విష్ణుప్రియకు రీతూ చౌదరి షాక్, కీలక సమయంలో హ్యాండ్, తాను ఎందుకు వెళ్లలేదో చెప్పిన బోల్డ్ యాంకర్!

First Published | Dec 2, 2024, 12:55 PM IST

బిగ్ తెలుగు సీజన్ 8లో రీతూ చౌదరి ఎంట్రీ దాదాపు అనివార్యమే అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆమె రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఫైనల్లీ ఈ అంశంపై రీతూ చౌదరి ఓపెన్ అయ్యారు. 
 

Jabardasth Rithu Chowdary


సీరియల్ నటిగా కెరీర్ ఆరంభించిన రీతూ చౌదరి పాప్యులర్ కామెడీ షో జబర్దస్త్ తో వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్ళు రీతూ చౌదరి జబర్దస్త్ లేడీ కమెడియన్ గా చేశారు. ఎక్కువగా రీతూ చౌదరి హైపర్ ఆది టీమ్ లో స్కిట్స్ చేసేది. కారణం తెలియదు కానీ.. జబర్దస్త్ కి ఆమె దూరం అయ్యారు. 

Rithu Chowdary

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పాపులారిటీ మైంటైన్ చేస్తుంది. బోల్డ్ ఫోటో షూట్స్ తో రీతూ చౌదరి తరచుగా వార్తల్లో ఉంటుంది. ఆమె హాట్ లుక్స్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. అవేమీ రీతూ చౌదరి పట్టించుకోదు. తన పని తాను చేసుకుపోతుంది. నటిగా కూడా ఆమె రాణిస్తున్నారు. ఒకటి రెండు వెబ్ సిరీస్లలో రీతూ చౌదరి కనిపించింది. 

Latest Videos


Rithu Chowdary

ఇక దావత్ పేరుతో యూట్యూబ్ ఛానల్ లో రీతూ చౌదరి ఓ టాక్ షో చేసింది. హోస్ట్ గా గెస్ట్స్ ని ఈమె అడిగే ప్రశ్నలు పచ్చిగా ఉండేవి. డబుల్ మీనింగ్ తో కూడిన ఆ సంభాషణలు వైరల్ అయ్యాయి. కాగా రీతూ చౌదరి, విష్ణుప్రియ బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరూ కలిసి విహారాలకు వెళ్తారు. లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. బిగ్ బాస్ తెలుగు 8లో రీతూ చౌదరి, విష్ణుప్రియ కంటెస్ట్ చేస్తున్నారు. దాదాపు ఖాయం అయ్యింది అన్నారు. 

Amardeep Chowdary

విష్ణుప్రియ రాకపై కొంత అనుమానం ఉంది. గతంలో విష్ణుప్రియ బిగ్ బాస్ షోకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసింది. తనకు అంతగా ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. రీతూ చౌదరి పక్కా అనుకున్నారు. కానీ విష్ణుప్రియ వచ్చింది. రీతూ చౌదరి మాత్రం ఆమె అభిమానులను నిరాశపరిచింది. బిగ్ బాస్ షోలో పాల్గొనకపోవడం పై రీతూ చౌదరి తాజాగా స్పందించింది. 

Rithu Chowdary

మీరు బిగ్ బాస్ షోకి ఎంపికయ్యారని కథనాలు వెలువడ్డాయి.. దాదాపు ఖాయం అన్నారు. అసలు ఏం జరిగిందని అడగ్గా.. ఏమీ జరగలేదు. రైట్ టైం లో రైట్ థింగ్స్ జరుగుతాయని నేను నమ్ముతాను. అంతే అన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ.. నాకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టం. నేను ఫస్ట్ సీజన్ నుండి ఫాలో అవుతున్నాను. అసలు నేనేంటో నాకు తెలియడానికి, నన్ను నేను చూసుకోవడానికి అది మంచి ఫ్లాట్ ఫార్మ్. 

Rithu Chowdary-Vishnupriya

బిగ్ బాస్ షోకి వెళ్లాలని నాకు ఉంది.. అన్నారు. సీజన్ 8లో నీ బెస్ట్ ఫ్రెండ్ విష్ణుప్రియ ఉంది. ఆమె ఎలా ఆడుతుంది? అని యాంకర్ అడిగాడు. సీజన్ 8 నేను చూడటం లేదు. ఇంస్టాగ్రామ్ లో రీల్స్, చిన్న చిన్న బిట్స్ మాత్రమే చూస్తున్నాను. బిజినెస్ తో పాటు షూట్స్ వల్ల బిజీగా ఉండి, ఫాలో కావడం లేదని రీతూ చెప్పుకొచ్చింది. రీతూ-విష్ణుప్రియకు చెడిందని సమాచారం. అందుకే ఆమె గేమ్ గురించి మాట్లాడలేదు, సపోర్ట్ చేయలేదనే టాక్ ఉంది. మరో రెండు వారాల్లో ఫైనల్ కాగా.. కీలక సమయంలో మద్దతు తెలపకుండా.. విష్ణప్రియకు రీతూ షాక్ ఇచ్చింది. 

click me!