కాంతార చాప్టర్ 1 నటి రుక్మిణి వసంత్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.. తండ్రి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు

Published : Oct 06, 2025, 01:49 PM IST

కాంతార చాప్టర్ 1 చిత్రంలో రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటించింది. క్రమంగా సౌత్ లో ఆమె క్రేజీ హీరోయిన్ గా మారుతోంది, ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీలో కూడా రుక్మిణి నటిస్తోంది. ఆమె గురించి కొన్ని సంచలన విషయాలు ఈ కథనంలో అందిస్తున్నాం. 

PREV
15
Rukmini Vasanth

కాంతార చాప్టర్ - 1లో నటించిన రుక్మిణి వసంత్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో కనకవతి పాత్ర పోషించిన రుక్మిణి, తన అద్భుతమైన నటన, అందంతో ప్రశంసలు అందుకుంటోంది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ నటి సోషల్ మీడియాలో నేషనల్ క్రష్‌గా, అభిమానుల ఫేవరెట్‌గా మారింది.

25
ఆమె తొలి చిత్రం అదే

28 ఏళ్ల రుక్మిణి వసంత్ బెంగళూరులో జన్మించింది. ఈమె కన్నడ సినిమా నటి. తమిళ, తెలుగు సినిమాల్లో కూడా తన నటనతో ఆకట్టుకుంది. 2019లో వచ్చిన 'బీర్బల్' అనే కన్నడ సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది.

ఆ తర్వాత మద్రాసీ, బఘీరా, ఏస్ వంటి అద్భుతమైన థ్రిల్లర్స్‌లో నటించింది. ఇప్పుడు రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ - 1'లో అందరి ఫేవరెట్ క్యారెక్టర్‌గా మారింది.

35
బాక్సాఫీస్ వసూళ్లు 

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా అద్భుతంగా రాణిస్తోంది. రిషబ్ శెట్టి 'కాంతార: చాప్టర్-1' మొదటి రోజున రూ. 61.85 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు, శుక్రవారం, రూ. 43.65 కోట్లు సంపాదించింది. మూడో రోజు (శనివారం) రూ. 55 కోట్లు వసూలు చేసింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ. 162.85 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్ గా ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ రాబట్టింది.

45
రుక్మిణి వసంత్ తదుపరి చిత్రాలు

కాంతార చాప్టర్ - 1లో రుక్మిణి వసంత్ అద్భుతమైన నటన ఆమె ప్రతిభకు నిదర్శనం. ఆమె భవిష్యత్ సినిమాల విషయానికొస్తే, వచ్చే ఏడాది విడుదల కానున్న కేజీఎఫ్ స్టార్ యశ్ 'టాక్సిక్'లో కనిపించనుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ, కరీనా కపూర్ ఖాన్ కూడా నటిస్తున్నారు.

అదే విధంగా రుక్మిణి వసంత్ మరో భారీ పాన్ ఇండియా చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీలో రుక్మిణి వసంత్ నటిస్తోంది. 

55
ఆమె తండ్రి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు

రుక్మిణి వసంత్ తండ్రి గురించి తెలిస్తే ఎవరైనా భావోద్వేగానికి గురి కావలసిందే. ఆమె తండ్రి ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసిన కల్నల్ వసంత్ వేణుగోపాల్. రుక్మిణి వసంత్ కి 7 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే 2007లో ఆయన ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. భారత ప్రభుత్వం ఆయనకి అశోక చక్ర అవార్డు ప్రధానం చేసింది. కర్ణాటక నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి సైనికుడు ఆయనే. 

Read more Photos on
click me!

Recommended Stories