బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ఎవరు? రేసులో ఆ ముగ్గురు! ఆడియన్స్ అభిప్రాయం ఇదే

First Published | Oct 6, 2024, 7:48 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఆడియన్స్ లో కంటెస్టెంట్స్ పట్ల అంచనాలు ఏర్పడ్డాయి. కాగా టైటిల్ రేసులో ఆ ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. 
 

సెప్టెంబర్ 1న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ చోటు చేసుకుంది. 14 మంది సెలెబ్స్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్స్ లిస్ట్ ఏమంత కిక్ ఇవ్వలేదు. విష్ణుప్రియ మినహాయిస్తే... ప్రస్తుతం ఫార్మ్ లో ఉన్న, ఫేమ్ ఉన్న సెలబ్రిటీ ఒక్కరు లేరు. స్టార్ మా కోటాకు మించి సీరియల్ నటులను హౌస్లోకి పంపింది. అందులోనూ వారందరు కన్నడ బ్యాచ్.


ఫస్ట్ వీక్ సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క ఎలిమినేటైంది. ఆమె నిష్క్రమణ ఊహించిందే. వయసు రీత్యా ఆమెను ఆడియన్స్ ఎంకరేజ్ చేయలేదు. శేఖర్ బాషా ఎలిమినేషన్ షాక్ ఇచ్చింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న శేఖర్ బాషా మిగతా ఇంటి సభ్యుల నిర్ణయంతో బయటకు రావాల్సి వచ్చింది. మూడో వారం నటుడు అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. అనూహ్యంగా నాలుగో వారం సోనియాకు పేక్షకులు గుడ్ బై చెప్పారు. సోనియా పై అత్యంత నెగిటివిటీ నడిచింది. సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురైంది. 

మరోవైపు వైల్డ్ కార్డు ఎంట్రీలకు సమయం ఆసన్నమైంది. దాంతో నాగార్జున ఈ వారం ఇద్దరిని సొంత ఇంటికి పంపుతున్నారు. నటుడు ఆదిత్య ఓం ఆల్రెడీ మిడ్ వీక్ ఎలిమినేషన్ తో బయటకు వచ్చాడు. ప్రస్తుతం హౌస్లో 9 మంది ఉన్నారు. నామినేషన్స్ లో ఉన్నవారిలో నైనిక ఓటింగ్ లో వెనుకబడిందట. ఆమె ఎలిమినేట్ కావడం ఖాయం అంటున్నారు. నైనిక కూడా ఎలిమినేట్ అయితే హౌస్లో మిగిలేది 8 మంది. వీరిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. 
 


వైల్డ్ కార్డు ఎంట్రీలకు టైటిల్ కొట్టే ఛాన్స్ ఉండదు. వారు ఐదు వారాల గేమ్ చూసి వచ్చారు. ప్రేక్షకుల నుండి వారికి పూర్తి మద్దతు ఉండదు. ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అయినప్పటికీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కి టైటిల్ దక్కడం అసంభవం. కాబట్టి ఫస్ట్ డే నుండి హౌస్లో కష్టపడుతున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఐదు వారాల గేమ్ ముగిసిన నేపథ్యంలో కంటెస్టెంట్స్ ఆట తీరుపై ప్రేక్షకుల్లో అభిప్రాయాలు ఏర్పడ్డాయి. వారు ఒక అంచనాకు వచ్చారు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ ఆ ముగ్గురిలో ఒకరిది అంటున్నారు. ఈ లిస్ట్ లో మొదట నిఖిల్ పేరు వినిపిస్తుంది. ఈ సీరియల్ నటుడు ఫస్ట్ వీక్ నుండి గేమ్ బాగా ఆడుతున్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నాడు. సోనియా కారణం అతడి గేమ్ గత రెండు వారాలలో దెబ్బతింది. నాగార్జున ఈ మేరకు హెచ్చరికలు కూడా చేశాడు. అయితే సోనియా గత వారం ఎలిమినేటైన సంగతి తెలిసిందే. ఆమె హౌస్లో లేదు కాబట్టి నిఖిల్ గేమ్ మరింత మెరుగయ్యే సూచనలు ఉన్నాయి. టైటిల్ కొట్టే సత్తా అతడికి ఉంది. 
 

నిఖిల్ అనంతరం టైటిల్ గెలిచే అవకాశం ఉన్న మరొక కంటెస్టెంట్ విష్ణుప్రియ. ఈమెకు బుల్లితెర ఆడియన్స్ లో భారీ ఫేమ్ ఉంది. అందులోను తెలుగు అమ్మాయి. విష్ణుప్రియ గేమ్ పరంగా యావరేజ్ అనొచ్చు. ప్రేరణతో గొడవలు ఈమెకు కొంత నెగిటివ్ ఇమేజ్ తెచ్చాయి. పృథ్విరాజ్ తో లవ్ ట్రాక్ నడుపుతుంది. పూర్తిగా ఓపెన్ కాకపోయినప్పటికీ అతడి మీద విష్ణుప్రియకు గురి ఉంది. నామినేట్ అయిన ప్రతిసారి, ఓటింగ్ లో ఆమె టాప్ 3లో ఉంటుంది. ప్రేక్షకులు ఓట్లు గట్టిగానే వేస్తున్నారు. 

Bigg boss telugu 8

కాబట్టి విష్ణుప్రియ టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ విన్నర్ రేసులో వినిపిస్తున్న మరొక పేరు నబీల్. ఈ సోషల్ మీడియా స్టార్ అనూహ్యంగా దూసుకొచ్చాడు. అతడి గేమ్ ప్రేక్షకులకు నచ్చింది. ఓట్లు పెద్ద మొత్తంలో పడుతున్నాయి. ఓటింగ్ లో విష్ణుప్రియ, నిఖిల్ లతో నబీల్ పోటీ పడుతున్నాడు. చెప్పాలంటే నబీల్ సామాన్యుడు అని చెప్పొచ్చు. అతడికి సోషల్ మీడియాలో ఓ మోస్తరు ఇమేజ్ ఉంది. 

బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ  తెలుసుకోండి 

Bigg boss telugu 8

సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్లలో నబీల్ కూడా ఒకటి. నబీల్ టైటిల్ గెలిచినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. బిగ్ బాస్ హౌస్లో ఏమైనా జరగొచ్చు. సీజన్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. శివాజీ, అమర్ దీప్ వంటి టాప్ సెలెబ్స్ కి షాక్ ఇస్తూ టైటిల్ సొంతం చేసుకున్నాడు.  కాబట్టి విష్ణుప్రియ, నిఖిల్, నబీల్ లలో ఒకరు టైటిల్ విన్నర్ కావచ్చు అనేది, ప్రస్తుతానికి ఉన్న అంచనా... 

Latest Videos

click me!