నా కూతురికి వాళ్ళ ఎముకలు విరగొట్టడం నేర్పుతాను... కోపంతో రగిలిపోతున్న పవన్ మాజీ వైఫ్ రేణు దేశాయ్!

First Published | Aug 17, 2024, 8:34 PM IST

హీరోయిన్ రేణు దేశాయ్ తన అసహనం, ఆవేదన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తుంది. నా కూతురికి వాళ్ళ ఎముకలు విరగొట్టడం నేర్పుతానని కామెంట్ పోస్ట్ చేసింది. 
 

Renu Desai

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. గతంలో ఆమె ఫేక్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ లో వరుస పోస్ట్స్ పెట్టేవారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్స్ దెబ్బకు ఫేస్ బుక్, ట్విట్టర్ ఎక్స్ అకౌంట్స్ ని డిలీట్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో మాత్రమే కొనసాగుతుంది. సామాజిక సేవ చేయడం కోసమే ఇంస్టాగ్రామ్ డిలీట్ చేయలేదని ఆమె అన్నారు. 
 

Renu Desai

రేణు దేశాయ్ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. పూణే నుండి హైదరాబాద్ కి మకాం మార్చిన రేణు దేశాయ్ నటిగా కొనసాగాలి అనుకుంటున్నారు. గత ఏడాది విడుదలైన టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ ఓ పాత్ర చేసింది. చాలా కాలం అనంతరం రేణు దేశాయ్ ముఖానికి మేకప్ వేసుకుంది. 


Renu desai

రేణు దేశాయ్ సామాజిక, రాజకీయ అంశాల మీద స్పందిస్తూ సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతుంది. ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో నిర్భయ కేసు నమోదు అయ్యింది. జూనియర్ డాక్టర్ పై అత్యాచారం జరిగింది. ఈ ఘటన పై రేణు దేశాయ్ వరుస సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతుంది. తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో రేణు దేశాయ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ సంచలనం రేపుతోంది. 

Renu desai

రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో... మీరు మీ అబ్బాయిలకు అమ్మాయిలను గౌరవించడం నేర్పించండి. నేను నా కూతురికి అబ్బాయిల ఎముకలకు విరగొట్టడం నేర్పిస్తాను, అని ఆద్య కరాటే చేస్తున్న ఫోటో జోడించింది. అబ్బాయిల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆడవాళ్ళ పట్ల సంస్కారం, సభ్యతతో మెలిగేలా పెంచాలి. అదే సమయంలో ఆడపిల్లల తల్లిదండ్రులు తమ కూతుళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు కామాంధులను ఎదుర్కొనే విధంగా స్ట్రాంగ్ గా తయారు చేయాలనే ఉద్దేశంతో రేణు దేశాయ్ అలాంటి పోస్ట్ పెట్టింది. 

రేణు దేశాయ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. ఢిల్లీ నిర్భయ కేసు నిందితుల్లో ఒకరు... రేప్ జరగడానికి అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ కారణం. ఒక మంచి అమ్మాయి రాత్రి 9 గంటలకు రోడ్ల మీద తిరగదు. ఇంటి పని వంట పని చేయడమే అమ్మాయిల కర్తవ్యం అని, మాట్లాడిన వీడియోను కూడా రేణు దేశాయ్ షేర్ చేసింది. మగాళ్ల మనస్తత్వం అంత సంకుచితంగా ఉందని తెలియజేసింది. 

Latest Videos

click me!