Megastar: మా నాన్న ఆ రోజు ఇచ్చిన వార్నింగ్‌ విలువేంటో తెలిసొచ్చింది.. గూండా సినిమా టైమ్‌లో సంఘటన బయటపెట్టిన చిరంజీవి

Published : Jun 24, 2026, 08:57 AM IST

ఒళ్లు వంచి పనిచేస్తేనే మంచి ఫలితం వస్తుందన్నారు మెగాస్టార్ చిరంజీవి. చరణ్ విషయంలో తన విషయంలో అదే నిజమయ్యిందన్నారు. చరణ్ కు గాయాలు తగిలినప్పుడు తను పడిన బాధను చెప్పుకుంటూ.. గతంలో తన తండ్రి అన్న మాటలను గుర్తు చేసుకున్నారు? 

PREV
15
మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్..

రీసెంట్ గా పెద్ది సక్సెస్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. తన వారసుడిగా రామ్ చరణ్ సాధించిన ఘనతను తలుచుకుని ఉప్పొంగిపోయాడు. అదే సమయంలో సినిమా కోసం రామ్ చరణ్ పడుతున్న కష్టాన్ని అభినందిస్తూనే.. చరణ్ కు జరిగిన ప్రమాదాలను తలుచుకుని బాధపడ్డారు. తండ్రిగా తాన ఫీలింగ్ ఏంటో వెల్లడించారు. ఈక్రమంలో తాన కెరీర్ బిగినింగ్ లో తన తండ్రి ఎలా ఫీలయ్యారో.. ఏమని కామెంట్ చేశారో గుర్తు చేశారు చిరంజీవి. పెద్ది ఈవెంట్ తో తన తండ్రిని తలుచుకుని మెగాస్టార్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

25
రామ్ చరణ్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నా..

చిరంజీవి మాట్లాడుతూ.. '' తోటి నటుడిగా, పరిశ్రమలో సీనియర్‌ యాక్టర్ గా చెప్పాలంటే... రామ్ చరణ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. యాక్షన్, డ్యాన్స్, ఎమోషన్స్, ఇంటెన్సిటీ, ఇన్వాల్వ్‌మెంట్... ఒక నటుడికి అవసరమైన అన్ని కోణాల్లో పరిపక్వత సాధించి, దానిని 100 శాతం చరణ్ తెరపై చూపించాడు. 

రంగస్థలంలో చరణ్ ఎంత అద్భుతంగా నటించాడో అందరికి తెలుసు.. మళ్లీ అలాంటి పాత్ర ఎప్పుడొస్తుందా అని అనుకున్నా.. కానీ మూడేళ్లలోనే.. పెద్దిలాంటి మరో గొప్ప పాత్ర రావడం ఆశ్చర్యంగా అనిపించింది. ఈ పాత్ర దక్కడం నిజంగా చరణ్ అదృష్టం.సినిమా చూస్తున్నప్పుడు మాకు చరణ్ కనిపించలేదు... పెద్ది మాత్రమే కనిపించాడు. ఆ పాత్రను పూర్తిగా ఒంటబట్టించుకున్నాడు. 

పెద్ది పాత్రతో మనందరినీ నవ్వించాడు, ఏడిపించాడు, ఉత్సాహపరిచాడు, భావోద్వేగానికి గురిచేశాడు. కళ్లతోనే భావాలను పలికిస్తూ ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించగలిగాడు. అదే పరిపూర్ణ నటన. ఈరోజు రామ్ చరణ్ ఆ పరిపక్వతను, ఆ సంపూర్ణతను చూపించి నన్ను పూర్తిగా సంతృప్తిపరిచాడు. చివరిగా విజయం సాధించాడు. ఆ పాత్రలో అతను చూపించిన నటనకు నా హృదయపూర్వక అభినందనలు.. అని చిరంజీవి అన్నారు.

35
తండ్రి మాటలు గుర్తుతెచ్చుకుని ఎమోషనల్ అయిన మెగాస్టార్

చిరంజీవి మాట్లాడుతూ.. '' షూటింగ్ సమయంలో చరణ్ కంటికి గాయం అయింది. ఆ ఫొటో చూసి నేను చాలా భయపడ్డాను. డాక్టర్లతో మాట్లాడిన తర్వాత ప్రమాదం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. ఎనిమిది కుట్లు పడ్డాయి. అయినా సరే చరణ్ వెనక్కి తగ్గలేదు. ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది.

