
టాలీవుడ్‌లో రంగమ్మత్తగా పాపులర్ అయ్యింది అనసూయ. యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించి టీవీ యాంకర్‌గా పాపులర్ అయ్యింది. నటిగానూ అదరగొడుతుంది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఆకట్టుకుంటుంది అనసూయ.
అనసూయ తాజాగా రెడ్ శారీ ఫోటోలను పంచుకుంది. సండే స్పెషల్ గా ఆమె లేటెస్ట్ గా దిగిన ఫోటో షూట్ పిక్స్ ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లతో పంచుకోగా, అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లని మైమరపిస్తున్నాయి. వైరల్‌గా మారాయి.
ఈ జబర్దస్త్ మాజీ యాంకర్ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అనసూయ అందంపై కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. సండే ట్రీట్ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
మొత్తంగా రెడ్ శారీలో అనసూయ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటూ నెట్టింట రచ్చ చేయడం విశేషం. ఇందులో అనసూయ కామెంట్ చేస్తూ `మూడ్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయక్కర్లేదు, మేము ఇక్కడ ఉన్నాము` అంటూ పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్ మరింత రచ్చ చేసేలా ఉండటం విశేషం.
ఈ ఫోటోలపై, ఆమె లుక్స్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. రెడ్ శారీలో రెడ్ వాల్వెట్‌లా ఉన్నావని, ఫోజులు అదిరిపోయాయని అంటున్నారు. రోజు రోజుకి అందం పెరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.
అదే సమయంలో కొన్ని ఫోటోల్లో అనసూయ లుక్స్ ని, పోజులపై హాట్ కామెంట్ చేస్తున్నారు. ఆమెకి లవ్ ఎమోజీలతో ప్రేమని పంచుతున్నారు. ఈ సండేని చాలా స్పెషల్‌గా చేశారని అంటున్నారు.
ఈ క్రమంలో ఓ నెటిజన్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. కొన్నేళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చి ఉంటే ఇండస్ట్రీని ఊపేసేదానివి అని అంటున్నారు. స్టార్ హీరోయిన్ రేంజ్ లో టాలెంట్ ఉందని అంటున్నారు. మొత్తానికి అనసూయని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
అనసూయ నటిగా కంటే `జబర్దస్త్` కామెడీ షోకి యాంకర్ గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అందులో ఆమె చేసిన రచ్చ వేరే లెవల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ షో ద్వారానే పాపులారిటీతోపాటు క్రేజ్ వచ్చింది. అదే సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది.
రామ్ చరణ్ హీరోగా నటించిన `రంగస్థలం` చిత్రంలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. నటిగా ఆమెకి ఈ మూవీ బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంది. `పుష్ప`లో నటించే ఛాన్స్ ని దక్కించుకుంది. ఇందులో నెగటివ్ రోల్ చేసి ఆకట్టుకుంది అనసూయ. కానీ ఆ తర్వాత సరైన ఆఫర్లు రాలేదు. ఇప్పుడు అనసూయ కి పెద్దగా ఆఫర్లు లేవని తెలుస్తోంది.
ఈ క్రమంలో మళ్లీ బుల్లితెరపై ఫోకస్ పెట్టింది అనసూయ. మొన్నటి వరకు `కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` షోకి జడ్జ్ గా చేసింది. ఇప్పుడు మంచి సినిమా ఆఫర్ల కోసం, షోస్ కోసం వెయిట్ చేస్తోంది అనసూయ. ఇదిలా ఉంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ `హరి హర వీరమల్లు`లో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన విషయం తెలిసిందే.