మెగాస్టార్ చిరంజీవి, కెప్టెన్ విజయకాంత్ ఇద్దరూ మాస్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోలు. అలాంటి వీరిద్దరూ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది.. బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయం. వీరిద్దరి కాంబినేషన్ రావాల్సిన ఒక చిత్రం మిస్ అయింది.
80వ దశకంలో చిరంజీవి కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. వరుస చిత్రాలతో చిరంజీవి తిరుగులేని హీరోగా టాలీవుడ్ లో అవతరించారు. ఆ టైంలో చిరంజీవి కృష్ణ, కృష్ణంరాజు లాంటి హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలు కూడా చేశారు. ఆ టైంలో బాక్సాఫీస్ దద్దరిల్లే మల్టీస్టారర్ కాంబినేషన్ కి రంగం సిద్ధం అయింది. కానీ ఊహించని విధంగా ఆ చిత్రం ముందుకు సాగలేదు.
DID YOU KNOW ?
చిరంజీవి మూవీలో రాజశేఖర్
చిరంజీవి స్నేహం కోసం చిత్రంలో రాజశేఖర్ నటించాల్సింది. చిరంజీవి స్నేహితుడి పాత్రలో రాజశేఖర్ నటించాలి. కానీ రాజశేఖర్ ఏజ్ సరిపోదని చిరంజీవి వద్దన్నారట.
25
చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్
1981లో నిర్మాత బాబురావు అగ్నిజ్వాల అనే చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. అప్పటికే ఆయన నిర్మాతగా రెండు చిత్రాలు నిర్మించారు. మూడవ చిత్రం సూపర్ స్టార్ కృష్ణతో తీయాలనేది ఆయన కోరిక. కృష్ణతో ఈ విషయం చెబితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కథ రెడీ చేసుకోమన్నారు. దీనితో బాబురావు పరుచూరి బ్రదర్స్ తో అగ్నిజ్వాల అనే కథ రాయించారు. ఇది మల్టీస్టారర్ కథ. దీనితో ఈ మూవీలో మరో హీరో కూడా నటించాలి. ఈ మరో హీరోగా చిరంజీవిని అనుకున్నారు.
35
వాయిదా పడ్డ అగ్నిజ్వాల
ఓ అక్క, ఇద్దరు తమ్ముళ్ల సెంటిమెంట్ తో సాగే కథ ఇది. కృష్ణ, చిరంజీవి అన్నదమ్ములుగా నటించాలి. కానీ ఆ టైంకి చిరంజీవి డేట్లు దొరకలేదు. కృష్ణతో నటించాలనే ఆసక్తి చిరంజీవికి ఉన్నప్పటికీ డేట్లు అడ్జెస్ట్ చేయలేకపోయారు. అదే సమయంలో కృష్ణకి 'అసాధ్య అలియా' అనే కన్నడ చిత్రం బాగా నచ్చింది. అగ్నిజ్వాల కంటే ఈ మూవీ ఇంకా బావుంటుందని కృష్ణ అన్నారు. దీనితో రీమేక్ హక్కులు తీసుకున్న నిర్మాత బాబురావు.. ఈ చిత్రాన్ని మాయదారి అల్లుడు పేరుతో రీమేక్ చేశారు. ఆ విధంగా అగ్నిజ్వాల చిత్రం అటకెక్కింది.
దీనితో చేసేది లేక ఆ చిత్రాన్ని మోహన్ బాబు, నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కించారు. ఆ మూవీ యావరేజ్ గా నిలిచింది. ఒక వేళ ఆ చిత్రంలో చిరంజీవి- కృష్ణ లేదా చిరంజీవి- విజయకాంత్ కాంబినేషన్ కనుక సెట్ అయి ఉంటే బాక్సాఫీస్ దద్దరిల్లే విజయం సాధించేది అని అప్పట్లో అంతా అభిప్రాయ పడ్డారు.