‘స్పిరిట్’ సినిమాను సందీప్ రెడ్డి వంగా స్వయంగా రచించి, దర్శకత్వం వహించి, ఎడిటింగ్ కూడా చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సినిమాలతో తన ప్రత్యేక శైలిని నిరూపించుకున్న వంగా, ఈసారి ప్రభాస్‌తో ఎలాంటి కథ చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సినిమాను విడుదల చేయాలన్న లక్ష్యంతో, ‘స్పిరిట్’ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు మాండరిన్, జపనీస్, కొరియన్ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.