 చరణ్ ని చూస్తే.. నాకు గూండా సినిమా షూటింగ్ గుర్తొచ్చింది. ఆ షూటింగ్ లో నేను ట్రైన్ కింద పడుకుని యాక్షన్ సీన్ చేయల్సి వచ్చింది. అప్పుడే షూటింగ్ కు మా నాన్నగారు వచ్చారు. అప్పుడు సురేఖ ప్రెగ్నెంట్... ఆ సీన్ షూటింగ్ చూసి మా నాన్నగారు చాలా భయపడ్డారు. ఎందుకు ఈ రిస్క్ లు అని అడిగారు. నేను 'ప్రేక్షకులను అలరించాలంటే ఇలాంటి రిస్కులు చేయాల్సిందే' అన్నాను. 

అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు – 'నీకు కొడుకు పుట్టి, వాడు హీరో అయి ఇలాంటి కష్టాలు పడితే అప్పుడు ఒక తండ్రి బాధ తెలుస్తుంది' అని. చరణ్ కి గాయమైనప్పుడు నాన్నగారి మాట గుర్తుకు వచ్చింది. అయితే తను కష్టాన్ని నమ్ముకోవడం తండ్రిగా నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది..'' అని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

45
కష్టాన్నే నమ్ముకున్నాం.. షార్ట్ కట్స్ అలవాటు లేదు..

షార్ట్ కట్ లో సక్సెస్ కోసం మేం ఎప్పుడు చూడలేదన్నారు చిరంజీవి. ఏ స్థాయిలో ఉన్నా.. కష్టాన్నే నమ్ముకుంటామని క్లారిటీఇచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ..'' చరణ్ ఒక స్టార్ హీరో కొడుకు. గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. దర్శకుడు చెప్పింది చేసి వెళ్లిపోవచ్చు. కానీ అతను అలా చేయలేదు. కష్టాన్ని నమ్ముకున్నాడు. అందుకే ఈరోజు మీరంతా అతని నటనను నేషనల్ అవార్డు స్థాయిలో ఉందని ప్రశంసిస్తున్నారు. అవార్డు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రజల మనసుల్లో 'అద్భుతంగా నటించాడు' అనే గుర్తింపు రావడం కంటే గొప్ప అవార్డు మరొకటి లేదు. ప్రజల ప్రేమ, అభిమానం, ఆదరణే గొప్ప అవార్డు. 

ఈ సినిమా కోసం అతను చేసిన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను నేను ప్రతిరోజూ ఇంట్లో చూశాను. ఉదయం వ్యాయామాలు, షూటింగ్, మళ్లీ సాయంత్రం వ్యాయామాలు... అతని కష్టాన్ని చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా అనిపించేది. ఇలాగే కష్టపడతాం.. ఒళ్లు వచ్చి పనిచేస్తాం.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఆడియన్స ను అభిమానులను అలరించడానికే మా ప్రయత్నం అని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

55
స్వయంకృషితో ఎదిగిని చిరంజీవి..

చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. ఎన్నో అవమానాలు, ఎదురు దెబ్బలు తిని హీరోగా ఎదిగాడు. ఎంత పోటీ ఎదురైనా తట్టుకుని నిలబడ్డాడు. టాలీవుడ్ కు మైఖేల్ జాక్సన్ స్టెప్పులను పరిచయం చేసింది చిరంజీవే.. యాక్షన సీన్స్ లో సరికొత్త ఒరవడికి తెరతీసిన మెగాస్టార్.. తన మార్క్ నటనతో మెగాస్టార్ గా ఎదిగాడు. అన్ని విషయాల్లో తాను స్సెషల్ అని నిరూపించుకుని.. ఈ స్థాయికి వచ్చాడు చిరంజీవి. ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చి.. టాలీవుడ్ లో మెగా సాంమ్రాజ్యాన్నే స్థాపించాడు. మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు, నిర్మాతలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. సౌత్ ఇండియాన్ కపూర్స్ ఫ్యామిలీ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు చిరంజీవి.

Read more Photos on
click me!

Recommended Stories