Meena: రారా పోరా అంటాడు.. సెట్ లో మీనాను బెదిరించిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Published : Nov 22, 2026, 11:00 AM IST

Meena: సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది మీనా. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. కానీ అందరిలో ఒక హీరో మాతరం చాలా డిఫరెంట్ గా అనిపించాడట. ఇంతకీ ఎవరా హీరో ? షూటింగ్ సెట్ లో మీనాను బెదిరించిన నటుడు ఎవరు?

PREV
14
తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా..

సహజమైన అందం, అద్భుతమైన నటనతో మీనా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 1980-90ల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, సుమన్, శ్రీకాంత్, తమిళంలో.. రజినీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, సత్యరాజ్, శరత్‌కుమార్, అజిత్ కుమార్ వంటి ఎందరో టాప్ హీరోలతో కలిసి హిట్ సినిమాల్లో నటించింది. ఇప్పటికీ కూడా తమిళం, తెలుగు, మలయాళంలో బిజీ ఆర్టిస్ట్ గానే కొనసాగుతోంది మీనా.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన నటి మీనా, 'అల్లరి మొగుడు' సినిమా షూటింగ్ సమయంలో నటుడు మోహన్ బాబుతో తన అనుభవాలను.. ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ సమయంలో తన వయసు తక్కువని, ఎంతో అమాయకంగా ఉండేదానినని ఆమె గుర్తు చేసుకున్నారు.

24
మీనాను బెదిరించిన స్టార్ హీరో..

'అల్లరి మొగుడు' చేసే నాటికి మీనా చాలా యంగ్‌.. అప్పుడప్పుడే హీరోయిన్ గా తెలుగులో ఫేమస్ అవుతున్నారు. ఈక్రమంలో తనకు తెలుగు కూడా సరిగ్గా రాదు. దాంతో హీరోలు వేసే జోకులను వెంటనే అర్థం చేసుకునేంత పరిణతి అప్పుడు తనకు లేదు. కొన్ని పదాలకు అర్థం తెలియకపోవడం వల్ల సెట్‌లో ఇతరులు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది కాస్త ఆలస్యంగా అర్థమయ్యేదని మీనా అన్నారు. మోహన్ బాబు అదే టైమ్ లో మీనాను బెదిరించినట్టుగామాట్లాడటం.. తెలుగులో జోకులు వేయడం లాంటివి చేసేవారట. అది అర్ధం అవ్వడానికి మీనాకు చాలా టైమ్ పట్టేదట.

34
మోహన్ బాబు అందరికంటే చాలా డిఫరెంట్..

మోహన్ బాబు మిగతా హీరోలందరికీ పూర్తి భిన్నంగా ఉండేవారని మీనా వివరించారు. ఆయన హడావడిగా, ధామధూమ్‌గా రావడం, మాట్లాడటం, అందరినీ 'రేయ్', 'రారా', 'పోరా' అంటూ పిలిచే తీరు తనకు కొత్తగా అనిపించిందని చెప్పారు. తమిళంలో కానీ, తెలుగులో కానీ అలాంటి అలవాట్లు ఉన్న హీరోను తాను ఇంతకుముందు చూడలేదని తెలిపారు.సరదాగా బెదిరించడం, కామెడీగా మాట్లాడటం చేసేవారని, కానీ అప్పుడు అవన్నీ కామెడీ కోసం చేస్తున్నారని తనకు తెలియదని మీనా అన్నారు. మొదట్లో ఆయనంటే కొంచెం భయం ఉండేదని, అసలు మాట్లాడేదానిని కాదని, కొత్త పరిచయాలతో ఏమీ తెలియనట్లు ఉండేదానినని గుర్తు చేసుకున్నారు.

44
మంచు ఫ్యామిలీతో స్నేహం..

షూటింగ్ సమయాల్లో మోహన్ బాబు కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మంచు లక్ష్మీ, విష్ణు వంటి వారితోస్నేహంగా ఉండేవారని మీనా చెప్పారు. అందరూ కలిసి కూర్చుని అంతాక్షరి, మ్యూజికల్ ఛైర్స్ వంటి ఆటలు ఆడుకుంటూ సరదాగా గడిపేవారని, ఆ క్షణాలు చాలా ఫన్నీగా ఉండేవని తెలిపారు. కాలక్రమేణా మోహన్ బాబు గారి గురించి తనకు బాగా అర్థమైందని, బయట కనిపించే తీరుకు భిన్నంగా ఆయన లోపల ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని మీనా పేర్కొన్నారు. అందరినీ తెలుసుకోవడానికి తనకు కొంత సమయం పట్టిందని, రానురాను అందరితో స్నేహంగా మారానని అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories