍గా మారిందని వివరించారు. తన పేరు వెనుక పురాణాల నుంచి కుటుంబ నేపథ్యం వరకు ఇంత ఆసక్తికరమైన కథ ఉందని ఆమె చెప్పడంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

44
మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్న జెన్ జీ బ్యూటీ

ప్రస్తుతం కయాదు లోహర్ నటించిన 'ప్యారడైజ్' సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆమె కథానాయికగా కనిపించనున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే తన పేరు, ఇంటి పేరు వెనుక ఉన్న విషయాలను ఆమె వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories