చిరంజీవికి భార్యగా, చెల్లిగా, తల్లిగా నటించిన ఏకైక నటి! ఈ అరుదైన కాంబో ఎలా సాధ్యమైంది?

First Published | Oct 6, 2024, 10:02 AM IST

ఓ నటి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఆమె చిరంజీవికి భార్యగా, చెల్లిగా, తల్లిగా చేయడం విశేషం. ఈ అరుదైన కాంబో ఎలా చోటు చేసుకుంది..

Sujatha


నటుడిగా చిరంజీవిది నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా ప్రస్థానం. ఇప్పటివరకు చిరంజీవి 156 చిత్రాల్లో నటించారు. చిరంజీవి నటించిన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు 1978లో విడుదలైంది. నటుడిగా నిలదొక్కుకునే దశలో చిరంజీవి సపోర్టింగ్, విలన్ రోల్స్ సైతం చేశారు. 
 


1983లో విడుదలైన ఖైదీ చిరంజీవికి స్టార్డం తెచ్చిపెట్టింది. ఆయనకు ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అక్కడి నుండి చిరంజీవి వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. కాగా ఐదారు జనరేషన్స్ హీరోయిన్స్ తో చిరంజీవి ఆడిపాడారు. జయసుధ నుండి తమన్నా వరకు వివిధ తరాల హీరోయిన్స్ ఆయనతో రొమాన్స్ చేసిన వారి లిస్ట్ లో ఉన్నారు. 

కాగా ఓ నటి చిరంజీవికి ప్రేయసిగా, భార్యగా, చెల్లిగా, తల్లిగా కూడా చేసింది. ఆ నటి ఎవరో కాదు సుజాత. శ్రీలంకలో పుట్టిన మలయాళీ అమ్మాయి సుజాత. నటనపై మక్కువతో పరిశ్రమలో అడుగు పెట్టింది. తపస్విని అనే మలయాళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. 
 


Sujatha

70లలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా రాణించింది. సుజాత 1980లో ప్రేమ తరంగాలు టైటిల్ తో తెలుగు చిత్రం చేసింది. ఈ మూవీలో కృష్ణంరాజు, చిరంజీవి హీరోలుగా నటించారు. జయసుధ ప్రధాన హీరోయిన్ కాగా, సుజాత సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఈ మూవీలో సావిత్రి సైతం నటించడం విశేషం. 

ప్రేమ తరంగాలు మూవీలో చిరంజీవి ప్రియురాలిగా సుజాత నటించింది. క్లైమాక్స్ లో చిరంజీవి-సుజాత వివాహం కూడా చేసుకుంటారు. ఆ విధంగా ప్రేమ తరంగాలు చిత్రంలో సుజాత చిరంజీవికి ప్రేయసి, భార్య పాత్రల్లో కనిపించారు. అనంతరం వీరి కాంబోలో వచ్చిన చిత్రం... సీతాదేవి. 1982లో విడుదలైన సీతాదేవి చిత్రంలో చిరంజీవికి సుజాత చెల్లిగా నటించడం విశేషం. 

Sujatha

90ల నాటికి సుజాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. ఆమె పలు చిత్రాల్లో హీరోలకు తల్లి పాత్రలు చేసింది. సూత్రధారులు మూవీలో ఏఎన్నార్ భార్యగా ఏజ్డ్ ఉమన్ రోల్ చేసింది. చంటి చిత్రంలో వెంకటేష్ కి తల్లిగా సుజాత కనిపించారు. సుజాత పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. చంటి అప్పట్లో బ్లాక్ బస్టర్. ఈ మూవీలోని సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. 

1995లో చిరంజీవి బిగ్ బాస్ టైటిల్ తో రివేంజ్ యాక్షన్ డ్రామా చేశాడు. బిగ్ బాస్ మూవీలో చిరంజీవికి తల్లిగా సుజాత నటించారు. దర్శకుడు విజయ్ బాపినీడు బిగ్ బాస్ తెరకెక్కించారు. రోజా హీరోయిన్ గా నటించింది. ఇదే టైటిల్ తో బిగ్ బాస్ చిత్రాన్ని మలయాళంలో డబ్ చేశారు. అయితే బిగ్ బాస్ ఆశించిన స్థాయిలో ఆడలేదు.  

Chiranjeevi Konidela

ఆ విధంగా సుజాత చిరంజీవికి ప్రేయసిగా, భార్యగా, చెల్లిగా, తల్లిగా నటించి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. సుజాత 2006లో హార్ట్ అటాక్ తో కన్నుమూశారు. అదే ఏడాది విడుదలైన తమిళ చిత్రం వరలారు ఆమెకు చివరిది. సుదీర్ఘ కెరీర్లో సుజాత 240కి పైగా చిత్రాల్లో నటించారు. 

జయసుధ సైతం చిరంజీవి ప్రేయసిగా, తల్లిగా నటించింది. ఇది కథ కాదు మూవీలో చిరంజీవి-జయసుధ జంటగా నటించారు. కమల్ హాసన్ మరొక హీరో. అనంతరం జయసుధ చిరంజీవికి తల్లిగా నటించింది. రిక్షావోడు మూవీలో జయసుధ చిరంజీవికి తల్లి పాత్ర చేసింది. 

రిక్షావోడు చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకుడు. చిరంజీవి డ్యూయల్ రోల్ చేశాడు. రిక్షావోడు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఆశించిన స్థాయిలో ఆడలేదు. నగ్మా, సౌందర్య హీరోయిన్స్ గా నటించారు. కోటి మ్యూజిక్ మాత్రం బాగుంటుంది. జయసుధ, సుజాతలతో చిరంజీవికి అరుదైన కాంబినేషన్స్ చోటు చేసుకున్నాయి. 

ఇలాంటి కాంబినేషన్స్ టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. అంజలికి జంటగా అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో సీనియర్ ఎన్టీఆర్ నటించాడు. అంజలి ఫేడ్ అవుట్ అయ్యాక ఎన్టీఆర్ కి ఆమె తల్లిగా కనిపించి మెప్పించారు. ఈ కాంబినేషన్ ని ప్రేక్షకులు అంగీకరించారని చెప్పొచ్చు. 

బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ  తెలుసుకోండి 

Latest Videos

click me!