'రాధేశ్యామ్'లో ప్రభాస్ లాగే, రియల్ లైఫ్ లో క్రేజీ హీరోకి ఆ విద్య తెలుసు.. రెండు విషాదాలని ముందే చెప్పేశాడు

First Published | Dec 2, 2024, 12:32 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం భారీ అంచనాలతో విడుదలై నిరాశపరిచింది. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలని అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం భారీ అంచనాలతో విడుదలై నిరాశపరిచింది. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలని అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో ప్రభాస్ ఆస్ట్రాలజీ తెలిసిన వ్యక్తిగా, హస్తసాముద్రిక నిపుణుడిగా నటించారు. 

చేయి చూసి ఎంతటి వారి భవిష్యత్తుని అయినా ఖచ్చితంగా అంచానా వేసే వ్యక్తిగా ప్రభాస్ మెప్పించారు. కథ పరంగా ఈ చిత్రం బాగానే ఉంటుంది కానీ.. ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడు విఫలం చెందారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. రియల్ లైఫ్ లో ఆ విధంగా ఆస్ట్రాలజీ తెలిసిన క్రేజీ హీరో ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న జగపతి బాబు. 


Also Read: మద్యం బాటిల్ తో కశ్మీర్ లో పోలీస్ స్టేషన్ వరకు, రెప్పపాటులో చావు నుంచి జగపతి బాబు ఎస్కేప్..ఫ్రెండ్ లవ్ కోసం

Latest Videos


ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు తన జ్యోతిష్యం నైపుణ్యం గురించి ఓపెన్ అయ్యారు. మీకు జ్యోతిష్యం తెలుసు అట కదా అని యాంకర్ ప్రశ్నించారు. జగపతి బాబు సమాధానం ఇస్తూ చిన్నతనంలోనే జ్యోతిష్యానికి సంబంధించిన విద్య నేర్చుకున్నా. రెండుసార్లు జ్యోతిష్యం చెప్పా.. రెండుసార్లు కూడా విషాదమే చెప్పాల్సి వచ్చింది. ఆ విషాదాలు చెప్పినవి చెప్పినట్లు జరిగాయి. విషాదాలు ముందే చెప్పాల్సి రావడం, అవి జరుగుతుండడంతో ఇక జ్యోతిష్యం జోలికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నట్లు జగపతి బాబు తెలిపారు. 


Also Read: డాక్టర్ గా, మోడల్ గా రాణించిన పవన్ హీరోయిన్.. పర్సనల్ లైఫ్ లో కన్నీటి కష్టాలు, వదిలేసి వెళ్లిపోయిన భర్త

జ్యోతిష్యం అవసరం లేదు అనిపించింది. కాలమే ఏదో ఒక సమయంలో మనకి అన్నీ చెబుతుంది. అలాంటప్పుడు ముందే తెలుసుకోవడం ఎందుకు అని జగపతి బాబు అన్నారు. ఆ తర్వాత జ్యోతిష్యం జోలికి వెళ్ళలేదు అని జగపతి బాబు తెలిపారు. రాధే శ్యామ్ చిత్రంలో జగపతి బాబు కూడా నటించారు. 

ప్రభాస్ చేత తన జాతకం చెప్పించుకునే బిలీనియర్ పాత్రలో జగపతి బాబు నటించిన సంగతి తెలిసిందే. కానీ రియల్ లైఫ్ లో ఆయనకి ఆ విద్య తెలియడం విశేషం. 

click me!