Anirudh Kaviya Maran Wedding Reception: అనిరుధ్, కావ్య మారన్ జంట వివాహ రిసెప్షన్ వేడుకకు సీఎం విజయ్, సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సౌత్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్న అనిరుధ్, సన్ పిక్చర్స్ కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం గ్రీస్ దేశంలో నవంబర్ 11న జరిగింది. వివాహం అనంతరం వెంటనే చెన్నైకి తిరిగి వచ్చిన ఈ నూతన దంపతులు తమ వివాహ రిసెప్షన్ ని శనివారం రాత్రి చెన్నైలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇందులో తమిళనాడు సీఎం విజయ్ పాల్గొని నూతన వధూవరులకు ఆశీర్వదించారు.
213
సీఎం తో సూపర్ స్టార్, మాజీ సీఎం
అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్ కి వచ్చిన తమిళనాడు సీఎం విజయ్ కి సూపర్ స్టార్ రజనీకాంత్, కళానిధి మారన్, డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం ఎం.కే.స్టాలిన్ తదితరులు స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
313
కమల్ హాసన్ స్పెషల్ ఎట్రాక్షన్
అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్ లో డీఎంకే అధ్యక్షుడు ఎం.కే.స్టాలిన్, ప్రతిపక్ష నేత ఉదయనిధి, సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ హాజరయ్యారు. స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.
డీఎంకే ఎంపీ కనిమొళి చిరునవ్వుతో వచ్చి అనిరుధ్ - కావ్య వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు.
513
కేరళ సీఎం హాజరు
కేరళ ముఖ్యమంత్రి సతీశన్, కవి వైరముత్తు ఇద్దరూ కలిసి వచ్చి అనిరుధ్, కావ్య మారన్ జంటకు పూలగుత్తి ఇచ్చి తమ శుభాకాంక్షలు తెలిపారు.
613
స్టాలిన్ ఎంట్రీ
తన కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు విచ్చేసిన మాజీ సీఎం ఎం.కే.స్టాలిన్, ఆయన భార్య దుర్గా స్టాలిన్, ఆయన అల్లుడు శబరీశన్ లకు కళానిధి మారన్ స్వాగతం పలికారు.
713
ఆండవర్ దర్శనం
అనిరుధ్, కావ్య మారన్ జంటకు కమల్ హాసన్ స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న సండియర్ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు .
813
లారెన్స్ మాస్టర్ శుభాకాంక్షలు
నటుడు, దర్శకుడు, డాన్స్ మాస్టర్ ఇలా బహుముఖ ప్రతిభ గల లారెన్స్ మాస్టర్ ఈ వివాహ రిసెప్షన్ లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
913
ప్రభు ప్రేమ
శివాజీ గణేశన్ కుమారుడు ప్రభు తన భార్యతో కలిసి వచ్చి అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్ లో పాల్గొన్నారు. ఆ అద్భుతమైన ఫోటో ఇది.
1013
నటుడు సతీష్ శుభాకాంక్షలు
హాస్య నటుడిగా ఉండి ప్రస్తుతం హీరోగా ఎదిగిన సతీష్ కోటు సూటు వేసుకుని స్టైలిష్ గా వచ్చి అనిరుధ్ - కావ్య జంటను ఆశీర్వదించారు.
1113
అరసన్ వచ్చాడు
అనిరుధ్ వివాహ రిసెప్షన్ వేడుకలో నిర్మాత కలైపులి ఎస్ థాను పాల్గొన్నారు. ప్రస్తుతం థాను నిర్మాణంలో రూపొందుతున్న అరసన్ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించగా శింబు హీరోగా నటిస్తున్నాడు.
1213
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సందడి
చెన్నైలో జరిగిన కావ్యా మారన్- అనిరుధ్ ల వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
1313
మాజీ సీఎంల కలయిక
అనిరుధ్ - కావ్య మారన్ వివాహ రిసెప్షన్ వేడుకకు విచ్చేసిన మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి డీఎంకే అధ్యక్షుడు ఎం.కే.స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్ లతో ఉల్లాసంగా ముచ్చటించారు.