బాలయ్య, చిరంజీవికి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్.. పవన్ తో మూవీ చేయాలని ఫోన్ చేస్తే ఏమన్నాడో తెలుసా ?

Published : Aug 17, 2025, 06:19 PM IST

చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లకు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన ఒక దర్శకుడు పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ తో సినిమా చేసే ఛాన్స్ ఎలా మిస్ అయిందో తెలిపారు. 

PREV
15
ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన దర్శకుడు 

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరికీ ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది బి గోపాల్ అనే చెప్పాలి. డైరెక్టర్ బి గోపాల్ తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు లాంటి హీరోలకు సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చారు. ముఖ్యంగా బాలకృష్ణ బాగా కలసి వచ్చిన దర్శకుడు ఆయన. బాలయ్యతో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. 

25
పవన్ కళ్యాణ్ పై బి గోపాల్ కామెంట్స్ 

ఓ ఇంటర్వ్యూలో బి గోపాల్.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. తనకి పవన్ కళ్యాణ్ గారితో మెకానిక్ అల్లుడు చిత్రం నుంచి పరిచయం ఉందని అన్నారు. చిరంజీవి గారితో మెకానిక్ అల్లుడు మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ లొకేషన్ కి వచ్చేవారు. షూటింగ్ లొకేషన్ లో దూరంగా ఒంటరిగా ఒక చెట్టు కింద ఉండేవారు. అందరితో కలిసేవాడు కాదు. 

35
ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు 

ఒకసారి సాంగ్ షూటింగ్ గ్యాప్ లో పవన్ దగ్గరికి వెళ్లి నేనే పలకరించాను. ఎంతో గౌరవంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనే ఆలోచన రాలేదా అని యాంకర్ ప్రశ్నించగా.. ఒకసారి ఆయనతో మూవీ చేయడానికి ప్రయత్నించాను అని బి గోపాల్ అన్నారు. 

45
పవన్ తో మూవీ చేయాలని ప్రయత్నించా

పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రెండు మూడు చిత్రాల తర్వాత ఆయన పేరు బాగా వినిపించేది. ఆయనకి బాగా సెట్ అయ్యే కథ ఒకటి దొరికింది. దీనితో ఆయనకి ఫోన్ చేసి చెప్పాను. మీకు సెట్ అయ్యే కథ నా దగ్గర ఉంది.. మనం సినిమా చేద్దాం అని అడిగా. ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడి తప్పకుండా చేద్దాం అని అన్నారు. 

55
అందుకే మూవీ మిస్ అయింది 

ఆ తర్వాత నా సినిమాలతో నేను బిజీగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం రాలేదు. ఆయన కూడా తన సినిమాలతో బిజీ అయిపోయారు. ఆ విధంగా పవన్ గారితో సినిమా చేసే అవకాశం మిస్ అయింది అని బి గోపాల్ అన్నారు.  

Read more Photos on
click me!

Recommended Stories