ఇండస్ట్రీ హిట్ సినిమాని రిజెక్ట్ చేసిన చిరంజీవి..అద్భుతం జరిగింది, టాలీవుడ్ మొత్తం ఆ మూవీ గురించే

First Published Oct 6, 2024, 10:12 AM IST

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్ చిత్రాలు అందుకున్నారు. ఖైదీ చిత్రంతో చిరంజీవి ఇండస్ట్రీ హిట్స్ హవా మొదలైంది. 80, 90 దశకాల్లో చిరంజీవి తిరుగులేని మెగాస్టార్ గా అవతరించారు.

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్ చిత్రాలు అందుకున్నారు. ఖైదీ చిత్రంతో చిరంజీవి ఇండస్ట్రీ హిట్స్ హవా మొదలైంది. 80, 90 దశకాల్లో చిరంజీవి తిరుగులేని మెగాస్టార్ గా అవతరించారు. చిరంజీవి చిత్రాలకు వచ్చే వసూళ్లు అందరిని ఆశ్చర్యానికి గురిచేసేవి. 

చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి చిత్రాల వసూళ్లు అయితే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇతర హీరోల చిత్రాలు దరిదాపుల్లో లేని విధంగా ఆ చిత్రాలు వసూళ్లు సాధించాయి. అయితే చిరంజీవి ఒక ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని మిస్ చేసుకోబోయారు. అదే గ్యాంగ్ లీడర్ చిత్రం. చిరంజీవి మాస్ ఇమేజ్ ని పీక్ స్టేజ్ కి చేర్చిన చిత్రం గ్యాంగ్ లీడర్. ముందుగా ఈ చిత్ర కథ చిరంజీవికి ఏమాత్రం నచ్చలేదట. 

Also Read : విదేశాల్లో షూటింగ్, నేనొచ్చేవరకు బిడ్డని కనకు అంటూ భార్యకి ఎన్టీఆర్ వార్నింగ్.. లక్ష్మీ ప్రణతి అబద్దం చెప్పి

Latest Videos


దర్శకుడు విజయ్ బాపినీడు ఎంతో ఆశగా చిరంజీవిని కలసి కథ చెప్పారు. నిరుద్యోగిగా తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో తిరిగే యువకుడు, అతడికి ఒక ఫ్యామిలీ, ఆర్థిక ఇబ్బందులు పడే అన్నయ్య ఈ తరహాలో కథ ఉంటుంది. ఇది చాలా రొటీన్ స్టోరీ. ఇలాంటి కథలు గతంలో చాలా వచ్చాయి కదా అని చిరంజీవి రిజెక్ట్ చేశారట. దీనితో విజయ్ బాపినీడు నిరాశతో వెనుదిరిగారు. ఆ తర్వాత విజయ్ బాపినీడు ఓ హోటల్ లో పరుచూరి బ్రదర్స్ ని కలిశారట. చిరంజీవి గారికి రీసెంట్ గా కథ చెప్పా.. అది ఆయనకి నచ్చలేదు అని విజయ్ బాపినీడు వాళ్ళకి చెప్పారు. అవుననా ఆ కథ ఏంటి ఒకసారి మాకు కూడా చెప్పు అని పరుచూరి బ్రదర్స్ అడిగారు. 

Also Read : పవన్ కళ్యాణ్, పునీత్ రాజ్ కుమార్, కార్తీ ముగ్గురిలో ఎవరికీ సాధ్యం కాని కామన్ క్వాలిటీ.. నాగార్జున కామెంట్స్

కథ విన్న పరుచూరి బ్రదర్స్ మాకు మూడు రోజుల టైం ఇవ్వు అని చెప్పారట. ఆ తర్వాత ఆ కథలో చాలా మార్పులు చేసారు. చిరంజీవి గారికి ఫోన్ చేసి.. విజయ్ బాపినీడు చెప్పిన కథలో మేము మార్పులు చేశాం. ఒకసారి వినండి అని అడిగారట. విజయ్ బాపినీడు రాసుకున్న కథలో చిరంజీవి ఫ్రెండ్స్ గ్యాంగ్ చనిపోతారు. గ్యాంగ్ చనిపోతే గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ కి అర్థం లేదు. కాబట్టి ఫ్రెండ్స్ చనిపోకూడదని పరుచూరి బ్రదర్స్ మార్పులు చేశారు. అదే విధంగా విజయశాంతి ఎపిసోడ్స్ అన్నీ పరుచూరి వాళ్ళ సృష్టి. కైకాల సత్యనారాయణ జైలర్ పాత్రలో కనిపించడం లాంటివి అన్నీ పరుచూరి బ్రదర్స్ యాడ్ చేశారు. 

Chiranjeevi

చేయి చూడు ఎంత రఫ్ గా ఉందో.. రఫ్ఫాడించేస్తా లాంటి మాస్ మ్యానరిజమ్స్ సృష్టించారు. చిరంజీవి కథని ఒకే చేశారు. మురళి మోహన్, సుమలత, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ లాంటి కీలక నటీనటుల్ని ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రం 1991 మే 9 న విడుదలయింది. బప్పీలహరి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎక్కడా చూసిన గ్యాంగ్ లీడర్ ఆడియో క్యాసెట్లు విపరీతంగా అమ్ముడయ్యాయి. సినిమాకి హైప్ వచ్చింది. 

Chiranjeevi and Vijayashanti

కొన్ని వారాల పాటు అన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో గ్యాంగ్ లీడర్ చిత్రం సునామీ సృష్టించింది. చిరంజీవి డ్యాన్సులు, పాటలు, మ్యానరిజమ్స్ మాస్ ప్రేక్షకులని ఉర్రూతలూగించాయి. ఈ రేంజ్ లో ప్రభంజనం ఉంటుంది అని చిత్ర యూనిట్ కూడా ఊహించలేదు. టాలీవుడ్ లో ఫస్ట్ టైం 10 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రం ఇదే. టాలీవుడ్ కి ఇంత మార్కెట్ ఉందా అని అంతా ఆశ్చర్యపోయారు. పరుచూరి బ్రదర్స్ రూపంలో అద్భుతం జరగకుంటే చిరంజీవి ఒక ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని మిస్ అయ్యేవారు. 

click me!