హీరోగా రూ. 3 కోట్లు తీసుకున్న సునీల్... మరి విలన్ గా ఆయన రెమ్యూనరేషన్ ఎంత? అంతకు పడిపోయాడా!

First Published Jun 18, 2024, 11:27 AM IST

సునీల్ ఒకప్పుడు స్టార్ కమెడియన్. హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. అయితే కంటిన్యూ కాలేకపోయాడు. ప్రస్తుతం విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. హీరోగా రూ. 3 కోట్ల వరకు తీసుకున్న సునీల్ ప్రస్తుత రెమ్యునరేషన్ తెలిస్తే అయ్యో అంటారు.. 
 

Actor Sunil

2000 లో విడుదలైన నువ్వే కావాలి చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు సునీల్. దర్శకుడు తేజ తెరకెక్కించిన నువ్వు నేను ఆయనకు బ్రేక్ ఇచ్చింది. కాలేజ్ స్టూడెంట్ గా సునీల్ కామెడీ నవ్వులు పూయిస్తోంది. తనదైన హావభావాలు, డైలాగ్ డెలివరీ క్రియేట్ చేసుకున్న సునీల్ అనతి కాలంలోనే స్టార్ కమెడియన్ అయ్యారు.

Sunil

2002 నాటికి సునీల్ టాలీవుడ్ బిజీ కమెడియన్ అయ్యారు. ఏడాదికి 20 కి పైగా సినిమాలు చేసేవాడు సునీల్. చాలా సినిమాల్లో హీరోకి సమానంగా సునీల్ కి స్క్రీన్ స్పేస్ ఉండేది. కొన్ని చిత్రాల్లో ఆయన పాత్ర సెకండ్ హీరోని తలపిస్తుంది. ఈ క్రమంలో అందాల రాముడు చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. 

అయినప్పటికీ సునీల్ కమెడియన్ గానే చేశారు. ఏకంగా రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. 2010లో విడుదలైన మర్యాద రామన్న సూపర్ హిట్. దర్శకుడు వర్మ తెరకెక్కించిన కథ స్క్రీన్ ప్లే అప్పలరాజు ఓ మోస్తరు విజయం అందుకుంది. పూల రంగడు మూవీతో హీరోగా మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు.

Actor Sunil


ఈ క్రమంలో సునీల్ రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లకు చేరిందని సమాచారం. సిక్స్ ప్యాక్ ట్రై చేసిన సునీల్ మాస్ హీరో కావాలని ఆశపడి బొక్కబోర్లా పడ్డాడు. తాను కమెడియన్ అన్న విషయాన్ని మరచిపోవడంతో ప్లాప్స్ ఎదురయ్యాయి. ఒక దశలో సునీల్ కెరీర్ అయోమయంలో పడింది. హీరోగా చేయాలా లేదా మరలా కమెడియన్ రోల్స్ చేయాలా అనే సందిగ్ధానికి గురయ్యాడు. 

అరవింద సమేత వీరరాఘవ మూవీతో మరలా కమెడియన్ అవతారం ఎత్తాడు. కలర్ ఫోటో మూవీలో అనూహ్యంగా నెగిటివ్ రోల్ చేశాడు. మొదటి ప్రయత్నం సక్సెస్ అయ్యింది. పుష్ప వంటి భారీ పాన్ ఇండియా మూవీలో సునీల్ మెయిన్ విలన్ గా చేయడం విశేషం. దర్శకుడు ఆయన్ని నమ్మినందుకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు.

Actor Sunil

ప్రస్తుతం సునీల్ వివిధ భాషల్లో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. కమెడియన్ రోల్స్ పెద్దగా చేయడం లేదు. కాగా జైలర్ మూవీలో ఆయన ఒక విలక్షణ పాత్ర చేశాడు. రజినీకాంత్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ చిత్రానికి సునీల్ రూ. 40 నుండి రూ. 60 లక్షలు తీసుకున్నాడని సమాచారం.

కాబట్టి విలన్/క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సునీల్ రెమ్యూనరేషన్ రూ. 40 నుండి 60 లక్షలు అట. ఆయన హీరోగా తీసుకున్న రెమ్యునరేషన్ తో ఇది చాలా తక్కువ. అయితే హీరోగా ఏడాదికి రెండు మూడు సినిమాలు మాత్రమే చేయగలడు. అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 10 సినిమాలకు పైగా చేయవచ్చు. ఆ విధంగా సునీల్ ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.. 

Latest Videos

click me!