రెండేళ్లలో 8 డిజాస్టర్లు ఇచ్చిన మెగా హీరోలు.. నష్టం ఎన్ని వందల కోట్లో తెలుసా? `ఓజీ`పైనే ఆశలు

Published : Aug 17, 2025, 09:03 PM IST

మెగా హీరోల సినిమాలు ఇటీవల ఫ్యాన్స్ ని, ఆడియెన్స్ ని నిరాశ పరిచాయి. రెండేళ్లలో ఏకంగా 8 సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. వాటి వల్ల ఎంత నష్టమో తెలుసుకుందాం. 

PREV
16
మెగా హీరోల నుంచి 8 డిజాస్టర్లు

టాలీవుడ్‌లో మెగా హీరోలు ఎనిమిది మంది ఉన్నారు. వీరి నుంచి ఏడాదికి నాలుగైదు సినిమాలు విడుదలవుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో మెగా హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోతున్నాయి. అల్లు వారి సినిమాలు పక్కన పెడితే మెగా ఫ్యామిలీ హీరోల మూవీస్‌ వరుసగా నిరాశ పరుస్తూనే ఉన్నాయి. రెండేళ్లలో ఏకంగా ఎనిమిది సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. సుమారు నాలుగు వందల కోట్ల నష్టాలను తీసుకొచ్చాయి. ఏ ఏ హీరో ఏ ఏ సినిమాతో డిజాస్టర్‌ని ఫేస్‌ చేశారు, ఏ ఏ సినిమా ఎన్ని కోట్ల నష్టం తెచ్చిందో తెలుసుకుందాం.

DID YOU KNOW ?
అల్లు అర్జున్‌ `పుష్ప2`తో బ్లాక్‌ బస్టర్‌
మెగా హీరోలు రెండేళ్లలో వరుసగా పరాజయాలు ఫేస్‌ చేస్తే, అల్లు అర్జున్‌ `పుష్ప 2`తో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఓరకంగా ఇది ఇండస్ట్రీ హిట్‌గా చెప్పొచ్చు.
26
చిరంజీవి -భోళాశంకర్‌

మెగాస్టార్‌ చిరంజీవి చివరగా `భోళా శంకర్‌` చిత్రంతో వచ్చారు. 2023లో ఈ సినిమా విడుదలైంది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తమన్నా హీరోయిన్‌గా నటించగా, కీర్తిసురేష్‌ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. నిర్మాతలు, బయ్యర్లకి కలిపి ఏకంగా రూ.55కోట్ల నష్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత చిరంజీవి నుంచి మరే సినిమా రిలీజ్‌ కాలేదు. ఇప్పుడు `విశ్వంభర`తోపాటు అనిల్‌ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలపై మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

36
పవన్‌ కళ్యాణ్‌- `హరి హర వీరమల్లు`, `బ్రో` మూవీస్‌

పవన్‌ కళ్యాణ్‌ రెండేళ్లలో రెండు సినిమాలతో వచ్చారు. ఇటీవల ఆయన `హరి హర వీరమల్లు` సినిమాలో నటించారు. క్రిష్‌తోపాటు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 25న విడుదలైంది. బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా నష్టం ఏకంగా రూ.85కోట్లు ఉంటుందని సమాచారం. అంతేకాదు రెండేళ్ల క్రితం ఆయన `బ్రో` చిత్రంతో వచ్చారు. ఇందులో సాయి ధరమ్‌ తేజ్‌ మరో హీరోగా నటించారు. ఈ చిత్రం సైతం ఆడలేదు. అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ చిత్రం సుమారు రూ.40కోట్ల వరకు నష్టాలను తీసుకొచ్చినట్టు ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఇలా పవన్‌ ద్వారానే ఎక్కువ నష్టం వచ్చింది. త్వరలో పవన్‌ `ఓజీ` చిత్రంతో రాబోతున్నారు. ఈ మూవీపైనే మెగా అభిమానులు ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. మెగా హీరోలకు సక్సెస్‌ ని స్టార్ట్ చేసే మూవీగా దీన్ని భావిస్తున్నారు. మరి `ఓజీ ఏం చేయబోతుందో చూడాలి.

46
రామ్‌ చరణ్‌- గేమ్‌ ఛేంజర్‌

రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన `గేమ్‌ ఛేంజర్‌` కూడా బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహించగా, దిల్‌ రాజు నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకోలేకపోయింది. బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ వల్ల సుమారు రూ.100కోట్ల నష్టాలను తీసుకొచ్చిందని టాక్‌.

56
వరుణ్‌ తేజ్‌ మూడు సినిమాలు పరాజయం

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ ఈ రెండేళ్లలో మూడు సినిమాలు చేశారు. మూడూ పరాజయం చెందాయి. `గాండీవధారి అర్జున` మూవీ పరాజయం వల్ల నిర్మాతలకు రూ.22 కోట్లు నష్టం వాటిల్లిందని, ఆ తర్వాత వచ్చిన `ఆపరేషన్‌ వాలెంటైన్‌` ద్వారా రూ. 25కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని సమాచారం. ఇక ఆ మధ్య `మట్కా` చిత్రంతో హిట్‌ కొట్టాలని వచ్చినా ఇది కూడా డిజప్పాయింట్‌ చేసింది. దీని వల్ల రూ.35కోట్ల నష్టం వచ్చిందని సమాచారం. ఇలా వరుణ్‌ తేజ్‌ మూడు సినిమాల వల్ల దాదాపు రూ.80కోట్ల వరకు నష్టాలు వచ్చాయని ట్రేడ్‌ వర్గాల సమాచారం.

66
వైష్ణవ్‌ తేజ్‌ -ఆదికేశవ

ఈ ఖాతాలో మరో మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ కూడా ఉన్నారు. `ఉప్పెన` చిత్రంతో హిట్‌ కొట్టి స్టార్‌ అయిన వైష్ణవ్‌ ఆ తర్వాత నటించిన సినిమాలు ఆడలేదు. ఆయన చివరగా `ఆదికేశవ` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈచిత్రం కూడా డిజప్పాయింట్‌ చేసింది. దీని వల్ల రూ.27కోట్ల లాస్‌ వచ్చినట్టు సమాచారం. ఇలా ఈ రెండేళ్లలో మెగా హీరోల 8 సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. సుమారు రూ.400కోట్ల వరకు నష్టాలను తీసుకొచ్చినట్టు ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. 

గమనికః ఇది కేవలం సోషల్‌ మీడియాలో లభించిన సమాచారం మాత్రమే. ఇదే నిజమని మేము ధృవీకరించడం లేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories