ఆ తర్వాత రజనీతో ముత్తు, అన్నత వంటి చిత్రాల్లో మీనా నటించింది. తమిళ చిత్రసీమలో టాప్ హీరోగా ఉన్న రజనీతో ఎక్కువ సినిమాల్లో నటించిన మీనా.. మరో టాప్ స్టార్ కమల్ హాసన్ తో ఒకే ఒక్క సినిమాలో నటించింది. అది అవ్వై షణ్ముఖి. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది.