
సమంత కమ్ బ్యాక్ ఇస్తూ నటించిన `మా ఇంటి బంగారం` మూవీ ఊహించని విధంగా దూసుకుపోతుంది. సినిమాకి మిక్స్ డ్ టాక్ వచ్చినా అదిరిపోయే కలెక్షన్లని రాబడుతోంది. ఈ మూవీ ప్రారంభం నుంచి బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. ఇప్పుడు రెండో వారంలో దుమ్మురేపుతోంది. మంచి వసూళ్లతో రన్ అవుతుంది. సోమవారం నుంచి కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. మంగళవారం కూడా డీసెంట్ నెంబర్స్ రావడం విశేషం. మరి ఐదు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఎంత కలెక్షన్లు వచ్చాయి? ఇంకా ఎంత రావాలి అనేది చూస్తే.
సమంత హీరోగా నటించిన `మా ఇంటి బంగారం` ఐదు రోజుల్లో రూ.51.32కోట్లు రాబట్టినట్టు ప్రముఖ కలెక్షన్ల సైట్ `సాక్నిల్క్` వెల్లడించింది. దీనికి మంగళవారం మూడున్నర కోట్లు రావడం విశేషం. సోమవారం రూ.4.10కోట్లు రాగా, మంగళవారం అరవై లక్షలు తగ్గాయి. ఆదివారం పది కోట్లు వసూలు చేయగా, సోమవారానికి 60శాతం పడిపోయింది. కానీ ఈ స్థాయిలో వసూళ్లు రావడం విశేషమనే చెప్పాలి. ఇది సినిమా సక్సెస్‌కి నిదర్శనంగా నిలుస్తోంది.
`మా ఇంటి బంగారం` మూవీకి మొదటి రోజు రూ.5.35కోట్లు, రెండో రోజు రూ.7.65కోట్లు, మూడో రోజు రూ.10.10కోట్లు వచ్చాయి. మొదటి మూడు రోజుల్లో క్రమంగా కలెక్షన్లు పెరిగాయి. మౌత్ టాక్‌తో సినిమాకి పాజిటివిటీ పెరిగింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో వాళ్లు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఇది సినిమా సక్సెస్ కి కారణమైందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ మూవీకి నాలుగు రోజుల్లో రూ.50కోట్లు కలెక్ట్ చేసినట్టు టీమ్ వెల్లడించింది. ఐదు రోజుల్లో రూ.55కోట్ల పోస్టర్‌ని రిలీజ్ చేయనున్నారు.
సమంత మూడేళ్ల తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చిన `మా ఇంటి బంగారం` మూవీతో బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తోంది. ఈ మూవీకి సుమారు రూ.30కోట్ల బడ్జెట్ అయ్యిందని సమాచారం. ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ రూపంలో రూ.35కోట్లు వచ్చాయట. దీంతో రిలీజ్‌కి ముందే సినిమా ప్రాఫిట్‌లో ఉంది. ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే సొంతంగానే రిలీజ్ చేశారు. కాకపోతే రూ.30కోట్ల బిజినెస్‌గా లెక్క కట్టినట్టు సమాచారం. ఈ లెక్కన ఈ మూవీకి ఇప్పటికే సుమారు రూ.27కోట్ల షేర్ సాధించింది. ఈ వారం కొత్తగా వచ్చే సినిమాలేవి లేవు, వచ్చే వారం కూడా పోటీ లేదు. దీంతో ఈ రెండు వారాలు `మా ఇంటి బంగారం`కి తిరుగులేదు. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.70-80కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. ఇది సమంత కెరీర్లోనే అత్యధికమని చెప్పొచ్చు. అదే సమయంలో ఈ సినిమా ద్వారా సమంత ఏకంగా రూ.30-40కోట్ల లాభాలు గడించే అవకాశం ఉంది. ఇది ఓ రకంగా రికార్డుగా చెప్పొచ్చు. ఇటీవల కాలంలో స్థాయిలో ఒక సినిమా లాభాలను గడించడం చాలా అరుదు. `మన శంకర వర ప్రసాద్` మూవీకి మంచి లాభాలు వచ్చాయి. ఆ తర్వాత `మా ఇంటి బంగారం` మూవీ నిలుస్తుందని చెప్పొచ్చు.
నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంతతోపాటు కన్నడ నటులు గుల్షన్ దేవయ్య, దిగంత్ అలాగే శ్రీముఖి, మంజుష, గౌతమి, చైతన్య కృష్ణ, వెన్నెల కిశోర్ వంటి వారు కీలకపాత్రలు పోషించారు. ఇందులో సమంంత అనాథ. చిన్నప్పుడు అనేక ఇబ్బందులు పడుతుంది. ఎంతో స్ట్రగుల్స్ అనంతరం తిరుగుబాటు చేస్తుంది. అడవిలోకి వెళ్లి తుపాకులు పడుతుంది. అక్కడ కూడా తనకు మోసమే జరుగుతుంది. దీంతో అడవిలోనూ తిరుగుబాటు చేసి మళ్లీ సాధారణ లైఫ్ స్టార్ట్ చేస్తుంది. ఒక పెద్దింటి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్న క్రమంలో మళ్లీ తన గతం వెంటాడుతుంటుంది. దాని వల్ల ఫ్యామిలీకి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కుటుంబం కోసం సమంత చేసిన పోరాటమే ఈ మూవీ. నటన పరంగా సమంత ఇరగదీసింది. ఇన్నోసెంట్‌గా నవ్వులు పూయించింది. యాక్షన్‌తో మైండ్ బ్లాక్ చేసింది. మొత్తంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.