నయనతార నిజస్వరూపం బయటపెట్టిన సీనియర్ నటి శరణ్య, ఏమన్నారంటే..?

First Published | Oct 27, 2024, 11:32 PM IST

నయనతార గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది సీనియర్ నటి శరణ్య పొన్వన్నమ్. నయన్ గురించి ఎవరికి తెలియని విషయాలు వెల్లడించింది శరణ్య. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..?

Actor Nayanthara X Account hacked report

నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లో ఆమె స్టార్ డమ్ అంతా ఇంతా కాదు. 40ఏళ్లు వస్తున్నా గ్లామర్ విషయంలో.. ఫిట్ నెస్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా మెయింటేన్ చేస్తూ వస్తోంది బ్యూటీ. అంతే కాదు పవర్ ఫుల్ లేడీ అన్న ట్యాగ్ తో పాటు.. లేడీ సూపర్  స్టార్ గా మారింది నయనతార.. పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది బ్యూటీ. 
 

Actress Nayanthara

తెలుగు తమిళ భాషల్లో తిరుగులేని  స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు మలయాళ, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తోంది. ఇక బాలీవుడ్ లో అయితే.. అడుగు పెట్టడంతోనే 1000 కోట్ల హీరోయిన్ గా మారిపోయింది. ఆమె నటించిన  జవాన్ సినిమా భారీ హిట్ అందుకుంది.  షారుఖ్ ఖాన్ జంటగా నటించి మెప్పించింది నయనతార. ఈసినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  


Nayanthara

అటు కమర్షియల్ సినిమాలతో పాటు  ఇటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ మెప్పిస్తుంది నయన్. అంతే కాదు సౌత్ మొత్తం మీద  స్టార్ హీరోల కు సమానంగా సినిమాలు చేస్తూ.. రెమ్యునరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తూ.. నిర్మాతల  నుంచి వసూలు చేస్తోంది. ఈ మధ్య సినిమాలు తగ్గించి.. సెలెక్టెడ్ గా చేసుకుంటూ వెళ్తోంది నయనతార. అంతే కాదు ఎంత పెద్ద హీరో అయినా... నయన్ తార మాత్రం తన సినిమాల  ప్రమోషన్స్ కు వెళ్ళదు. 

ఇక సౌత్ లో నయనతరపై చాలా గాసిప్స్ ఉన్నాయి. ఆమెకు పొగరు ఎక్కువ అనేవారు కూడా లేకపోలేదు. అయితే రీసెంట్ గా నయనతారపై  ఓ సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ సీనియర్ నటి ఎవరో కాదు  మనందరికి భాగ తెలిసిన స్టార్  శరణ్య పొన్వన్నమ్. తెలుగు,తమిళ భాషల్లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె అందరికి సుపరిచితురాలు. 

ప్రస్తుతం  ఇండస్ట్రీలో తల్లి పాత్రలు చేస్తున్నా.. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఊపేసింది శరణ్య. తెలుగులో కూడా ఆమె ఎన్నో సినిమాల్లో అమ్మ పాత్రలతో మెప్పించింది. చాలా నేచురల్ యాక్టర్ గా శరణ్యకు పేరుంది. ఇన్నేళ్ల నుంచి సినిమా రంగంలో ఉన్నా.. ఆమె ఎప్పుడు ఏ ఒక్క వివాదం లేకుండా మంచి పేరు తెచ్చుకుంది అయితే అటువంటి శరణ్య తాజాగా నయనతారపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 ఇంతకీ ఆమె ఏమన్నారంటే..? ఆమె మాట్లాడుతూ, “నటి నయనతార ఎవరితోనూ మాట్లాడకపోతే చాలా చెడ్డ వ్యక్తి అవుతుంది. ఎందుకంటే నయనతార చాలా స్వీట్ అండ్ జెన్యూన్ పర్సన్. ఆ ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలో కూడా ఆమెకు తెలియదు. ఆ మేరకు సమస్య కనిపిస్తే పది అడుగుల దూరం వెళ్తుంది. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తమిళ చిత్రసీమలో ఈ స్థాయి నటి పవర్‌ఫుల్‌గా ఉండాలి కానీ ఆమె అలా కాదు, చాలా మెతక మనిషి అని అన్నారు. ప్రస్తుతం శరణ్య కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 

Latest Videos

click me!