ఒకవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఫీవర్ రోజు రోజుకి పెరుగుతోంది. ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ పుష్ప 2 బ్రేక్ చేస్తుంది అంటూ అంచనాలు వినిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు మొదలైంది. అల్లు అర్జున్ కెరీర్ తొలి 1000 కోట్ల చిత్రం అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా కాంట్రవర్సీలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ బిజియం ఇవ్వలేదు. దర్శక నిర్మాతలు అతడిని పాటల వరకు మాత్రమే పరిమితం చేశారు.
ఇంతకీ నాగబాబు ఏమని ట్వీట్ చేసారంటే.. నీవు తప్పుడు దారిలో వెళుతున్నావని గ్రహించినప్పుడు వెంటనే సరిచేసుకోవాలి.. నీవు ఎంత ఎక్కువ దూరం రాంగ్ వేలో వెళితే.. తిరిగి వెనక్కి రావడం అంత కష్టం అవుతుంది అంటూ స్వామి వివేకానంద చెప్పిన కొటేషన్ ని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Mega Family
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఈ పోస్ట్ నీ కొడుకు వరుణ్ తేజ్ మట్కా మూవీ గురించే కదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మెగా అభిమానులు అల్లు అర్జున్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇలా మెగా అల్లు వార్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతోంది.