మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఎంతో మంది స్టార్ హీరోయిన్లకు లైఫ్ ఇచ్చారు. నగ్మ విజయశాంతి, రాధిక లాంటి హీరోయిన్ ల నుంచి తమన్నా, కాజల్ వరకూ. ఎంతో మంది హీరోయిన్లు ఆయన సరసన నటించి మెప్పించారు. ఇప్పటికే నటిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో ఆయనతో నటించడం వారు అదృష్టంగా భావిస్తుంటారు.
జయసుధతో పెళ్లి చేయమని.. ఆమెభర్తనే డైరెక్ట్ గా అడిగిన స్టార్ హీరో ఎవరు..?
అయితే చిరంజీవి కూడా తన కెరీర్ లో ఏ హీరోయిన్ తో ఎటువంటి వివాదం లేకుండా.. చాలా జాగ్రత్తగా ఉన్నారు. హీరోయిన్ల దగ్గర చాలా హుందాగా ప్రవర్తించేవారు మెగాస్టార్. అందుకే హీరోయిన్లకు ఆయన అంటే చాలా గౌరవం కూడా. కాని కొంత మంది హీరోయిన్ల దగ్గర మాత్రం చాలా చనువుగా ఉండేవారట. రాధిక, సుహాసిని, రాధ, విజయశాంతి లాంటి హీరోయిన్లు మెగాస్టార్ కు ఫ్రెండ్స్ లా ఉండేవారట.
నాగార్జున - అమల ప్రేమకు 32 ఏళ్లు.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు..
అయితే వీరెవరు కాకుండా.. ఒ హీరోయిన్ ను మాత్రం చిరు ముద్దు పేరుతో పిలిచేవారట. ఇంతకీ ఎవారా హీరోయిన్ తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవికి చాలా క్లోజ్ గా ఉండే హీరోయిన్లు రాధిక, విజయశాంతి, రాధ, సుహాసిని.. ఇలా ఎవరు ఉన్నా.. ఆయన మాత్రం దివంగత నటి సౌందర్యను ప్రత్యేకంగా చూసేవారట. ఆమె పద్దతి .. మాటతీరు.. మర్యధ చిరంజీవికి చాలా ఇష్టమని టాక్. అందుకే సౌందర్యను మాత్రమే చిరు సౌ..అని ముద్దుగా పిలుచుకునేవారట. ఆమె కూడా చిరంజీవి ఆప్యయంగా పిలిస్తే.. మురిసిపోయేవారట. ఈ విషయం చిరంజీవి సతీమణి సురేఖకు కూడా తెలుసని సమాచారం. మెగాస్టార్ ఇంటికి వెళ్లి..ఫ్యామిలీలో ఒకరిగా ఉన్న హీరోయిన్ కూడా సౌందర్యనే అంటుంటారు.
=ఫిల్మ్ ఇండస్ట్రీలో సావిత్రి తరువాత అంత పద్దతిగల హీరోయిన్ గా సౌందర్యకుపేరు. ఫ్యాషన్ డ్రెస్సులతో రంభ, రమ్యకృష్ణ అదరగొడుతున్న రోజుల్లో కూడా చీరకట్టుతో.. హీరోయిన్ గా స్టార్ డమ్ ను సంపాదించింది సౌందర్య. బట్టలు ఎప్పుడు మోకాలు దాటనిచ్చేది కాదు దివంగత హీరోయిన్. తన నటనతో మెప్పించి.. ఫ్యామిలీ ఆడియన్స్ చేత శభాష్ అనిపిచుకుంది సౌందర్య. చాలా చిన్న వయస్సులో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి. అదే ఆడియన్స్ చేసే కన్నీళ్ళు పెట్టించింది కూడా.
టాలీవుడ్ తో పాటు, కోలీవుడ్ , బాలీవుడ్ సినిమాల్లో కూడా హీరోయిన్ గా రాణించింది సౌందర్య. తెలుగులోచిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య బాబు , శ్రీకాంత్. జగపతి బాబు సినిమాలో నటించిన సౌందర్య. తమిళంలో రజినీకాంత్, విజయ్ కాంత్, అజిత్ లాంటి స్టార్ల సరసనమెరిసింది. సౌత్ లో తిరుగు లేని ఇమేజ్ ను సాధించిన సౌందర్య.. చాలా చిన్న వయస్సులోనే మరణించింది.
బీజేపీలో చేరిన ఆమె.. పార్టీ ప్రచారం కోసం తిరుగుతూ.. ప్రమాదానికి గురయ్యింది సౌందర్య. హెలికాప్టర్ లో ప్రచారానికి వెళ్తూ..ప్రమాదవశాత్తు అది పేలడంతో... మరణించింది. ఈ ప్రమాదంతో సౌందర్య సోదరుడు కూడా మరణించాడు. అంతే కాదు మరణించే సమయానికి సౌందర్య గర్బవతిగా ఉందని సమాచారం. ఏది ఏమైనా తెలుగు ఆయన్స్ ఆరాధిచే నటీమణులు అటు సావిత్రి.. ఇటు సౌందర్య.. ఇద్దరు చాలా చిన్నవయస్సులోనే మరణించడం బాధాకరం. ఈ ఇద్దరు హీరోయిన్లు మెగాస్టార్ అభిమాన నటీమణులే.