నిహారిక ఫస్ట్ జీతం ఎంతో తెలుసా..? సినిమాలకంటే ముందు మెగా డాటర్ చేసిన ఉద్యోగం..?

First Published | Aug 17, 2024, 10:06 PM IST

విడాకుల తరువాత ఇండస్ట్రీపై దృష్టిపెట్టింది మెగా డాటర్ నిహారిక. నిర్మాతగా మారింది. అయితే సినిమాల్లోకి రాకముందు ఆమె ఓ చిన్న జాబ్ చేసిందని మీకు తెలుసా..? నిహారిక అందుకున్న ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా..? 
 

Niharika Konidela

మెగా ప్యామిలీ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ నిహారిక కొనిదెల. పెళ్ళి తరువాత ఇండస్ట్రీకి దూరం అయిన ఆమె.. ఆతరువాత భర్తతో మనస్పర్ధల తరువాత విడాకులు తీసుకుంది వివాహ బంధాన్ని తెంచుకుంది. చైతన్యతో విడాకులు తరువాత కొన్నాళ్లు అన్నింటికి బ్రేక్ ఇచ్చి కూల్ అయ్యింది మెగా డాటర్. చిన్నగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తోంది నిహారిక. 

ప్రభాస్ కోసం 100 ఎకరాలు.. యంగ్ రెబల్ స్టార్ ఏం చేయబోతున్నారో తెలుసా..?

గతంలో హీరోయిన్ గా నటించిన నిహారిక.. ప్రస్తుతం నిర్మాతగా మారింది. రీసెంట్ గా కమిటీ కుర్రాళ్లు అనే చిన్న సినిమాను నిర్మించింది బ్యూటీ. ఈసినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి.. మంచి రెస్పాన్స్ ను సాధించింది. మంచి వసూళ్ళు  కూడా వస్తుండటంతో.. నిర్మాతగా సక్సెస్ అయ్యింది నిహారిక. ఇక ముందు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో మేజర్ రోల్ ప్లే చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

నేషనల్ అవార్డ్స్ లో రికార్డ్ అతనిదే..? అత్యధికంగా జాతీయ అవార్డ్స్ సాధించిన స్టార్ ఎవరు..?


ఇక కమిటీ కుర్రాళ్లు సినిమా  ప్రమోషన్స్ ను దగ్గరుండి నిర్వహించింది  నిహారిక. ఈప్రమోషన్స్ లో మీడియా నుంచి ఎదురైన ప్రతీ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది. ఇక నిహారికి  తన గురించి, మెగా ఫ్యామిలీ గురించి కూడా ఈసినిమా ప్రమోషన్స్ లో  ఎన్నో  ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సినిమాల కంటే ముందు నిహారిక ఏం చేసింది అనే విషయాన్ని కూడా నిహారిక వెల్లడించింది. 

రజినీకాంత్ మాటలకు షాక్ అయిన అల్లు అర్జున్, ఏదో అనుకుంటే మరేదో అయ్యింది..?

Niharika Konidela

ఇంటర్వ్యూలో నిహారిక ఫస్ట్ జాబ్..  ఫస్ట్ శాలరీ గురించి ప్రశ్న ఎదురయ్యింది. ఇక నిహారిక మాట్లాడుతూ.. తాను సినిమాల్లోకిచేసిన పని గురించి తెలిపింది. నేను సినిమాల్లోకి రాకముందు  హైదరాబాద్ లోనే ఓ కేఫ్ లో పనిచేసాను. అక్కడ నాకు వారానికి వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు అని అన్నారు. తన ఫ్యామిలీ తనను ఎక్కడికీ బయటకు పంపేవారు కాదని.. అందుకే ఫారెన్ లో చదవాలని ఉన్నా.. వెళ్లలేదన్నారు. తన చదువు అంతా ఇక్కడే హైదరాబాద్ లో కంప్లీట్ చేశానన్నారు. 

శ్రీదేవి నుంచి కృతీ శెట్టి వరకూ.. 16 ఏళ్లకే హీరోయిన్లు గా మారిన తారలు ఎవరు..?
 

గతంలో ఢీ డాన్స్ షో ద్వారా టెలివిజన్ లోకి మొదటిగా ఎంటర్ అయ్యింది నిహారిక. ఆతరువాత కొన్ని షోలకు యాంకరింగ్ చేసిన ఆమె.. ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా నటించింది. సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు కాని.. నిహారిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక వెబ్ సిరిస్ లతో పాటు.. నిర్మాతగా కూడా మారింది బ్యూటీ. 

కోట శ్రీనివాసరావు ను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన సినిమా ఏదో తెలుసా..?

Latest Videos

click me!