లక్ష్మీ బాంబ్‌, థౌజండ్‌ వాలా, రాకెట్‌ ఎవరో తేల్చేసిన మెహబూబ్.. గంగవ్వ బిడ్డకి అండగా ఉంటానని హామీ

Published : Oct 27, 2024, 11:35 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఎనిమిదో వారం మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయ్యారు. హౌజ్‌లో ఐదు కంటెస్టెంట్లని పటాసులతో పోల్చారు. గంగవ్వకి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు.   

PREV
15
లక్ష్మీ బాంబ్‌, థౌజండ్‌ వాలా, రాకెట్‌ ఎవరో తేల్చేసిన మెహబూబ్.. గంగవ్వ బిడ్డకి అండగా ఉంటానని హామీ

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ దీపావళి స్పెషల్‌గా ఈ ఆదివారం స్పెషల్‌ ప్రోగ్రామ్‌ని నిర్వహించారు. ఆద్యంతం సందడి ఈ షో సాగింది. పండగ వాతావరణం నెలకొంది. టాస్క్ లతో హోస్ట్ నాగార్జున హౌజ్‌మేట్స్ ని ఎంటర్‌టైన్‌ చేశాడు. గేమ్‌లో గెలిచిన వారికి ఫ్యామిలీ వీడియోలు చూపించి ఎమోషనల్‌గా మార్చేశాడు. చాలా మంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొని సందడి చేయడం విశేషం. అనసూయ, మెమరీన్‌ డాన్సులతో, ఓ సింగర్‌ పాటలతో అలరించారు. ఈ వారం విడుదల కాబోతున్న సినిమా యూనిట్లు వచ్చి తమ సినిమాని ప్రమోట్‌ చేశాయి. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

25

అందులో `క` సినిమా టీమ్‌ కిరణ్‌ అబ్బవరం, నయన్‌ సారిక, తన్వి రామ్‌లు పాల్గొన్నారు. ఈ నెల 31న ఈ మూవీ విడుదల కాబోతుంది. దీంతోపాటు అదే రోజు రాబోతున్న `లక్కీ భాస్కర్‌` టీమ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి పాల్గొన్నారు. మరోవైపు `అమరన్‌` టీమ్‌ సాయి పల్లవి, శివ కార్తికేయన్‌, చిత్ర దర్శకుడు పాల్గొని తమ  సినిమా విశేషాలను వెల్లడించారు.

అలాగే బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లతో కాసేపు ఆడి అలరించారు. వారితో ముచ్చటించారు. వీరితోపాటు హైపర్‌ ఆది పంచ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన ఒక్కో కంటెస్టెంట్ గురించి వాళ్ల బలాలు, బలహీనతలు తెలిపారు. లవ్‌ స్టోరీలు, బ్రేకప్‌లు, కవ్వింపులు, పులిహోర వ్యవహారాలు, డ్రామాలను అన్నింటిని బయటపెట్టాడు ఆది. ఆద్యంతం అలరించారు. 
 

35

దాదాపు మూడున్నగంటలపాటు నిర్విరామంగా ఈ ఎంటర్‌టైనింగ్‌ ప్రోగ్రామ్‌ సాగింది. అనంతరం ఎలిమినేషన్‌తో ఎమోషనల్‌గా మార్చారు నాగార్జున. ఈ వారం అనుకున్నట్టుగానే మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయ్యారు. నయని పావని, మెహబూబ్‌లు చివరగా నిలవగా, వీరిలో మెహబూబ్‌ ఎలిమినేట్‌ అవుతున్నట్టు నాగార్జున వెల్లడించారు.

అనంతరం మెహబూబ్‌ జర్నీ చూపించారు. ఆయన కేవలం మూడు వారాలు మాత్రమే ఉండటంతో పెద్దగా జర్నీ లేదు. అనంతరం మెహబూబ్‌తో మాట్లాడారు నాగ్‌. హౌజ్‌ మేట్స్ కి పటాసుల్లో ఎవరికి ఏ ట్యాగ్‌ ఇస్తారో చెప్పాలని వెల్లడించారు. 
 

45

ఈ క్రమంలో అవినాష్‌కి థౌజండ్‌ వాలా ట్యాగ్‌ ఇచ్చాడు. ఆయన గేమ్‌లు గానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ గానీ థౌజండ్‌ వాలాలా ఇస్తున్నాడని తెలిపారు. గంగవ్వకి లక్ష్మీ బాంబ్‌ ఇచ్చాడు. ఆమె ఆట లక్ష్మీ బాంబ్‌లా ఉందని చెప్పింది. తన బిడ్డ విషయాన్ని చెప్పిందని, ఆ విషయం తాను చూసుకుంటానని, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఫోన్‌ చేయమని, తన సపోర్ట్ ఉంటుందని తెలిపారు మెహబూబ్‌.

ఇంకోవైపు నబీల్‌కి రాకెట్ ట్యాగ్‌ ఇచ్చాడు. గేమ్‌లో రాకెట్‌లా దూసుకుపోతున్నాడని, ఇంకా బాగా ఆడాలని తెలిపారు మెహబూబ్‌. రోహిణి కాకరపుల్లా అని, ఎప్పుడు సందడి చేస్తూనే ఉంటుందని, నవ్విస్తూనే ఉంటుందని, వెలిగిస్తుందని చెప్పాడు. ఇక గౌతమ్‌ అగ్గి పెట్టే అని, తాను మండుతూ వెలుగు ఇస్తాడని, బాగా ఆడాలని తెలిపారు. 

55

మెహబూబ్‌ గురించి హైపర్‌ ఆది ముందే తెలిపారు. ఒక్కడే బాడీ బిల్డర్‌లా ఉంటాడని, ఇతర హౌజ్‌మేట్స్ తో కలవడం లేదని తెలిపారు. కరెక్ట్ గా తన ఎలిమినేషన్‌కి కూడా అదే కారణమని తెలుస్తుంది. టాస్క్ ల్లో ఉన్నట్టుగా కంటెంట్‌ ఇవ్వడంలో మెహబూబ్‌ వెనకబడిపోతున్నాడని, ఆటలు బాగా ఆడుతున్నాడు, కానీ ఇంటి సభ్యులతో కలివిడిగా ఉండటం లేదని, ఎంటర్‌టైన్‌ చేయలేకపోతున్నాడనే విమర్శలు వచ్చాయి.

అదే ఇప్పుడు ఆయన ఎలిమినేషన్‌కి కారణమని తెలుస్తుంది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన మెహబూబ్‌ మూడు వారాల్లోనే ఎలిమినేట్‌ కావడం గమనార్హం. ఇక ప్రస్తుతం హౌజ్‌లో నిఖిల్‌, పృథ్వీరాజ్‌, యష్మి, ప్రేరణ, పృథ్వీరాజ్‌, నబీల్‌, అవినాష్‌, రోహిణి, గంగవ్వ, హరితేజ, గౌతమ్‌, నయనిపావని, టేస్టీ తేజ ఉన్నారు. 

Read more: రంభ అసలు పేరేంటో తెలుసా? ఎలా మారిందంటే? పాపం చిన్న పిల్లని చేసి ఆడుకున్నారట

Also read: అలా లేకపోతే సినిమాలు మానేస్తా అంటూ ప్రకటించిన యంగ్‌ హీరో, కారణం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories